• తాజా వార్తలు

సోషల్ మీడియాను మరిపించే ఈ 6 యాప్స్ మీకోసం

 

ఆఫీస్‌లో,  ఇంట్లో, ట్రావెలింగ్‌లో ఎక్క‌డ కాస్త ఖాళీ దొరికినా స్మార్ట్‌ఫోన్ మీద మీ వేళ్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్ లాంటి సోష‌ల్ మీడియా మీదికి వెళ్లిపోతున్నాయా? అందులో గంట‌లు గంట‌లు స్పెండ్ చేశాక అరే.. ఇంత టైం వేస్ట్ చేశామా అనిపిస్తోందా? అయితే మీ లీజ‌ర్ టైమ్‌ను ప‌నికొచ్చేలా వాడుకునే కొన్ని యాప్స్ ఉన్నాయి.  నాలెడ్జ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫో ఇలా ఏదో ఒక‌ర‌కంగా మీకు రిలీఫ్ ఇచ్చే కొన్ని యాప్స్ ఇవిగో..  
1.  బ్లింకిస్ట్  (Blinkist)
ప్ర‌పంచంలో రోజూ కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు పుట్టుకొస్తున్నాయి.  కొత్త ఐడియాలు, ట్రెండ్స్ వ‌స్తున్నాయి. వాటి గురించి తెలుసుకోవ‌డానికి ఈ బ్లింక్సిట్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో దాదాపు 2వేల నాన్ ఫిక్ష‌న్ టైటిల్స్ ఉన్నాయి. ఒక్కోటి 15 నిమిషాల నిడివి. ఆడియో ఆప్ష‌న్ కూడా ఉంది. మీ నాలెడ్జ్‌ను పెంచుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ యాప్ దొరుకుతుంది. 
2.  హండ్రెడ్ ఆఫీస్ వ‌ర్క‌వుట్స్  (100 Office Workouts)
వ్యాయామం చేయ‌డానికి టైం స‌రిపోవ‌డం లేదు.. అని బాధ‌ప‌డేవారికి ప‌నికొచ్చే యాప్ ఇది.  జిమ్‌కు వెళ్లే ప‌ని లేకుండా ఇల్లు, ఆఫీస్ వాతావ‌ర‌ణంలో కూడా సింపుల్‌గా చేసుకోద‌గ్గ ఎక్స‌ర్ సైజ్‌లు ఇందులో చాలా ఉంటాయి.  ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే ఉన్న ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకుని ఫాలో అయ్యారంటే  మీ బ‌ద్ధ‌కం వ‌దిలిపోయిన‌ట్లే. 
3. షాప‌ర్‌   Shapr

మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప‌్ర‌మోష‌న్ ఎలా సంపాదించాల‌ని ఆలోచిస్తున్నారా?  ప్ర‌తి రంగంలోనూ కొంత మంది నిపుణులుంటారు. వాళ్లతో ప‌రిచ‌యం ఇందుకు ఉప‌యోగ‌ప‌డొచ్చు. ఇలాంటి ప్ర‌య‌త్న‌మే Shapr యాప్‌. మీ ప‌ర్స‌న‌ల్  ప్రొఫైల్‌ను బ‌ట్టి మీ రిలేటెడ్ సెక్టార్‌లోని వారితో నెట్‌వ‌ర్క్ ఏర్ప‌రుచుకునేలా  స‌జెష‌న్స్ పంపిస్తుంది. అంటే మీకో నెట్‌వ‌ర్క్‌ను అదీ జాబ్‌, ప్ర‌మోష‌న్‌, కొత్త సెక్టార్లోకి వెళ్ల‌డం ఇలా మీ కెరీర్‌కు ప‌నికొచ్చే స‌జెష‌న్స్‌, నెట్‌వ‌ర్క్ బిల్డ‌ప్ చేసే ఈ యాప్ ఐవోస్‌, ఆండ్రాయిడ్ల‌లోనూ ల‌భిస్తుంది.  

4.  డేలియో Daylio
చాలామంది త‌మ డైలీ ప్లాన‌ర్ రాసుకుంటారు. ఇలాంటి యాక్టివిటీకి ప‌నికొచ్చేదే డేలియో యాప్‌.  ఈ యాప్ ఐవోస్‌, ఆండ్రాయిడ్ల‌లోనూ ల‌భిస్తుంది.  దీనిలో మీ యాక్టివిటీని, మూడ్‌ను రికార్డ్  చేయొచ్చు.  మీ డైలీ యాక్టివిటీ మీద నోట్స్ రాసుకోవ‌చ్చు.  అంతేకాదు మీ యాక్టివిటీని రివ్యూ చేసుకుని  మ‌రింత త‌క్కువ స్ట్రెస్‌తో మీ రోజును ఇంకా ఎంత ప్ర‌యోజ‌న‌క‌రంగా మార్చుకోవ‌చ్చో ఈ యాప్‌తో గుర్తించ‌వ‌చ్చు.  


5. స్టెప్ బెట్ StepBet
ఈరోజు కాస్త ఎక్కువ సేపు వాకింగ్ చేయాలి. కొన్ని పుల‌ప్స్ ఎక్కువ తీయాలి. ఇలాంటి ఫిట్‌నెస్ గోల్స్ పెట్టుకుని ఫుల్‌ఫిల్ చేయాల‌నుకుంటున్నారా? అయితే స్టెప్‌బెట్ యాప్ మీ కోస‌మే. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సైన్ అప్ మీ హైట్‌, వెయిట్ వంటి ఫిజిక‌ల్ డిటెయిల్స్ రికార్డ్ చేయాలి.  యాప్ మీకు డైలీ, వీక్లీ ఫిట్‌నెస్ గోల్స్ పెడుతుంది. వాటిని రీచ్ అయితే కొద్ది మొత్తంలొ క్యాష్ ఇన్సెంటివ్  కూడా ఇస్తుంది.   ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫార‌మ్స్‌లో దొరుకుతుంది. 
6. ట్రిప్ డాట్ కామ్ Trip.com
ఎప్పూడూ ఆఫీస్‌, టార్గెట్లు, సెమినార్లు అంటూ టెన్ష‌న్‌తో గ‌డిపేవారికి కాస్త రిలీఫ్ కోసం బ‌య‌టికి ఎక్క‌డిక‌యినా టూర్ ప్లాన్ చేయాల‌నుకుంటే ట్రిప్‌డాట్ కామ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.   ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫార‌మ్స్‌లో ల‌భించే ఈ యాప్లో  మీ ప్రొఫైల్‌ను, మీ ఇంట్ర‌స్ట్‌ల‌ను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బ‌ట్టి యాప్ మీకు స‌రిపోయే ట్రిప్స్ ప్లాన్ స‌జెష‌న్లు పంసి్తుంది. ఎలాంటి ప్లేసెస్ చూడొచ్చు. అక్క‌డ హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ వంటి వివ‌రాల‌న్నీ ఈ స‌జెష‌న్స్‌లో ఉంటాయి. ప్రైస్ కంపేరిజ‌న్‌, రివ్యూలు చెక్ చేసుకోవ‌డం, మీ అనుభ‌వాల‌ను షేర్ చేసుకోవ‌డం కూడా దీనిలో ఈజీ .

జన రంజకమైన వార్తలు