• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ సింబ‌ల్స్‌.. ఏమిటి వాటి అర్థం? .. వాడ‌డం ఎలా?

ఈ అధునాత‌న యుగంలో ఫేస్‌బుక్ వాడ‌ని వాళ్లు ఎవ‌రుంటారు? .. చిన్న పిల్ల‌లు సైతం ఎఫ్‌బీ ఓపెన్ చేసేసి లైక్‌లు కొట్టేసి.. కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే చాలామందికి అకౌంట్లు ఉంటాయి కానీ వాడ‌డం మాత్రం అంత‌గా తెలియ‌దు. అంటే జ‌స్ట్ ఫేస్‌బుక్ ఓపెన్ చేసి పోస్ట్‌లు చ‌ద‌వ‌డం, లేదా ఏదో ఒక‌దాన్ని షేర్ చేయ‌డం త‌ప్ప మిగిలిన ఆప్ష‌న్ల జోలికి వెళ్ల‌రు. కానీ ఎఫ్‌బీలో చాలా ఆప్ష‌న్లు ఉన్నాయి. ముఖ్యంగా సింబ‌ల్స్ చాలా ఉంటాయి.  వాటిని చాలామంది స‌రిగా అర్థం చేసుకోరు. వీటిని స‌రిగా ఉప‌యోగించ‌క‌పోతే వేరేవాళ్లు మ‌న‌ల్ని అపార్థం చేసుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎవ‌రైనా చ‌నిపోయిన‌ప్పుడు బాధాక‌ర‌మైన సింబ‌ల్ పెట్టాలి.. కానీ పొర‌పాటున లైక్ కొడితే ఎలా ఉంటుంది? అందుకే ఎఫ్‌బీలో ఉన్న సింబ‌ల్స్ వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలో చూద్దాం..

సింపుల్ ఫేస్‌బుక్ సింబ‌ల్స్‌
ఫేస్‌బుక్ తెలిసిన వాళ్ల‌కు లైక్ గురించి తెలియ‌కుండా ఉండ‌దు. ఏదైనా ఫొటో క‌న‌బ‌డినా, వీడియో చూసినా వెంట‌నే లైక్ కొట్టేస్తారు. చాలామంది లైక్‌ల కోస‌మే ఫేస్‌బుక్‌లో ఫొటోలు, వీడియోలు, పోస్ట్‌లు పెడ‌తారు. ఎన్ని లైక్‌లు వ‌స్తే అంత గొప్ప అన్న‌మాట‌. ఇటీవ‌ల కాలంలో ఈ లైక్‌ల  పిచ్చి మ‌రింత ముదిరిపోయింది. బొట‌ను వేలు చూపిస్తూ, లైట్ బ్లూ క‌ల‌ర్‌లో ఉండే గుర్తును మీరు క్లిక్ చేస్తే చాలు లైక్ కొట్టేసిన‌ట్లే. 

మీ ఫేస్‌బుక్ హోమ్ పేజీ పై భాగంలో ఒక భూమి ఆకారంలో ఉండే గుర్తును మ‌నం చూడొచ్చు. ఇది మ‌న‌కు వ‌చ్చిన నోటిఫికేష‌న్ల‌ను చూపిస్తుంది. ఏమైనా నోటిఫికేష‌న్లు వ‌స్తే ఈ ఆకారం మీద ఎరుపు రంగంలో మ‌న‌కు ఎన్ని నోటిఫికేష‌న్లు వ‌చ్చాయో సంఖ్య‌తో స‌హా డిస్‌ప్లే అవుతుంది.  మీ ఎఫ్‌బీ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకోవాలంటే ఆ గుర్తును క్లిక్ చేస్తే చాలు.

క‌న్వ‌ర్షేష‌న్ కోసం ఒక ఐకాన్ పెట్టింది ఎఫ్‌బీ. ఆ బ‌బ‌ల్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే మ‌నం ఎవ‌రితో చాట్ చేసేమో తెలుసుకోవ‌చ్చు. లేదా ఎవ‌రైనా మ‌న‌కు చాటింగ్‌లో మెసేజ్‌లు పంపితే దీనిలో డిస్‌ప్లే అవుతాయి. ఈ ఐకామ్ మీద క్లిక్ చేసి మీరు రిప్లే కూడా ఇవ్వొచ్చు. 

చివ‌రిగా ఒక అబ్బాయి, అమ్మాయి ఐకాన్‌లు క‌న‌బ‌డ‌తాయి. దీని అర్థం ఫ్రెండ్ రిక్వెస్ట్‌. ఎవ‌రైనా మ‌న‌కు ఫ్రెండ్ రిక్వ‌స్ట్ పంపిస్తే రెడ్ క‌ల‌ర్‌లో మ‌న‌కు  ఆ రిక్వెస్ట్‌లు క‌నిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు 10 మంది రిక్వెస్ట్‌లు పంపితే మ‌న‌కు 10 అనే అంకె ఆ ఐకాన్ మీద డిస్ ప్లే అవుతుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ ప‌ది మంది ఎవ‌రో తెలుసుకుని ఆ రిక్వెస్ట్‌ల‌ను యాక్సెప్ట్ చేస్తే చేయ‌చ్చు లేదా డిలీట్ కూడా చేయ‌చ్చు. 

ఇక అన్నిటికంటే ముఖ్యంగా స్టిక్క‌ర్లు, సింబ‌ల్స్ విష‌యం గురించి చెప్పుకోవాలి. మ‌నం హ్యాపీగా ఉంటే లేదా బాధ‌గా ఉంటే లేదా ప‌గ‌ల‌బడి న‌వ్వాలంటే ఏం చేస్తాం. ఫీల్సింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తాం. కానీ ఫేస్‌బుక్‌లో ఆ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలంటే సింబ‌ల్స్‌, స్టిక్క‌ర్లే మీకు అవ‌స‌రం.  ఎవ‌రైనా నవ్వే పోస్ట్ పెట్టిన‌ప్పుడు న‌వ్వుతున్న సింబ‌ల్ వాడాలి. ఆ సింబ‌ల్ వాడ‌డంలో కూడా మ‌న కామ‌న్సెన్స్ ముఖ్యం. అది మ‌రీ ఎక్కువ నవ్వు వ‌చ్చేదా లేదా మామూలుగా నవ్వు తెప్పిచ్చేదా చూసి ఆ త‌ర‌హా స్టిక్క‌ర్ లేదా ఎమోజీ మాత్ర‌మే వాడాలి. ఆశ్చర్యానికి ఒక సింగిల్‌, వెక్కిరింత‌కు ఒక‌టి, ఇష్టానికి ఒక‌టి, ప‌డ‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డానికి ఒక‌టి, బాధ‌కు ఒక‌టి ఇలా ప్ర‌తి దానికి ఒక సింబల్ మ‌నం వాడొచ్చు. 
 

జన రంజకమైన వార్తలు