• తాజా వార్తలు

యాంటీవైర‌స్ లేకుండానే విండోస్‌లో వైర‌స్ రిమూవ్ చేయ‌డానికి ప్రొటెక్టివ్ గైడ్‌

కంప్యూట‌ర్‌కి అతిపెద్ద శ‌త్రువు వైర‌స్‌.  పైగా ఇప్పుడు ప్ర‌తి కంప్యూట‌ర్ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌తో ఉంటుంది. దీంతో ఈజీగా వైర‌స్ చొరబ‌డుతోంది. ఈ వైర‌స్‌లు కొన్నిసార్లు డేటాను క‌ర‌ప్ట్ చేస్తే కొన్నిసార్లు ఏకంగా సిస్ట‌మ్‌నే పాడుచేస్తాయి. అందుకే మ‌నం వంద‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి యాంటీ వైర‌స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఫ్రీ యాంటీవైర‌స్ సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నా అవి ప‌రిమితంగానే ప‌నిచేస్తాయి. ఈ ప‌రిస్థితుల్లో అస‌లు యాంటీవైర‌స్ లేకుండానే మీ విండోస్‌లో వైర‌స్ రిమూవ్ చేయ‌డం ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. 
 

విండోస్ టాస్క్ మేనేజ‌ర్ ద్వారా 
టాస్క్ మేనేజ‌ర్ అనేది ఒక విండోస్ టూల్‌. దీనిలో మీరు ర‌న్నింగ్ ప్రాసెస్ జ‌ర‌ప‌వ‌చ్చు. ఏదైనా అన్‌వాంటెడ్ ప్రాసెస్ భారీగా మెమ‌రీని యూజ్ చేసుకుంటుంటే ఆ ప్రాసెస్ ఎండ్ చేసి మీ పీసీ పెర్‌ఫార్మెన్స్ పెంచుకోవ‌చ్చు.
* CTRL + Shift + ESC  బ‌ట‌న్స్‌ను ఒకేసారి ప్రెస్ చేస్తే టాస్క్ మేనేజ‌ర్ ఓపెన్ అవుతుంది. CTRL + ALT + DEL ఒకేసారి ప్రెస్ చేస్తే వ‌చ్చే మెనూలో నుంచి Start Task Managerను సెలెక్ట్ చేయాలి.
* టాస్క్ మేనేజ‌ర్ ఓపెన్ అయ్యాక పైనున్న ట్యాబ్‌ల్లో నుంచి Process ట్యాబ్‌ను సెలెక్ట్  చేస్తే రన్నింగ్‌లో ఉన్న ప్రాసెస్‌ల‌న్నీ క‌నిపిస్తాయి.
* ఇప్పుడు File ట్యాబ్‌ను క్లిక్ చేసి  Run New Taskను సెలెక్ట్ చేయండి.
* create-new-taska విండోలోకి వెళ్లి msconfig ఎంట‌ర్ చేసి Enter నొక్కండి
* ఇప్పుడు System Configuration విండో ఓపెన్ అవుతుంది. దీనిలో ఉన్న‌ట్యాబ్‌ల్లో నుంచి  Servicesని సెలెక్ట్ చేయండి.  ఇందులో ప‌నికిరాని ప్రాసెస్‌ల‌న్నీ క‌నిపిస్తాయి. వాటిముందున్నఅన్‌చెక్ చేయండి.
* ఇప్పుడు మ‌ళ్లీ సిస్టం క‌న్ఫిగ‌రేష‌న్ విండోలోకి వెళ్లి Start Up ట్యాబ్‌ను క్లిక్ చేయండి.  ఇక్క‌డ మీ సిస్టం మీద బూట్ అవుతున్న యాప్స్ అన్నీ క‌నిపిస్తాయి. వీట‌న్నింటినీ డిసేబుల్ చేయండి.
* ఇప్పుడు మెయిన్ పేజీలో fileలోకి వెళ్లి Location of the file క్లిక్‌చేసి డిలీట్ చేయండి. 

వైర‌స్ టోట‌ల్ టూల్‌ (Virustotal )
మీ సిస్ట‌మ్‌లో ఉన్న అన‌వ‌స‌ర‌మైన ఫైల్స్‌, యూఆర్ఎల్స్‌,ట్రోజ‌న్స్‌, మాల్‌వేర్‌ల‌ను వేగంగా స్కాన్ చేసి రిమూవ్ చేసే ఆన్‌లైన్  స్కాన‌ర్ టూల్‌.. ఆన్‌లైన్‌లో ఫ్రీగాదొరికే ఈ టూల్‌ను ఎలా ఉప‌యోగించుకోవాలంటే..
* మీ బ్రౌజ‌ర్‌లో నుంచి Virustotal online Scanner Toolను ఓపెన్ చేయండి.
* Choose File మీద క్లిక్ చేసి అన‌వ‌స‌రం అని మీర‌నుకున్న ఫైల్స్‌, ఫోల్డ‌ర్స్‌ను సెలెక్ట్ చేయండి.
*  Scan it ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి.
* త‌ర్వాత పేజీలో మీకు వైర‌స్‌టోట‌ల్ స్కాన్ రిపోర్ట్ మీకు వ‌స్తుంది.
* ఆ రిపోర్ట్‌లో మీకేదైఆ అనుమానాస్ప‌ద‌మైన ఫైల్ లేదా ఫోల్డ‌ర్ క‌నిపిస్తే దాన్ని మీ పీసీలో నుంచి రిమూవ్ చేయండి.

మెటా డిఫెండ‌ర్  (Metadefender)
విండోస్‌లో వైర‌స్ క్లీక్ చేయ‌డానికి మ‌రో ఆన్‌లైన్ స్కాన‌ర్ టూల్..మెటా డిఫెండ‌ర్ (Metadefender). మీరు స్కాన్ చేసే ఫైల్ సైజ్ 140 ఎంబీ కంటే త‌క్కువ‌గా ఉంటే ఇది బాగా ప‌ని చేస్తుంది.
* metadefender.opswat.comలోకి వెళ్లండి
* ఫైల్ సెలెక్ట్ చేసి ఆ ఫైల్ పాత్‌లోకి నావిగేట్ అవ్వండి
* స్కానింగ్ పూర్త‌వ‌గానే మీకు కంప్లీట్ రిపోర్ట్ వస్తుం Nodistribute
 

నో డిస్ట్రిబ్యూట్ (nodistribute)
పైవాటితో మీరు వైర‌స్‌ను డిటెక్ట్ చేయ‌డం సాధ్యంకాక‌పోతే నోడిస్ట్రిబ్యూట్ టూల్‌ను ట్రైచేయండి. ఎందుకంటే ఇది చాలా ప‌వ‌ర్‌ఫుల్ స్కాన‌ర్‌. 35 యాంటీ వైర‌స్ ప్రోగ్రామ్‌ల నుంచి మీ ఫైల్‌ను స్కాన్ చేస్తుంది.
* nodistribute.com విజిట్ చేయండి. 
* అనుమానంగా ఉన్న ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
* Scan file మీద క్లిక్ చేస్తే చాలు మీ ఫైల్ స్కాన్ అయిపోతుంది.
 

జన రంజకమైన వార్తలు