• తాజా వార్తలు
  •  

సాధార‌ణ టీవీని స్మార్ట్‌టీవీగా మార్చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

షియోమి రీసెంట్‌గా రూ.40వేలకే ఎంఐ స్మార్ట్ టీవీ 4ను లాంచ్ చేసింది. ఎట్రాక్టివ్ ఫీచ‌ర్ల‌తో, ఏకంగా 55 ఇంచెస్ స్క్రీన్‌, పైగా స్మార్ట్ టీవీ కావ‌డం దీని స్పెషాలిటీస్‌. అయితే ఇదే ధ‌ర‌కు 40, 43 ఇంచెస్ సాధార‌ణ ఎల్ఈడీ టీవీ కొన్న‌వాళ్లంద‌రూ ఇలాంటి స్మార్ట్ టీవీలు చూసిన‌ప్పుడు అయ్యో మ‌నం కూడా స్మార్ట్‌టీవీ కొనుక్కోవాల్సిందే అనుకుంటుంటారు. స్క్రీన్ సైజ్‌, ఫీచ‌ర్స్ ఎలా ఉన్నా స్మార్ట్ టీవీ అనే స్టేట‌స్ లేక‌పోవ‌డం సాధార‌ణ ఎల్ఈడీ టీవీ కొన్న‌వారిని కొద్దిగా ఫీల‌య్యేలా చేస్తుంటుంది. దానికేం వ‌ర్రీ అవ‌క్క‌ర్లేదు.  నాలుగు వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగితే మీ ఎల్ఈడీ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేసుకోవ‌డానికి మార్కెట్లో బోల్డ‌న్ని ఆప్ష‌న్లున్నాయి.అలాంటి వాటిలో ది బెస్ట్ టూల్స్ గురించి ఈ గైడ్‌.మీ టీవీని స్మార్ట్ టీవీగా మార్చాలంటే ఈ డివైస్‌ల‌ను మీ టీవీకి ప్ల‌గ్ ఇన్ చేస్తే చాలు
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ (Amazon Fire TV Stick)
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్.. ఈ సెగ్మెంట్‌లో బాగా పాపుల‌ర‌యిన్ డివైస్‌. చిన్న సైజ్‌లో ఉండే ఈ డివైస్‌లో ప్రీ ఇన్‌స్టాల్డ్ బ్రౌజ‌ర్ ఉంటుంది.  ఈ డివైస్‌ను టీవీకి క‌నెక్ట్ చేసి ఇంట‌ర్నెట్‌ను బ్రౌజ్‌చేసుకోవ‌చ్చు. 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి.  దీన్నియూజ్‌చేయ‌డానికి రిమోట్ కూడా వ‌స్తుంది. ధ‌ర రూ.3,999
గూగుల్ క్రోమ్ కాస్ట్2 (Google Chromecast 2)
ఇది కూడా అమెజాన్ ఫైర్ స్టిక్‌లాగాఏ ప‌నిచేస్తుంది.  అయితే కొన్ని అద‌న‌పు అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. దీన్ని మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ద్వా, టీవీకి క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. నెట్ బ్రౌజ్‌చేసుకోవ‌చ్చు. గేమ్స్ ఆడుకోవ‌చ్చు. మూవీస్ చూడొచ్చు. గూగుల్ డెవ‌ల‌ప్‌చేసిన ఈ డివైస్‌కు యాప్ స‌పోర్ట్ కూడా ఉంది. క్రోమ్‌కాస్ట్ 2తో రిమోట్ రాదు. అయితే  మీ స్మార్ట్ ఫోన్‌నే రిమోట్‌గా వాడుకోవ‌చ్చు.   ధ‌ర రూ.3,999. ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది.
షియోమి ఎంఐ టీవీ బాక్స్ (Xiaomi Mi TV Box)
మొబైల్ త‌యారీ కంపెనీ షియోమి కూడా ఇలాంటి డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు షియోమి ఎంఐ టీవీ బాక్స్‌. ఆండ్రాయిడ్ ఓఎస్‌మీద ర‌న్న‌య్యే ఈ టీవీ బాక్స్‌లో 2జీబీ ర్యామ్‌,8జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి. 4కే రిజ‌ల్యూష‌న్ వ‌ర‌కు కంటెంట్‌ను స్ట్రీమ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్టిక్‌, క్రోమ్‌కాస్ట్ 2ల‌తో కంపేర్ చేస్తే టీవీ బాక్స్‌లో ఇది అద‌న‌పు అడ్వాంటేజ్‌. ఈ డివైజ్‌కు అద‌న‌పు యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది. ఇది ఎలాంటి వీడియో ఫార్మాట్‌న‌యినా రీడ్ చేయ‌గ‌లుగుతుంది.గేర్‌బెస్ట్‌లో ఎంఐ టీవీ బాక్స్ ల‌భిస్తుంది. ధ‌ర రూ,4,387.