• తాజా వార్తలు
  •  

విండోస్ 10కు అప్‌గ్రేడ్ కావ‌డానికి మిగిలున్న అవకాశాలకు ఏకైక గైడ్‌

విండోస్ 10 ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2017తోనే స‌మ‌యం ముగిసిపోయింది. ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోలేక‌పోయామే అనే నిరాశ‌ప‌డిన వారికి ఆనందాన్నిచ్చే వార్త‌. విండోస్ 10 ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి మ‌రో అవ‌కాశం ఉంది. అఫీషియ‌ల్‌గా విండోస్ 10ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకునే అవ‌కాశం ముగిసిపోయింది. కానీ దాన్ని అన్ అఫీషియ‌ల్‌గా అప్‌గ్రేడ్ చేసుకునే అవ‌కాశం మాత్రం ఇంకా మిగిలుంది. మ‌రి అప్‌గ్రేడ్ చేసుకునేది ఎలా? ..దీనికి మీకిదే గైడ్‌..

విండోస్ 7, 8,  8.1 కీస్‌తో..
మీరు చాలా రోజుల నుంచి విండోస్ పాత వెర్ష‌న్‌లే వాడుతుంటే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.  దీని కోసం ముందుగా విండోస్ 10 ఇన్‌స్టాలేష‌న్ మీడియాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందుకు మీరు  విండోస్ 7, 8, 8.1 కీస్‌ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కీస్ అస‌లైన‌వా కావా అనేది విండోస్ చెక్ చేసుకుంటుంది. అవి అస‌లైన‌వే అని నిర్దార‌ణ అయితే విండోస్ 10 మీ పీసీలోకి ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. అయితే ఈ వెర్ష‌న్ మీరు ఎక్కువ‌కాలం ఉప‌యోగించాలంటే మీ పీసీకి  డిజిట‌ల్ లైసెన్స్ అవ‌స‌రం. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అప్‌డేట్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి..ఆ త‌ర్వాత యాక్టివేట్ చేయాలి. ఆ త‌ర్వాత మీకు డిజిట‌ల్ లైసెన్స్‌తో విండోస్ యాక్టివేట్ అయింద‌నే మెసేజ్ మీకు క‌నిపిస్తుంది.

రీఇనిస్టాల్ చేయండి..
మీరు ఇప్ప‌టికే విండోస్ 10 అప్‌గ్రేడ్ చేసి ఉంటే దాన్ని మీరు రీఇనిస్టాల్ చేసి కూడా మీరు ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.దీనికి కూడా ఎలాంటి కీస్ వాడాల్సిన  అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే అప్‌గ్రేడ్ చేసిన విండోస్ వెర్ష‌న్‌ను అన్ ఇనిస్టాల్ చేయాలి. దీని కోసం ముందుగా విండోస్ 10  ఇన్‌స్టాలేష‌న్ మీడియాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేష‌న్ ప్రాసెస్‌లో ఎలాంటి కీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. మైక్రోసాఫ్ట్ స‌ర్వ‌ర్స్‌ను కాంటాక్ట్ చేసిన త‌ర్వాత ఇది ఆటోమెటిక్‌గా మీ కంప్యూట‌ర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నా ఎందుకు అన్ఇనిస్టాల్ చేయాలంటే ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా డిజిట‌ల్ లైసెన్స్ తీసుకోవ‌డానికి. హార్డ్‌వేర్‌లో ఏమైనా ప్రాబ్ల‌మ్స్ ఉంటే వాటిని ట్ర‌బుల్ షూట్ చేయ‌డానికి కూడా విండోస్ 10 వెర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు