• తాజా వార్తలు
  •  

స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌డానికి కంప్లీట్ గైడ్‌

స్కైప్‌ను ఇప్పుడు అంత‌ర్జాతీయంగా ఎంతోమంది వాడుతున్నారు. విండోస్‌, మ్యాక్‌, ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల‌పైనా స్కైప్ కాలింగ్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. స్టేబుల్  క‌నెక్ష‌న్ ఉండ‌డం,  వాయిస్‌, పిక్చ‌ర్ క్లియ‌ర్‌గా ఉండ‌డం,  కాల్ క్వాలిటీ బాగుండ‌డం, ప్రైస్ కూడా త‌క్కువ ఉండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల‌మంది వ్య‌క్తుల‌తోపాటు వేలాది సంస్థ‌లు స్కైప్‌ను వాడుతున్నారు.వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ ప్రొటోకాల్ ( VoIP) స‌ర్వీస్‌గా ఇంతగా పాపుల‌ర‌యిన స్కైప్‌లో ఉన్న ఒకే ఒక డిస్అడ్వాంటేజ్  కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్ లేక‌పోవ‌డ‌మే.  అయితే స్కైప్‌లో సొంతంగా కాల్ రికార్డ్ ఫీచ‌ర్ లేక‌పోయినా అందుకు ఉప‌యోగ‌ప‌డే యాప్స్ ఉన్నాయి. అవేమిటో చూడండి.
కీప్‌విడ్ ప్రో (Keepvid Pro)
విండోస్‌, మ్యాక్‌ల్లో స్కైప్ కాల్ రికార్డ్ చేయ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ద్వారా మీ కంప్యూట‌ర్ స్క్రీన్‌మీద వ‌చ్చే వీడియోను క్యాప్చ‌ర్ చేసి త‌ర్వాత ప్లే చేసుకోవ‌చ్చు. అంటే దీనితోనే మీ స్కైప్ కాల్‌ను రికార్డ్ చేసుకోవ‌చ్చు. ఈ ప్రాసెస్ చాల ఈజీ. . అయితే ఇది ఫ్రీయాప్ కాదు. అయితే ఆ డ‌బ్బుకు స‌రిప‌డా పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. 
ఐఫ్రీ స్కైప్ రికార్డ‌ర్ (iFree Skype Recorder)
స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డే టూల్ ఇది. విండోస్‌కు మాత్ర‌మే ప‌ని చేస్తుంది.దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఆటోమేటిక్‌గా లేదా మాన్యువ‌ల్‌గా కాల్ రికార్డ్ చేయ‌గ‌లిగేలా ఆప్ష‌న్స్ సెట్ చేసుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ టైమ్ కాల్ రికార్డ్ చేయ‌వ‌చ్చ‌ని దీని మాన్యుఫాక్చ‌ర్లుచెబుతున్నారు. అయితే 45, 50 నిముషాల రికార్డింగ్ త‌ర్వాత కొన్నిసార్లు లాగ్ అవుతుంది. ఎంపీ3 ఫార్మాట్‌లో కాల్ రికార్డ్ అవుతుంది.  
కాల్‌గ్రాఫ్ టూల్ బార్ (Call Graph Toolbar)
కాల్‌గ్రాఫ్ టూల్ బార్ కూడా స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌డానికి మంచి యాప్‌. అయితే దీనిప్రాసెస్ చాలా లెంగ్తీగా, క‌ష్టంగా ఉంటుంది. 
* సిస్టంలో కాల్ గ్రాఫ్ టూల్‌బార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.  
* ఇప్పుడు స్కైప్‌ను ఓపెన్ చేస్తే  CallGraph.exe అనే అప్లికేష‌న్ మీ స్కైప్‌ను యాక్సెస్ చేస్తోంద‌ని వార్నింగ్ మెసేజ్ క‌నిపిస్తుంది. 
*  Restart Skype > go to Tools > Options > Advanced tab > Manage other programs లోకి వెళ్లి స్కైప్‌ను యాక్సెస్ చేయండి
* ఇప్పుడు Call Graph Toolbar apps మీకు స్క్రీన్ మీద క‌నిపిస్తాయి.   సెలెక్ట్ చేసి స్కైప్‌తో యూజ్‌చేసుకోవడానికి వీలుగా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు స్టెప్స్ త‌ర్వాత మీరు స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌గ‌లుగుతారు. ఇది కూడా విండోస్‌లో మాత్ర‌మే ప‌నిచేస్తుంది.
టాక్ హెల్ప‌ర్ (TalkHelper) 
మొద‌ట్లో ఫ్రీగా ఉన్న టాక్ హెల్ప‌ర్ టూల్ ఇప్ప‌డు 50 డాల‌ర్లు పెట్టి కొనుక్కోవాలి.ఇది స్కైప్ సిస్టంతో ఇంటిగ్రేట్ అయి ఉండడం వ‌ల్ల ప్ర‌తి ఫ్రేమ్‌ను రికార్డ్ చేయ‌గ‌లుగుతుంది. స్కైప్ వాయిస్‌, వీడియో కాలింగ్‌ను కూడా ఇది రికార్డ్ చేస‌క్తుంది. వాయిస్ మెసేజ్‌ల‌ను లోక‌ల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తుంది.  యూజ‌ర్ ఇంట‌ర్ ఫేస్ కూడా చాలా నీట్‌గా, ఏ రికార్డింగ్ ఏ డేట్‌లో ఏ టైమ్‌కి జ‌రిగిందో ఆర్గ‌నైజ్డ్‌గా ఉంటుంది.
ఇవి కూడా వాడొచ్చు
 విండోస్‌, మ్యాక్‌ల్లో స్కైప్ కాల్ రికార్డ్ చేసే VodBurner 
మ్యాక్‌లో కాల్ రికార్డ్ చేయ‌డానికి Ecamm, QuickTime Player
ఆండ్రాయిడ్‌లో స్కైప్ కాల్ రికార్డ్ చేయ‌డానికి AZ Screen Recorder, Cube Call Recorder ACRలు బెస్ట్ టూల్స్  

జన రంజకమైన వార్తలు