• తాజా వార్తలు

గైడ్-అన్‌బాక్స్‌డ్ గ్యాడ్జెట్లు కొన‌డానికి గైడ్‌

ఆన్‌లైన్ షాపింగ్ చేసేట‌ప్పుడు ప్రొడ‌క్ట్‌పైన ర‌క‌ర‌కాల ట్యాగ్‌లు చూస్తుంటాం. రిఫ‌ర్బిష్డ్‌, అన్‌బాక్స్‌డ్‌, ఫ్యాక్ట‌రీ సెకండ్స్ ఇలా ర‌కర‌కాల లేబుల్స్ ఉంటాయి. అస‌లు వీటికి అర్ధ‌మేంటి? అన్‌బాక్స్‌డ్ గ్యాడ్జెట్లు కొనాలంటే ఏమేం చూడాలి తెలియ‌జేసే ఈ గైడ్ మీ కోసం.
అన్‌బాక్స్‌డ్ గూడ్స్‌
క‌స్ట‌మ‌ర్‌కు ప్రొడ‌క్ట్ అమ్మిన త‌ర్వాత ఆ వ్య‌క్తి ఏదైనా కార‌ణం చేత దాన్ని రిట‌ర్న్ చేసేస్తే దాన్ని ఇంకొక‌రికి అమ్ముతారు. దీన్ని అన్‌బాక్స‌డ్ గూడ్స్ అంటారు. వీటిలో ప్రొడ‌క్ట్ వాడే అవకాశాలు చాలా రేర్.
రిఫ‌ర్బిష్డ్ గూడ్స్‌
ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్. as good as new అనే ట్యాగ్ లైన్‌తో వ‌స్తాయి. క‌స్ట‌మ‌ర్‌కి డెలివ‌ర్ చేశాక అది డెడ్అవ‌డ‌మో, డిఫెక్ట్ పీస్ కావ‌డ‌మో, స్క్రాచెస్  ఉండ‌డ‌మో జరిగితే క‌స్ట‌మ‌ర్ రిట‌ర్న్‌చేస్తారు. ఆ లోపాన్ని స‌రిచేసి కంపెనీలు మ‌న‌కు తిరిగి అమ్ముతాయి.
ఫ్యాక్ట‌రీ సెకండ్స్ 
ఇవి బాగా క్రిటిక‌ల్‌. వీటిలో లోపాన్ని స‌రిచేయ‌కుండా అమ్మేస్తారు. అయితే ఇవి చాలామంది అనుకుంటున్న‌ట్లు సెకండ్ హ్యాండ్ కాదు. కానీ కొంత ప్రాబ్ల‌మ్ ఉంటుంది. అయితే పెర్‌ఫార్మెన్స్‌లో ఎలాంటి ప్రాబ్లం ఉండ‌దు.  

కంపెనీలు అన్నీ చూసుకున్నాకే ప్రొడ‌క్ట్‌లు అమ్ముతాయి. అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా క‌స్ట‌మ‌ర్ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే 10 రోజులు లేదా 15 రోజులు రీప్లేస్‌మెంట్ ఫెసిలిటీ ఇస్తాయి. ఆలోగా ప్రొడ‌క్ట్ డిఫెక్ట్ లేదా ఆశించినట్లుగా లేక‌పోతే వాటిని క‌స్ట‌మ‌ర్ రిట‌ర్న్ చేస్తారు.అలాంటి వాటిలో మెయిన్ అన్‌బాక్స్‌డ్ గూడ్సే. వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అవి నిజంగా వ‌ర్త్‌ఫుల్లా అనేది ఎలా తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు వ‌న్‌ప్ల‌స్‌5 సెల్‌ఫోన్ తీసుకుందాం. దీని కాస్ట్ అమెజాన్ 32,999 రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది. అదే స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్స్‌డ్ ఐట‌మ్ అయితే షాప్ క్లూస్ వెబ్‌సైట్‌లో 29,599 లేదా ఆ స్థాయి ధ‌ర‌కు దొరుకుతుంది. ఇంత రేటు పెట్టి కొనొచ్చా అంటే క‌చ్చితంగా కొనొచ్చు. ఎందుకంటే ప్రొడ‌క్ట్ డిజైన్ లేదా పెర్‌ఫార్మెన్స్ క‌స్ట‌మ‌ర్ ఊహించ‌ని స్థాయిలో ఉంద‌ని బాక్స్ ఓపెన్ చేయ‌గానే క‌స్ట‌మ‌ర్ ఓ అంచ‌నాకు వ‌చ్చి రిట‌ర్న్ చేస్తారు. దాన్నే కంపెనీలు అన్‌బాక్స్‌డ్ ఐటంగా అమ్ముతాయే త‌ప్పప్రొడ‌క్ట్‌లో ఎలాంటి ప్రాబ్లం లేద‌ని చెప్పొచ్చు.  అంటే మీరు కొత్త ప్రొడ‌క్ట్‌నే త‌క్కువ ధ‌ర‌కు కొంటున్నార‌న్న‌మాట‌. మీరు ల‌క్కీ అయితే ఎలాంటి వెయిటింగ్, ప్రీ బుకింగ్ లేకుండానే కొత్త ప్రొడ‌క్ట్‌ను కొంత త‌క్కువ ప్రైస్‌కు కొనుక్కోగలుగుతున్నారు. అయితే ఈ ప్రొడ‌క్ట్‌ల్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే కొత్త‌వాటికి ఉన్నంత వారంటీ వీటికి ఉండదు. కొత్త పీస్‌కు వ‌న్ ఇయ‌ర్ వారంటీ ఉంటే అన్‌బాక్స్‌డ్ ఐటంకి మూడు నెల‌లు లేదా ఆరు నెల‌ల వారంటీయే ఉంటుంది.   
అన్‌బాక్స్‌డ్ ఐట‌మ్స్ కొనేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? 
 * ఇలాంటి ప్రొడ‌క్ట్స్ అమ్మేట‌ప్పుడు వాటిలో మంచి ఛార్జ‌ర్ తీసేసుకుని చీప్ ఛార్జ‌ర్ పెట్టొచ్చు లేదా హెడ్‌ఫోన్స్ వంటి యాక్సెస‌రీస్ త‌క్కువ క్వాలిటీవి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబ‌ట్టి అలాంటివేవైనా గుర్తిస్తే పీస్ రిటర్న్ చేసేయండి.  
* మీ డివైస్ తొలిరోజుల్లోనే తొరోగా చెక్ చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లంఉంటే తెలిసిపోతుంది. కాబ‌ట్టి వెంట‌నే రీప్లేస్ అడగొచ్చు. రోజులుగ‌డిచేకొద్దీ రిట‌ర్న్‌కు అవ‌కాశాలు త‌గ్గిపోతాయి.  
* మీకు ప్రొడ‌క్ట్‌తోపాటు ఇస్తానన్న యాక్సెస‌రీస్ ఏమి రాక‌పోయినా ఎలాంటి హెజిటేష‌న్ లేకుండా కంపెనీకి మెయిల్ చేయండి లేదా క‌స్ట‌మ‌ర్ కేర్‌కు తెలియ‌ప‌ర‌చండి. అప్పుడు మీకు రీప్లేస్‌మెంట్ లేదా ఫుల్ రిఫండ్ దొరుకుతుంది.  
* మీరు కొన్న‌ది ఆండ్రాయిడ్ డివైస్ అయితే   Phone Doctor Plus వంటి యాప్స్ ద్వారా హార్డ్‌వేర్ చెక్ చేసుకోండి. ఈ యాప్ మ‌ల్టీ ట‌చ్‌, ఇయ‌ర్‌ఫోన్స్‌, మైక్రో ఫోన్స్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్స‌ర్‌, డిస్‌ప్లేవంటి 30 హార్డ్‌వేర్ టెస్ట్‌లు చేసి రిజ‌ల్ట్ ఇస్తుంది.  
* అదే ఐఫోన్ అయితే ReGlobe యాప్‌ను ఉప‌యోగించి హార్డ్‌వేర్ చెక్ చేయండి  
ఓవ‌రాల్‌గా చెప్పాలంటే ఇలాంటి గూడ్స్‌కు దాని ప్ల‌స్‌లు, మైన‌స్‌లు కూడా ఉంటాయి. ఇవి మీరుపెట్టే ప్రైస్‌కు ఓకే అనుకుంటే ఇలాంటి అన్‌బాక్స్‌డ్ ఐట‌మ్‌ను కొనుక్కోవ‌డంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబ‌ట్టి చెక్ చేసుకుని కొనుక్కోండి. త‌క్కువ ప్రైస్‌కే మంచి ప్రొడ‌క్ట్ ప‌ట్టుకోండి.  
 

జన రంజకమైన వార్తలు