ప్రైవసీ... ఫోన్ల విషయంలో మనకు ఎక్కువగా ఆందోళన కలిగించే అంశం ఇదే. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా ప్రైవసీ విషయంలో భంగ పడుతూనే ఉంటాం. ఎన్ని రకాల యాంటీ వైరస్లు ఉపయోగిస్తున్నా.. హ్యాకర్లు రకరకాల మార్గాల్లో మన డివైజ్‌లోకి చొరబడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే ప్రైవసీ ఈజ్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ అయిపోయిందిపుడు. మరి మీ ప్రైవసీ మీ చేతుల్లో ఉండాలంటే ఏం చేయాలి? ఏ సూత్రాలు పాటించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
మెసేజింగ్, కాల్స్
ప్రైవసీ విషయంలో మనం ఎక్కువగా ఇబ్బంది పడేది మన కాల్స్, మెసేజ్‌లే. ఎందుకంటే మనకు సంబంధించిన సున్నితమైన సమాచారం అన్యుల దగ్గరకు చేరుతుందనే ఆందోళన ఉంటుంది. వాట్సప్‌ను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనిలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్రైవసీ ఉంది. అయితే ఇది కూడా నమ్మదగిందా అనేది అనుమానం. ఓపెన్ విస్పర్ తయారు చేసిన సిగ్నల్ ఆప్షన్ వాడితే మీకు అనమానాలు తీరతాయి. టెక్ట్, ఆడియో, వీడియో, సెండింగ్ ఫైల్స్‌ను ఇది ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.
యాపిల్
ఐ మెసేజ్‌లు, ఫేస్ టైమ్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయిన ఆప్షన్లే. ఇది యాపిల్ ఎకో సిస్టమ్ లోపటే పని చేస్తాయి. దీని వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా పర్సనల్, ప్రైవేట్ మెసేజ్‌ల కోసం వికర్ బాగా ఉపయోగపడుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఇది సురక్షితంగా ఉంటుంది. మనం కాల్స్, మెసేజ్‌లు పంపినా మూడో కంటికి తెలియదు. 10 ఎంబీ సైజు ఉన్న ఫొటోలను, వీడియోలను కూడా దీని ద్వారా పంపుకోవచ్చు.
ఈమెయిల్
సెక్యూర్ మెయిల్స్ విషయంలో ప్రొటాన్ మెయిల్ అన్నిటికంటే సురక్షితం అని చెబుతున్నారు. ఉచితంగా లభించే మొబైల్ యాప్స్ కంటే కూడా ఇది చాలా సురక్షితమట. దీనిలో 500 ఎంబీ స్టోరేజ్, 150 ఈమెయిల్స్ రోజుకు వాడుకోవచ్చు. మీరు అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మెయిల్ ఫెన్స్, టుటనోటా కూడా ఇలాంటి సర్వీసులే. వీటి ద్వారా మెయిల్ చేయడం చాలా సురక్షితం.
క్లౌడ్ స్టోరేజ్
క్లౌడ్ స్టోరేజ్ లాంటి ఆప్షన్ ఉపయోగిస్తున్నప్పుడు బాక్స్ క్రైప్టర్ అనే ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. డ్రాప్ బాక్స్ , గూగుల్ డ్రైవ్ లాగే ఇది కూడా ఉపయోగపడుతుంది. పర్సనల్ యూజ్‌కు ఇది ఉచితంగా పని చేస్తుంది. ట్రెసొరిట్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో మన ఫైల్స్‌కు రక్షణ కల్పిస్తుంది. దీనిలో 1000 జీబీ ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ ఉంది. 10 డివైజ్‌ల వరకు దీన్ని వాడుకోవచ్చు. స్పైడర్ ఓక్ కూడా ఇలాంటి సురక్షిత సాఫ్ట్‌వేరే. విండోస్, మాక్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ అన్నింట్లో దీన్ని వాడుకోవచ్చు. 100 జీబీ స్టోరేజ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నెలకు 5 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.