• తాజా వార్తలు
  •  

వాట్సాప్‌ను లాక్ చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

మొబైల్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఇప్పుడు వాట్సాప్‌ను మించిన స‌మాచార సాధనం లేదు.  కోట్ల మంది యూజ‌ర్లు వాట్సాప్‌తోనే నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు.  వాట్సాప్‌లో మీకొచ్చే మెసేజ్‌ల్లో వ్య‌క్తిగ‌త‌మైన‌వి ఉండొచ్చు, ఆఫీస్‌లో, వ్యాపారంలో వేరేవాళ్లు చూడకూడ‌ని ర‌హ‌స్యాలు అయి ఉండ‌వ‌చ్చు.  అలాంట‌ప్పుడు వాటిని సెక్యూర్‌గా ఉంచ‌డం సాధ్య‌మేనా?  ఈ ర‌క‌మైన అభిప్రాయాలు రాకూడ‌ద‌నే వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ తీసుకొచ్చింది. అంటే మెసేజ్‌ను సెండ‌ర్‌, రిసీవ‌ర్ త‌ప్ప వేరేవాళ్లు చ‌ద‌వ‌లేరు. ఆఖ‌రికి వాట్సాప్ కూడా దాన్ని చ‌ద‌వడం వీలుప‌డ‌దు. కానీ మీ ఫోన్లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఎవ‌రైనా దాన్నియాక్సెస్ చేసే అవ‌కాశం ఉంది. దీన్ని నివారించాలంటే వాట్సాప్ లాక్ చేయాల్సిందే.  అది ఎలా చేయాలో చెప్ప‌డానికే ఈ గైడ్ మీకోసం..
వాట్సాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో రెండు ప‌ద్ధ‌తుల్లో లాక్‌చేయొచ్చు. ఒక‌టి టూ స్టెప్ వెరిఫికేష‌న్‌, రెండోది ఏదైనా థ‌ర్డ్ పార్టీ యాప్ ద్వారా మీ వాట్సాప్‌ను లాక్ చేయ‌డం.
 

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ 2 స్టెప్ వెరిఫికేష‌న్ వాడుకోవ‌డం ఎలా?
ఈ టూ స్టెప్ వెరిఫికేష‌న్ వాట్సాప్ యాప్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ వాట్సాప్‌లో ఇది ఇన్‌బిల్ట్‌గా ఉంది.

* వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌కు వెళ్లండి.

* సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేసి Account > Two-step verificationను క్లిక్ చేయండి.

* త‌ర్వాత స్క్రీన్‌లో మీకు Enableఅనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని టాప్ చేయండి.

* ఇప్పుడు 6 అంకెల పాస్‌కోడ్ ఎంట‌ర్ చేయండి. మ‌ళ్లీ మీరు వాట్సాప్‌ను తెర‌వాలంటే ఈ 6అంకెల కోడ్‌ను ఎంట‌ర్ చేయాల్సిందే.

* పాస్‌కోడ్ మ‌ర్చిపోతే రిక‌వ‌ర్ చేయ‌డానికి మీ ఈ మెయిల్ ఐడీని కూడా ఎంట‌ర్ చేయండి.

* మీరు మీ పాస్‌కోడ్ లేదా ఈ మెయిల్ ఐడీని మార్చుకోవాలంటే Settings > Account > Two-step verificationలోకి వెళ్లి మార్చుకోండి.

ఐవోఎస్‌లో వాట్సాప్  2 స్టెప్ వెరిఫికేష‌న్ వాడుకోవ‌డం ఎలా?
* ఐవోఎస్ డివైస్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ట్యాబ్‌కు వెళ్లండి.

* సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేసి Account > Two-step verificationను క్లిక్ చేయండి.

*  Enable బ‌ట‌న్ క్లిక్ చేయండి.

* ఇప్పుడు 6 అంకెల పాస్‌కోడ్ ఎంట‌ర్ చేయండి.  పాస్‌కోడ్ మ‌ర్చిపోతే రిక‌వ‌ర్ చేయ‌డానికి మీ ఈ మెయిల్ ఐడీని కూడా ఎంట‌ర్ చేయండి. వీటిని మ‌ళ్లీ ఎంట‌ర్ చేయండి.

థ‌ర్డ్ పార్టీ యాప్స్ వాడండి
 అయితే ఈ 2 స్టెప్ వెరిఫికేష‌న్‌తో కూడా మీ వాట్సాప్ సేఫ్‌గా లేదు అనుకుంటే థ‌ర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ వాట్సాప్‌ను లాక్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లే స్టోర్‌, ఐవోఎస్ యాప్ స్టోర్‌లో చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ యాప్స్ ఇవీ..
 

సీఎం సెక్యూరిటీ యాప్‌లాక్  (CM Security Applock )
మీరు ఆండ్రాయిడ్‌లో ఏదైనా యాప్‌ను లాక్ చేయాలంటే సీఎం సెక్యూరిటీ యాప్ లాక్ బెస్ట్ ఆప్ష‌న్‌.  ఆండ్రాయిడ్ 2.3.3 త‌ర్వాత వ‌చ్చే వెర్ష‌న్ల‌న్నింటికీ ఇది ప‌ని చేస్తుంది. దీనితో ఒక్క వాట్సాప్ మాత్ర‌మే కాదు ఏ యాప్‌నైనా లాక్ చేసుకోవ‌చ్చు.  దీన్ని మీ ఫింగ‌ర్ ప్రింట్ ద్వారా కూడా లాక్, అన్‌లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంతేకాదు మీ మొబైల్ డేటాను, వైఫైను కూడా  ఎవ‌రూ వాడ‌కుండా ఈ యాప్‌తో లాక్ చేయొచ్చు. ఇది ఫ్రీ యాప్‌.
 

ఐయాప్ లాక్ (iAppLock )
ఐయాప్‌లాక్ అనేది జైల్ బ్రోకెన్ ఐవోఎస్ డివైస్‌ల‌కు ప్ర‌త్యేకం. మీ డివైస్ అలాంటిదే అయినా ఈ  iAppLockను ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని మీ యాప్స్‌ను లాక్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు