• తాజా వార్తలు
  •  

ఫేక్ స్టోరేజ్ డివైజ్‌ల‌ను డిటెక్ట్ చేయ‌డానికి ప‌క్కా గైడ్‌

యూఎస్‌బీ స్టోరేజ్ డివైజ్‌లు.... ఇవి ఎప్ప‌టి నుంచో మ‌నుగ‌డ‌లో ఉన్నాయి. ఫైల్స్‌ను ఒక చోట నుంచి ఒక చోట‌కు మూవ్ చేయ‌డానికి లేదా ఒక కంప్యూట‌ర్‌లో ఉన్న డేటాను తీసుకెళ్లి మ‌రో చోట వాడ‌టానికి యూఎస్‌బీ డ్రైవ్‌ల‌కు మించిన ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు.  గ‌తంలో 2 జీబీ స్టోరేజ్ ఎన్న డివైజ్‌లు మాత్ర‌మే దొరికేవి. ఆ త‌ర్వాత 4, 8 జీబీ ఇలా పెరుగుతూపోయాయి. ఇప్పుడు టెరా బైట్ల‌లో కూడా స్టోరేజ్ డివైజ్‌లు దొరుకుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో అమ్ముతున్న స్టోరేజ్ డివైజ్‌ల‌లో ఎక్క‌వశాతం ఫేక్ అయి ఉంటున్నాయి. వీటి క‌వ‌ర్‌పై రాసే స్టోరేజ్ వేరు.. తీరా దాన్ని ఓపెన్ చేశాక ఉప‌యోగిస్తున్న‌ప్పుడు మ‌నం తెలుసుకునే స్టోరేజ్ వేరేలా ఉంటుంది. వంద‌ల సంఖ్య‌లో న‌కిలీ స్టోరేజ్ డివైజ్‌లు మార్కెట్లో ఉన్నాయిప్పుడు మ‌రి ఇలాంటి ఫేక్ స్టోరేజ్ డివైజ్‌ల‌ను గుర్తించాలంటే ఎలా? అందుకు ఇదే గైడ్‌...

ఆర్ఎంపీఆర్ఈపీ యూఎస్‌బీ
ఫేక్ యూఎస్‌బీ డ్రైవ్‌లను గుర్తించ‌డానికి ఆర్ఎంపీఆర్ఈపీ యూఎస్‌బీ టూల్ మీకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందుగా మీరు పోర్ట‌బుల్ విండోస్  ఇన్‌స్టాల‌ర్‌ను క్రియేట్ చేసుకోవాలి. యూఎస్‌బీ డ్రైవ్‌లోనే లిన‌క్స్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆర్ఎంపీఆర్ఈపీ మీకో క్విక్ సైజు టెస్టును పెడుతుంది. ఈ టెస్టు ర‌న్ అవుతున్న‌పుడు మ‌న‌కు కొన్ని బ్లాక్స్ క‌నిపిస్తాయి. అవేంటో చ‌ద‌వాలి. ఈలోగే ఆ డివైజ్ కెపాసిటీ ఏంతో ఈ ప్రొగ్రామ్ కాలిక్యులేట్ చేస్తుంది.  ఈ టెస్టు నిర్వ‌హించే ముందు మీ డేటాను బ్యాక్ అప్ చేసుకోవాలి. ఈ క్విక్ సైజు టెస్టు కొన్ని క్ష‌ణాల్లోనే అయిపోతుంది.  ఫేక్ ఫ్లాష్ టెస్ట్ అనే  మ‌రో టూల్ కూడా ఉంది. క్విక్ సైజు టెస్టు క‌న్నా ఇది మ‌రింత ఎక్స‌టెండెడ్ వెర్ష‌న్‌. 

హెచ్‌2టెస్ట్‌డ‌బ్ల్యూ
యూఎస్‌బీ డివైజ్ కెపాసిటీని తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించే టూల్స్‌లో హెచ్‌2టెస్ట్‌డ‌బ్ల్యూ కూడా ఒక‌టి. ముందుగా మీ యూఎస్‌బీ డివైజ్ కోసం స్పెసిఫైడ్ టెస్టు మోడ్‌ను ఎంచుకోవాలి. అంటే మొత్తం స్పేస్‌ను టెస్టు చేయాలా లేదా నిర్ణీత ఎంబీని టెస్టు చేస్తే స‌రిపోతుందా అనే ఆప్ష‌న్ల‌ను కూడ మీరు ఎంచుకునే అవ‌కాశం ఉంది. ఇది కొంచెం ఓల్డ్ టూల్‌. టెస్టింగ్ కోసం స‌మ‌యం ఎక్కువే ప‌డుతుంది.

చెక్ ఫ్లాష్
యూఎస్‌బీ డివైజ్ సామ‌ర్థ్యాన్ని కొల‌వ‌డానికి ఉప‌యోగించే మ‌రో టూల్ చెక్ ఫ్లాష్‌. ఇది మీ డివైజ్ మ్యాప్‌ను రీడ్ మ‌రియు రైట్ స్పీడ్‌ను తెలియ‌జేస్తుంది. అంతేకాదు టెస్టుకు అయ్యే స‌మ‌యాన్ని కూడా లెక్కిస్తుంది.  చిప్ జీనియ‌స్ అనే మ‌రో టెస్టింగ్ టూల్ కూడా యూఎస్‌బీ కెపాసిటీని చెక్ చేయ‌డానికి వాడొచ్చు. ఇది మీ డివైజ్ మాన్యుఫాక్చ‌ర్ వివ‌రాలు, సీరియ‌ల్ నంబ‌ర్ ఇత‌ర వివ‌రాలు కూడా తెలియ‌జేస్తుంది. 

జన రంజకమైన వార్తలు