• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు అందించే యాప్‌లకు పక్కా గైడ్

ప్ర‌స్తుతం న‌డుస్తుంది ఆన్‌లైన్ ట్రెండ్‌. బ‌య‌ట కొన‌డం కంటే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే స‌మ‌యం క‌లిసొస్తుంద‌ని...శ్ర‌మ త‌గ్గుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అందుకే వీలైనంత ఎక్కువ‌గా ఆన్‌లైన్ షాపింగ్‌నే వినియోగ‌దారులు ప్రిఫ‌ర్ చేస్తున్నారు. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఇ-కామ‌ర్స్ సైట్లు సైతం మంచి మంచి ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు భారీగానే ఉన్నా వాటి గురించి అంద‌రికి తెలియ‌దు. ప్ర‌తి సైట్ చూసి తెలుసుకునే స‌మ‌యం మ‌న‌కు ఉండ‌దు. అలాంటి వారి కోసమే కొన్ని ప్ర‌త్యేక‌మైన యాప్‌లు వ‌చ్చాయి. వీటి సాయంతో మ‌నం డిస్కౌంట్ల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

గ్రాబ్ ఆన్‌
ఆన్‌లైన్ షాపింగ్‌లో డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు తెలుసుకోవ‌డానికి గ్రాబ్ ఆన్ మంచి యాప్‌. దీనిలో ఎనిమిది కోట్ల కూప‌న్లు రీడీమ్ చేసుకునే అవ‌కాశం ఉందంటేనే ఈ యాప్ ఎంత పెద్ద‌దో అర్ధం చేసుకోవ‌చ్చు. 300 పైన కేట‌గిరిల్లో ఈ కూప‌న్లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. ఫుడ్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్యాష‌న్ ఇలా కీల‌క‌మైన కేట‌గిరీల్లో మ‌నం కూపన్లు పొందొచ్చు. 3190 మ‌ర్చెంట్స్ ఈ యాప్‌తో అనుసంధానం అయి ఉన్నారు. జియో, ఫ్రీఛార్జ్‌, పేటీఎంల‌కు సంబంధించిన కూప‌న్లను కూడా మ‌నం పొందొచ్చు. 

కూప‌న్ దునియా
ఈ యాప్ ద్వారా మీరు సింపుల్‌గా కూపన్ల‌ను వాడుకుని క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. అంతేకాక ఉచితంగా కూడా కూప‌న్ల‌ను పొందే అవ‌కాశం ఉంది. 2000 కేట‌గిరిల్లో మ‌నం డిస్కౌంట్ కోడ్స్‌ను పొందే అవ‌కాన్ని ఇస్తోంది ఈ యాప్‌. అదే కాక ప్ర‌తి రూపాయి మీద పాయింట్లు వ‌చ్చే అవ‌కాశాలను ఇస్తోంది ఈ యాప్‌. ఆ పాయింట్ల‌ను త‌ర్వాత షాపింగ్‌లో ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. ఇందులో ల‌భించే అన్నికూప‌న్లు అప్‌డేటెడ్ మ‌రియు వెరిఫైడ్ అని ఆ యాప్ చెబుతోంది.

నియ‌ర్‌బై.కామ్‌
నియ‌ర్‌బై.కామ్ ద్వారా మీరు ఆన్‌లైన్ డిస్కౌంట్ల‌లో కొత్త అనుభ‌వాన్ని పొందుతారు. దీనిలో వేలాది ఆఫ‌ర్లు మీకు అందుబాటులో ఉంటాయి. తాజా డీల్స్‌, డిస్కౌంట్లతో పాటు రెస్టారెంట్స్‌, బ‌ఫెట్స్‌, పిజ్జాలు, స్పాలు, మసాజ్‌లు, సెలూన్‌లు, బ్యూటీ థెర‌పీ, జిమ్ లాంటి ప‌ర్స‌న‌ల్ కేర్‌కు సంబంధించిన అవ‌స‌రాల‌కు డిస్కౌంట్ల‌ను అందించ‌డంలో దీనికి మించింది లేదు. ఇదే కాక మూవీ టిక్కెట్లు, హోట‌ల్‌, ట్రావెల్‌, షాపింగ్ యాక్టివిటీస్ సంబంధించిన డిస్కౌంట్ల‌ను కూడా ఇది అందిస్తోంది. 

కూప‌న్ మోటో
కూప‌న్ మోటో కూడా మిగిలిన షాపింగ్ డిస్కౌంట్ యాప్‌ల మాదిరిగానే ఎన్నో ర‌కాల డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. 150కి పైగా కేట‌గిరిల్లో ఫ్యాష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఫుడ్‌, రీఛార్జ్ త‌దిత‌ర అవ‌స‌రాల కోసం కూప‌న్ కోడ్స్‌ను మ‌న‌కు అందుబాటులో ఉంచడం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. 500 పైగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల‌లోనూ ఇది డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ కూప‌న్లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటాయి.