• తాజా వార్తలు
  •  

ఉచిత వెబ్ హోస్టింగ్ స‌ర్వీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీ కోస‌మే..

మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారా?  దాన్ని వెబ్‌సైట్ ద్వారా డెవ‌ల‌ప్ చేసుకుంటే రిజ‌ల్ట్స్ బాగుంటాయి. కానీ అంత ఖ‌ర్చు పెట్ట‌లేమ‌నుకుంటే  ఫ్రీ వెబ్ హోస్టింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. మీ సొంత వెబ్ డొమైన్‌ను కూడా ఈ సైట్స్ ద్వారా క్రియేట్ చేసుకుని వాడుకోవ‌చ్చు. జ‌స్ట్ మీకు ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు.. న‌యా పైసా కూడా ఖ‌ర్చు పెట్ట‌కుండా ఈ ఫ్రీ వెబ్ హోస్టింగ్ సైట్స్‌ను వాడుకోవ‌చ్చు.  
లిమిటేష‌న్స్ ఉన్నా సూప‌రే
పెయిడ్ సైట్స్ మాదిరిగానే ఇవి కూడా బెస్ట్ స‌ర్వీస్ ఇస్తాయి.  అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 100 జీబీ బాండ్ విడ్త్ మించి వాడుకోలేం. అలాగే స్పేస్ తక్కువ ఉంటుంది. అయితే స్టార్టింగ్  వెబ్ సైట్ హోస్టింగ్‌కు ఇది స‌రిపోతుంది.  మీ హోస్టింగ్ అకౌంట్ నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది. మీ వెబ్‌సైట్ 10 నిముషాల్లో లైవ్‌లోకి వ‌స్తుంది.  ఫ్రీ హోస్టింగ్ క‌దా అని యాడ్స్ కూడా ఏమీ ఉండ‌వు. ఇలా ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఇచ్చే బెస్ట్ సైట్స్ వివ‌రాలు మీకోసం..
విక్స్‌.కామ్ (Wix.Com)
విక్స్‌.కామ్ అనేది మీ ఫ్రీ వెబ్‌సైట్ హోస్టింగ్‌కు బెస్ట్ సైట్‌. మీరు దీనిలో 100 టెంప్లేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్ష‌న్స్‌తో మీ పోస్టింగ్ ఈజీగా, ఫాస్ట్‌గా పూర్తి చేయొచ్చు. దీనిలో ఉన్న సూప‌ర్ ఫీచ‌ర్ ఏమిటంటే మీరు ఈ వెబ్‌సైట్ హోస్టింగ్ సైట్‌ను వాడుకుంటే మీకు మొబైల్ ఆప్టిమైజేష‌న్ కూడా ఇస్తుంది. దీంతో మొబైల్ యూజ‌ర్ల నుంచి కూడా మీ సైట్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. స‌ర్వ‌ర్ స్పీడ్‌, అప్‌టైమ్ కూడా పెయిడ్ హోస్టింగ్ సైట్ల‌తో స‌మానంగా ఉంటాయి. 
1. విక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసి మీ వెబ్‌సైట్ టైప్‌ను సెలెక్ట్ చేయాలి.
2. మీ టెంప్లేట్‌ను సెలెక్ట్ చేసుకోండి.
3. మీ అవస‌రాల‌కు త‌గ్గ‌ట్లు దాన్ని క‌స్ట‌మైజ్ చేసుకోండి.
4. ఇది కంప్లీట్ అవ‌గానే ప‌బ్లిష్ చేయండి.
ఎక్స్‌10 హోస్టింగ్  (X10hosting)
ఫుల్ ఫీచ‌ర్డ్ వెబ్ హోస్టింగ్ సైట్‌. మంచి అప్‌టైమ్‌, సూపర్ నెట్‌వ‌ర్క్ స్పీడ్‌తో వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ స్టోరేజ్‌, అన్‌లిమిటెడ్ బాండ్ విడ్త్ .. ఎక్స్‌10 హోస్టింగ్ స్పెషాలిటీలు. మీకు సొంత డొమైన్ లేక‌పోతే ఫ్రీ డొమైన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వ‌న్ క్లిక్ వెబ్  సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేష‌న్‌తో మీ వెబ్‌సైట్‌ను 5 మినిట్స్‌లో రెడీ చేస్తుంది.  
వీబ్లీ (Weebly)
ఈ సైట్ ఫ్రీగానూ, పెయిడ్ హోస్టింగ్‌గానూ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ అకౌంట్‌లో స్టోరేజి స్పేస్ లాంటి కొన్ని ఫీచ‌ర్స్‌ను రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ, ఫ్రీచాట్ స‌పోర్ట్ దీని స్పెషాలిటీస్‌. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్ లాంటి ఫీచ‌ర్లున్నాయి. అయితే యాడ్స్ ఉండ‌డం వీబ్లీకి ప్ర‌తికూల అంశం.
అవార్డ్ స్పేస్ (AwardSpace)
అవార్డ్ స్పేస్‌లో నెల‌కు 1జీబీ ఫైల్ స్టోరేజ్‌, 5జీబీ బాండ్‌విడ్త్‌ ట్రాన్స్‌ఫ‌ర్ ఫ్రీగా ల‌బిస్తాయి. వన్‌క్లిక్ ఇన్‌స్టాల‌ర్‌.అయితే ఒక ఫ్రీ కౌంట్తో ఒక వెబ్‌సైట్‌ను మాత్ర‌మే ఫ్రీగా హోస్ట్ చేయ‌గ‌ల‌రు.  అప్‌గ్రేడ్ చేసుకోవాల‌నుకుంటే బేసిక్ పెయిడ్ ప్లాన్ 0.17 డాల‌ర్స్ (అంటే 11 రూపాయ‌ల‌కే ) నెల‌కు దొరుకుతుంది.
ఫ్రీ వెబ్‌హోస్టింగ్ ఏరియా (Freewebhostingarea)
మీ సైట్ సైజ్ 1500 ఎంబీ కంటే త‌క్కువ‌గా ఉండి హెవీ ట్రాఫిక్ ఉంటే ఇది మీకు సూట‌బుల్ వెబ్ హోస్టింగ్ సైట్‌.  అన్‌లిమిటెడ్ బాండ్ విడ్త్‌,  సైట్ ఎడిటింగ్ దీనిలో స్పెషాలిటీస్‌.