• తాజా వార్తలు

బ్లూ టూత్ స్పీకర్ కొనాలా? అయితే ఈ బయింగ్ గైడ్ మీ కోసమే..

స్మార్ట్ ఫోన్ , ల్యాప్ టాప్ లాంటి డివైస్లతో మ్యూజిక్ లౌడ్‌గా వినాలన్నా, వీడియోలు ఎక్కువ మంది ఒకేసారి చూడాలన్నా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు మంచి ఆప్షన్. కానీ ఎలాంటి బ్లూటూత్ స్పీకర్ కొనాలో సెలెక్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఆ సెలక్షన్ ఈజీ చేయడానికి గైడ్ ఇదీ.. సాధారణంగా బ్లూటూత్ స్పీకర్లు కొన్ని వందల రూపాయల నుండి 30వేల వరకు ధర పలుకుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్‌లా వీటిని ఆన్ చేసి టెస్టు చేసి కొనడం అన్నిచోట్లా కుదరకపోవచ్చు. అందుకే బ్లూటూత్ స్పీకర్ కొనాలంటే ఈ అంశాలు గుర్తు పెట్టుకోవాలి.
> ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్
> దీన్ని హెర్ట్జ్ ల్లో కొలుస్తారు. 100 హెర్ట్జ్ నుండి 20 వేల హెర్ట్జ్ వరకు వీటిలో అందుబాటులో ఉంది. ఎక్కువ ఏరియా కవర్ చేయాలంటే ఎక్కువ హెర్ట్జ్ తీసుకోవాలనుకోవడం కూడా సరికాదు.  సౌండ్ ను రిసీవ్ చేసుకునే విధానం మనిషిని బట్టి, వయసును బట్టి మారుతుంది. ఆడియో ట్రాక్స్ వినాలంటే 20నుండి.250 హెర్ట్జ్ చాలు.  గాత్రం, పియానో, వయొలిన్ లాంటి వాయిద్య పరికరాలు వినాలంటే 250 నుండి 4000 హెర్ట్జ్ కావాలి. దీన్ని మిడ్ రేంజ్ అంటారు. దీని తర్వాత నుండి  20 వేల హెర్ట్జ్ వరకు. ఉండేవి  ట్రెబల్.
> బ్లూటూత్ వెర్షన్
> మీ డివైస్, బ్లూటూత్ స్పీకర్ మధ్య  ఎంత దూరం ఉంటే ఆడియో క్వాలిటీ గా ఉంటుందనేది బ్లూటూత్ వెర్షన్ మీద ఆధారపడి ఉంటుంది.  బ్లూటూత్ 4 వెర్షన్ తీసుకుంటే 60 మీటర్ల వరకు మంచి కనెక్టివిటీ ఇస్తుంది. బ్యాటరీ ని తక్కువగా వాడుకుంటుంది.
> డ్రైవర్స్
> డ్రైవర్స్ అనేవి ఏ స్పీకర్‌కైనా \ ప్రాణం. ఎక్కువ పోర్టబుల్ స్పీకర్లు 40 ఎంఎం డ్రైవర్లను కలిగి ఉంటాయి. సాధారణంగా అయితే ఇది చాలు. అంతకంటే పెద్దవి వాడాలంటే స్పీకర్ సైజ్ కూడా పెరిగిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లలో సింగిల్, ఫుల్ రేంజ్ డ్రైవర్ ఉంటుంది. రెండు స్పీకర్లుంటే సౌండ్ పెద్దగా వస్తుంది. రాక్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎక్కువగా వినేవారికి Jbl flip4 మంచి ఆప్షన్.

కనెక్టివిటీ
> బ్లూటూత్‌తోపాటు వైర్లతో కనెక్టివిటీ కూడా కీలక మే. Aux- in అని స్పీకర్ ఫీచర్లలో ఉంటుంది. వైర్ కనెక్టివిటీఉంటే బ్యాటరీపై భారం తగ్గుతుంది. కొన్ని సార్లు సౌండ్ కూడా క్వాలిటీ గా వస్తుంది.

ఛార్జింగ్ స్టైల్
> స్టాండర్డ్ యూఎస్ బీ ఛార్జింగ్ పాయింట్ ఉంటే అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు చాలా స్పీకర్లు మైక్రో యూఎస్బీ పోర్ట్‌తో వ‌స్తున్నాయి. వీటిని ప‌వ‌ర్ బ్యాంక్‌తో కూడా ఛార్జి చేసుకోవ‌చ్చు.

ఎక్క‌డ యూజ్ చేస్తారు?
> మీరు బ్లూ టూత్ స్పీకర్‌ను ఎక్క‌డ యూజ్  చేస్తార‌నేదాన్ని బ‌ట్టి కూడా దాని కొనుగోలు ఆధార‌ప‌డి ఉంటుంది.  Bose SoundLink అయ‌తే మీ అర్బ‌న్ లివింగ్ రూమ్ కు స‌రిపోతుంది.  అదే ఔట్‌డోర్‌లో ఎక్కువ‌గా యూజ్ చేస్తార‌నుకుంటే ర‌గ్గ్‌డ్‌, వాట‌ర్‌ప్రూఫ్ తీసుకోవాలి.  Toreto Aqua అనేది ఇందులో బెస్ట్ ఆప్ష‌న్

బ్యాట‌రీ లైఫ్‌
> బ్యాట‌రీ లైఫ్ కూడా ఇంపార్టెంట్లే.  Sony XB40 వంటి బ్లూటూత్ స్పీక‌ర్ల‌యితే రోజంతా ప‌ని చేస్తాయి. అయితే బ్యాట‌రీ కెపాసిటీ పెరిగే కొద్దీ స్పీక‌ర్ సైజ్ పెరుగుతుంది.
>  వీటితోపాటు ఎనీ కంపానియ‌య‌న్ యాప్ స‌పోర్ట్ ఉన్న‌వి ఎంచుకోవ‌డం మంచిది.  హై రిజ‌ల్యూష‌న్ ఆడియో ఫైల్స్ వినాలంటే  aptX HD లేదా LDAC వంటివి స‌పోర్ట్ చేసేవి ఎంచుకోవాలి.

జన రంజకమైన వార్తలు