• తాజా వార్తలు

జియో ఫెన్సింగ్ గురించి సంపూర్ణ గైడ్‌

మీరు ఏ వాకింగో, జాగింగో చేస్తున్న‌ప్పుడు  మీ మొబైల్‌లో లొకేష‌న్ బేస్డ్ పాప్ అప్ అల‌ర్ట్స్ వ‌స్తున్నాయా?  అయితే మీరు జియో ఫెన్సింగ్ లొకేష‌న్‌లో ఉన్న‌ట్లే.  అస‌లేంటి ఈ జియో ఫెన్సింగ్ అనుకుంటున్నారా? అదే ఆ డౌట్స్ తీర్చేయ‌డానికే ఈ ఆర్టిక‌ల్‌. జియో ఫెన్సింగ్ గురించి స‌మ‌గ్ర స‌మాచారం తెలియాలంటే ఓ లుక్కేసేయండి..

జియో ఫెన్సింగ్ అంటే
జియో ఫెన్సింగ్ అంటే  GPS లేదా RFID టెక్నాల‌జీని ఉపయోగించి ఓ వ‌ర్చువ‌ల్ స‌రిహ‌ద్దును సృష్టించ‌డం అన్న‌మాట‌. అంటే ఈ స‌రిహ‌ద్దులోకి మ‌నం వెళ్లినా, మ‌నం అందులో నుంచి బ‌య‌టికి వ‌చ్చినా మ‌న‌కు పాప్ అప్ అల‌ర్ట్స్ మొబైల్‌కి వ‌స్తాయి.
ఎలా పని చేస్తుంది?
జియో ఫెన్సింగ్ ఒక ప్రాంతంలో ఒక స‌రిహద్దును  సాఫ్ట్‌వేర్ ద్వారా క్రియేట్ చేయ‌డం వ‌ల్ల ప‌నిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఒక ప్రాంతం చుట్టూ మీరు ఓ స‌ర్కిల్ గీశార‌నుకోండి. మీరు మ్యాప్‌మీద ఓ వ‌ర్చువ‌ల్ బౌండ‌రీని సృష్టించార‌న్న‌మాట‌. జియో ఫెన్సింగ్ కూడా జీపీఎస్ లేదా ఆర్ఎఫ్ఐడీ టెక్నాల‌జీ ద్వారా ఓ ప‌ర్టిక్యుల‌ర్ ప్లేస్‌చుట్టూ బౌండ‌రీ గీస్తుంది. ఈ జియో ఫెన్సింగ్‌తో మీ మొబైల్ నెంబ‌ర్ అటాచ్ అయి ఉంటే లేదంటే వైఫై ద్వారా మీ మొబైల్‌తో క‌నెక్టివిటీలో ఉంటే ఆ ప్రాంతంలోకి మీరు వెళ్లినా బ‌య‌ట‌కు వ‌చ్చినా మీకు అల‌ర్ట్స్ వ‌స్తుంటాయి. మొబైల్ యాప్‌లో  జియోఫెన్సింగ్ కోడ్‌ను చేరిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో జియో ఫెన్సింగ్ పనిచేస్తుంది. అంటే ఇప్ప‌టికే మీ ఫోన్‌లో ఉన్న లొకేష‌న్ స‌ర్వీస్‌కు జియో ఫెన్సింగ్ యాడ్ అవుతుంది.  ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఒక మ్యూజియంలోకి వెళ్లారు. ఆ మ్యూజియం యాప్ గ‌నుక మీ ఫోన్‌లో ఉండి ఉంటే  ఎంబెడెడ్ జియోఫెన్సింగ్ టెక్నాలజీతో ఆ యాప్ మీకు ఆ మ్యూజియం గురించి త‌న ద‌గ్గ‌రున్న డిటెయిల్స‌న్నీ ఇస్తుంది. మ్యూజియం ఎప్పుడు స్టార్ట‌యింది.ఎంత క‌లెక్ష‌న్ ఉంది. ఫ‌లానా ఐట‌మ్ ఏ కాలంనాటిది వంటి వివ‌రాల‌న్నీచెప్పేస్తుంది.  
ఉప‌యోగాలు ఎన్నో..
జియోఫెన్సింగ్ సేవలును చాలా సెక్టార్ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. బిజినెస్ చేసేవారు త‌మ క‌స్ట‌మ‌ర్ల మొబైల్స్‌లో ఈ జియో ఫెన్సింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే త‌మ షాప్ లేదా స్టోర్ ప‌రిస‌రాల్లోకి వాళ్లు వ‌చ్చిన‌ప్పుడు స్టోర్ ఏరియాలోనే ఉన్నార‌ని వారిని అల‌ర్ట్ చేస్తుంది. క‌స్ట‌మ‌ర్లు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నార‌ని వ్యాపారికి మెసేజ్ పంపొచ్చు. దీంతో వ్యాపారి క‌స్ట‌మ‌ర్ల‌కు త‌న ద‌గ్గ‌రున్న ఆఫ‌ర్ల గురించో, కొత్త స్టాక్ గురించో పుష్ నోటిఫికేష‌న్లు పంపి కస్ట‌మ‌ర్‌ను షోరూంకి ర‌ప్పించుకోవ‌చ్చు.
* మార్కెటింగ్ రంగంలోనూ బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌స్ట‌మ‌ర్లు త‌మ జియోఫెన్సింగ్ ఏరియాలోకి రాగానే వారికి మెసేజ్‌లు, ఆఫ‌ర్లు గురించి చెప్పి అట్రాక్ట్ చేయొచ్చు.
* ఈవెంట్ లేదా ఆడియ‌న్స్ మేనేజ్‌మెంట్ అంద‌రినీ ఫంక్ష‌న్ల‌లో ఒకేవేదిక ద‌గ్గ‌రికి చేర్చేందుకు జియో ఫెన్సింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
* క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు, ఫ్యాక్ట‌రీలు వ‌ర్క్ ప్లేస్‌చుట్టూ జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే వ‌ర్క‌ర్స్ స‌రిగా ప‌నిచేస్తున్నారా? ప‌క్క‌కు వెళ్లి ప‌నిఎగ్గొడుతున్నారా కూడా ట్రేస్ చేయొచ్చు.
* స్మార్ట్ డివైస్‌ల‌ను మేనేజ్ చేయ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.
జియోఫెన్సింగ్ సేవలు అందించే అత్యుత్తమ సంస్థలలో రాడార్ ఒకటి . మీ వ్యాపారానికి జియోఫెన్సింగ్ ప్ర‌యోజ‌నాలు అందించ‌డానికి సాయ‌ప‌డుతుంది. ఇలాంటి కంపెనీలురాబోయే రోజుల్లో టెక్నాల‌జీ బేస్డ్ ప్ర‌మోష‌న్‌కు కీల‌కం కాబోతున్నాయి.

జన రంజకమైన వార్తలు