• తాజా వార్తలు
  •  

మీ 4జీ ఇంట‌ర్నెట్ స్పీడ్ ఎందుకు త‌క్కువ‌గా ఉంది?.. దాన్ని ఫిక్స్ చేయ‌డం ఎలా?

4 జీ.. అత్యంత వేగంగా ఇంటర్నెట్‌ను  అందించే నెట్‌వ‌ర్క్‌. చాలామందికి 4జీ అంటే తెలిసిన నిర్వ‌చ‌నం ఇదే. కానీ ఇప్పుడు 4జీ కూడా స్లో అయిపోతుంది. చాలా చోట్ల 4జీ నెట్‌వ‌ర్క్ కూడా 2జీలా ప‌ని చేస్తుంది. దీంతో మ‌న ప‌నులేమో న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. కీల‌క‌మైన సంద‌ర్భాల్లో 4జీ నెట్‌వ‌ర్క్ స్లోగా ఉండ‌డం చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అంతేకాదు నష్టం కూడా క‌లిగిస్తుంది. మ‌రి మీ  4జీ నెట్‌వ‌ర్క్ స్లో అయిపోవ‌డానికి గ‌ల కారణాలు ఏమిటి? 4జీ స్పీడ్‌ను పెంచుకోవ‌డం ఎలా?

భార‌త్‌లో 4జీ స్లో అవ‌డానికి కార‌ణాలివే..
క‌వ‌రేజ్ ఇష్యు ..భార‌త్‌లో 4జీ సేవ‌లు స్లోగా మార‌డానికి గ‌ల కార‌ణాల్లో ప్ర‌ధాన‌మైంది. సిగ్న‌ల్ క‌వ‌రేజ్‌కు స్పీడ్ స‌రైన రీతిగా అంద‌క‌పోవ‌డంతో ఇంట‌ర్నెట్ వేగం త‌గ్గిపోతుంది.  భార‌త్‌లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా, జియో లాంటి టెలికాం ఆప‌రేట‌ర్లు కావాలంటే ఈ ఇబ్బందిని స‌వ‌రించుకోవ‌చ్చు. జియో వచ్చిన త‌ర్వాత మిగిలిని టెలికాం సంస్థ‌ల‌పై బాగా భారం ప‌డింది. త‌క్కువ రేట్ల‌కు వేగంగా ఇంట‌ర్నెట్ ఇవ్వ‌లేక‌... ఇవి స్పీడ్ త‌గ్గించేశాయి. ఎయిర్‌టెల్ లాంటి దిగ్గ‌జ సంస్థ కూడా వేగంగా ఇంట‌ర్నెట్ ఇవ్వ‌లేక‌పోతోంది. నెట్‌వ‌ర్క్ కెపాసిటీ, స్పెక్ట్ర‌మ్ ఉన్న ఏరియాను బ‌ట్టి కూడా ఇంట‌ర్నెట్ స్పీడ్ ఆధార‌ప‌డి ఉంటుంది. 

స్పీడ్ పెంచుకోండిలా...
మీ ఇంట‌ర్నెట్ స్పీడ్ త‌గ్గిపోయినందుకు మీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ను తిట్ట‌డం క‌న్నా.. కొన్ని చిట్కాల ద్వారా ఇన్‌స్టంట్‌గా 4జీ సేవ‌ల స్పీడ్‌ను పెంచుకోవ‌చ్చు. 4జీ ఎల్‌టీఈ క‌నెక్టివిటీ ఉన్న ఫోన్లు ఎక్కువ అయిపోవ‌డంతో మీ స్పెక్ట్ర‌మ్ ఆ భారాన్ని భ‌రించ‌లేక‌పోవ‌చ్చు. 4జీ రివ‌ల్యూష‌న్ భార‌త్‌లో మొద‌లై ఇంకా ఏడాదే అయింది. ఈ ప్లాబ్ర‌మ్స్ ఫిక్స్ కావాలంటే ఇంకా స‌మ‌యం ప‌డుతుంది.  మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్రిఫ‌ర్డ్ నెట్‌వ‌ర్క్ ఆప్ష‌న్ క్లిక్ చేసి 4జీ సెల‌క్ట్ చేసుకోవాలి. చాలామంది ఈ ఆప్ష‌న్ ప‌ట్టించుకోరు. కానీ 4జీ నెట్‌వ‌ర్క్ రావ‌డానికి ఇదే పెద్ద ఆధారం. ఇదే కాక యాక్సెస్ పాయింట్ నెట్‌వ‌ర్క్ (ఏపీఎన్)ను చెక్ చేసుకోవాలి. అంటే స‌రైన ఏపీఎన్ స‌మాచారాన్ని దీనిలో ఉంచ‌డం చాలా కీల‌కం. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏపీఎన్‌ను రిసెట్ చేసుకోవాలి.  

ఇవి కూడా కారణమే 

మంచి యాంటినా ఉన్న ఫోన్ల‌ను ఎంపిక చేసుకోవాలి. బ‌ల‌మైన సిగ్న‌ల్‌కు ఇదే ముఖ్యం. ఎంఐ మిక్స్2 లాంటి ఫోన్లు పెద్ద యాంటినాల‌తో వ‌స్తున్నాయి. ఇదే కాక సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్లు వాడ‌డం, ఇంట‌ర్నెట్ యూసేజ్ మీద కూడా  4జీ వేగం ఆధార‌ప‌డి ఉంటుంది. వీటి వాడ‌కం ఎక్కువైతే స్పీడ్ త‌గ్గిపోతుంది. అందుకే సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌ను వీలైనంత ఎక్కువ‌గా సిస్ట‌మ్‌లోనే వాడితే బెట‌ర్‌.