• తాజా వార్తలు
  •  

గైడ్‌: ఉచితంగా బ్రోచ‌ర్లు చేసి పెట్టే వెబ్‌సైట్స్‌కి గైడ్ 

మ‌న‌కు చాలా సంద‌ర్భాల్లో బ్రోచ‌ర్లు అవ‌స‌రం అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి వీటి అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది.  అయితే వాటి కోసం చాలామంది గ్రాఫిక్ డిజైన‌ర్ల మీద ఆధార‌ప‌డ‌తారు. అందుకోసం బాగానే ఖ‌ర్చు చేస్తారు. అయితే ఈ బ్రోచ‌ర్ల‌ను మీరు ఉచితంగా పొందితే...! అదెలాగంట‌రా? ...దీనికి కొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి. ఉచితంగా మ‌న‌కు బ్రోచ‌ర్లు చేసి పెట్టేందుకు అందుబాటులో ఉన్న ఆ వెబ్‌సైట్లేమిటో చూద్దామా..

కెన్‌వా
ఆన్‌లైన్‌లో ఉచితంగా బ్రోచ‌ర్లు చేయ‌డానికి కెన్‌వా అనే వెబ్‌సైట్ ఉంది. దీనిలో చాలా ర‌కాల‌, అంద‌మైన టెంప్లెట్లు ఉంటాయి. మీ బ్రోచ‌ర్‌ను మీరు వెంట‌నే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇమేజ్‌ల‌ను అప్‌లోడ్ చేసి టెక్ట్‌ను ఎంట‌ర్ చేసి.. మీకు న‌చ్చిన డిజైన్ల‌లో బ్రోచ‌ర్ల‌ను రూపొందించుకోవ‌చ్చు. దీనిలో ఉన్న సెర్చ్ ఫీచ‌ర్ ద్వారా మీకు న‌చ్చిన డిజైన్ల‌ను కూడా వెతుక్కునే అవ‌కాశం ఉంది. దీనిలో రెండు ఎడిటింగ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి డిజైన్ టూల్‌. రెండోది. వ‌ర్కింగ్ స్పేస్‌. డిజైన్ టూల్‌లో లే అవుట్స్‌, ఎలిమెంట్స్‌, టెక్ట్, బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్ష‌న్లు ఉంటాయి. 

క్రెలో..
ఆన్‌లైన్‌లో బ్రోచ‌ర్ల త‌యారీ కోసం వాడే మ‌రో వెబ్‌సైట్  క్రెలో.. సోష‌ల్ మీడియా పోస్టులతో పాటు అనోటేట్ పిక్చ‌ర్స్ త‌దిత‌ర ఉప‌యోగాలు దీనిలో ఉన్నాయి. ప‌నితీరు ప‌రంగా క్రెలో... కెన్‌వా రెండూ ఒకే  విధంగా ఉంటాయి. కెన్‌వాలో మాదిరే క్రెలోలో కూడా మీకు అన్ని ఆప్ష‌న్లు ల‌భ్యం అవుతాయి. దీనితోపాటు కొన్ని అద‌న‌పు టూల్స్ కూడా దీనిలో ఉన్నాయి. దీనిలో ఉన్న ఇన్సిపిరేష‌న్ సెక్ష‌న్ వ‌ల్ల కొత్త కొత్త బ్రోచ‌ర్ ఐడియాల‌ను కూడా మ‌నం పొందే అవ‌కాశం ఉంది. మీకు సంబంధించిన సొంత ఫాంట్‌ల‌ను కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు ఇందులో. 

లుసిడ్‌ప్రెస్‌
లూసిడ్ ప్రెస్ కూడా ఆన్‌లైన్‌లో బ్రోచ‌ర్ల త‌యారీ కోసం వాడే టూల్‌. విజువ‌ల్ కంటెంట్ డిజైనింగ్ కోసం దీన్ని ఉప‌యోగిస్తారు. స్ట‌న్సింగ్ డిజైన్లు చేయ‌డం  కోసం ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కెన్‌వా, క్రెలో మాదిరిగా ఇదేమీ మ‌రీ ఎక్కువ ఆప్ష‌న్లు ఉన్న టూల్ కాదు. కానీ విజువ‌ల్  ప‌రంగా మంచి డిజైన్లు రూపొందించ‌డానికి ఇది మంచి ఆప్ష‌న్‌.  టెక్ట్‌ను యాడ్ చేయ‌డం, షేప్స్ ఇన్‌స‌ర్ట్ చేయ‌డం, క‌స్ట‌మ్ బ్యాక్‌గ్రౌండ్ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి.బ్రోచ‌ర్‌లో టేబుల్స్ ఇన్‌స‌ర్ట్ చేసుకోవ‌డం, సైజు ఎడ్జెస్ట్ చేసుకోవ‌డం లాంటి ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.     

అడోబ్‌ స్పార్క్‌
ఆన్‌లైన్‌లో ఉచితంగా బ్రోచ‌ర్లు చేయ‌డానికి అడోబ్ స్పార్క్ టూల్ కూడా మంచి ఆప్ష‌న్‌. స్ట‌న్నింగ్ ఇమేజ్‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిలో ఉన్న లైబ్ర‌రీలో మ‌న‌కు ఎన్నో వంద‌ల అంద‌మైన టెంప్లెట్లు ఉన్నాయి. వాటిని ఉప‌యోగించుకుని మ‌న‌కు న‌చ్చిన డిజైన్‌లో బ్రోచ‌ర్లు రూపొందించుకోవ‌చ్చు. దీంతో క‌స్ట‌మ్ సైజు బ్రోచ‌ర్‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హాఫ్ ఫోల్డింగ్‌, ట్రై ఫోల్డింగ్ బ్రోచ‌ర్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.