• తాజా వార్తలు
  •  

యూఎస్‌లో చ‌వ‌కగా ఉన్న‌వి ఆన్‌లైన్‌లో కొని ఇండియాకు తెప్పించుకోవ‌డానికి గైడ్‌

బ్లాక్ ఫ్రైడే, సైబ‌ర్ మండే  డీల్స్‌. గ్యాడ్జెట్ల‌పై సూప‌ర్ డిస్కౌంట్లు ఇచ్చే టైమ్‌. కానీ ఇక్క‌డ కాదు అమెరికాలో. డిజ‌ప్పాయింట్ అవుతున్నారా అక్క‌ర్లేదు. మీరు వాటిని ఆన్‌లైన్‌లో కొనుక్కోండి. దాన్ని ఇండియాకు ఎలా తెప్పించుకోవాలో ఈ గైడ్‌లో తెలుసుకోండి. ప్యాకేజ్ ఫార్వార్డింగ్ స‌ర్వీసెస్ ద్వారా ఇండియాకు యూఎస్ నుంచి ఇలాంటివి తెప్పించుకోండం ఈజీయే కాదు చౌక కూడా.  
వ‌ర్చ్యువ‌ల్ షిప్పింగ్ అడ్ర‌స్ పొందండి 
ప్యాకేజ్ ఫార్వ‌ర్డింగ్ స‌ర్వీస్ ద్వారా మీరు ప్రొడ‌క్ట్ తెప్పించుకోవాలంటే వాళ్ల వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర‌యి అయి సైన్ అప్ చేయాలి.  కొన్ని వెబ్‌సైట్ల‌లో రిజిస్ట్రేష‌న్ ఫ్రీ. కొన్నింటిలో మాత్రం వ‌న్‌టైం ఫీ ఉంటుంది.  సైన్ అప్ చేశాక మీరు  ఏ దేశంలో వ‌స్తువు కొనాల‌నుకుంటున్నారో ఆ దేశంలో ఓ ప్లేస్‌కు సంబంధించిన‌ వ‌ర్చ్యువ‌ల్ అడ్ర‌స్ వ‌స్తుంది. ఇది  ఆ కంపెనీ వేర్ హౌస్ అడ్ర‌స్ అన్న‌మాట‌. మీ ప్యాకేజి ఫ‌స్ట్ వేర్ హౌస్‌కు వ‌చ్చి అక్క‌డి నుంచి ప్ర‌పంచంలో  ఏ మూల‌కైనా షిప్పింగ్ అవుతుంది. ఒక్క‌సారి మీరు వ‌ర్చ్యువ‌ల్ అడ్ర‌స్ పొందిన త‌ర్వాత దాన్నే మీ షిప్పింగ్ అడ్ర‌స్‌గా చూపించి ఆ దేశంలో ఏ ఆన్‌లైన్ స్టోర్ నుంచి అయినా ప్రొడ‌క్ట్స్ కొనుక్కోవ‌చ్చు.   
1.  ఫెడెక్స్ క్రాస్‌బోర్డ‌ర్ 
యూఎస్ నుంచి ప్ర‌పంచంలో ఏ మూల‌కైనా ప్యాకేజి డెలివ‌రీ చేస్తుంది. ఛార్జి 5 డాల‌ర్లే.  అంతేకాదు టాక్సెస్‌, క‌స్ట‌మ్స్ ముందే పే చేయ‌డానికి సాయ‌ప‌డుతుంది.  అన్ని ర‌కాల క‌రెన్సీలు, పేమెంట్ ఆప్ష‌న్స్‌తో పేమెంట్ చేయొచ్చు.  
2. షిపిటో 
ఫ్రీ వ‌ర్చ్యువ‌ల్ అడ్ర‌స్‌తో యూఎస్ నుంచి అన్ని దేశాల‌కు ప్రొడ‌క్ట్ లు చేర‌వేయ‌డానికి ఇది ఈజీ టూ యూజ్ డెలివ‌రీ స‌ర్వీస్‌. తమ వేర్‌హౌస్‌నే షిప్పింగ్ అడ్ర‌స్‌గా చూపించి ప్రొడ‌క్ట్ రిసీవ్ చేసుకుని అక్క‌డి నుంచి మీకు పంపిస్తుంది.  మీరు రిక్వెస్ట్ పంపితే మీ ప్యాకేజీ వాళ్ల‌కు చేర‌గానే  దాన్ని ఫొటో తీసి మీకు షేర్ చేస్తుంది. మ‌ల్టిపుల్ ఆర్డ‌ర్స్‌ను క‌లిపి తెప్పించుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఇండియాతో పాటు ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల‌కు ప్రొడ‌క్ట్స్ సెండ్ చేస్తుంది.  
3. షాప్ అండ్‌ షిప్ 
ఈ వెబ్‌సైట్ ద్వారా యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్‌, జర్మ‌నీ, సింగ‌పూర్ స‌హా ప్ర‌పంచంలోని 24 మెట్రో న‌గ‌రాల్లో వ‌ర్చ్యువ‌ల్ అడ్ర‌స్‌లు క్రియేట్ చేసుకోవ‌చ్చు. దీని నుంచి షిప్‌మెంట్‌కు బోల్డ‌న్ని ఆఫ‌ర్లున్నాయి. ఫ్లెక్స్ ప్లాన్‌లో అయితే 100 గ్రాముల వెయిట్‌కు షిప్పింగ్ ఛార్జీ పే చేస్తే చాలు ఎంత వ‌స్తువైనా తెప్పించుకోవ‌చ్చు. 100 డాల‌ర్ల కంటే ఖ‌రీదైన వ‌స్తువులు షిప్పింగ్‌కు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తుంది.  

విజ్ఞానం బార్ విశేషాలు