• తాజా వార్తలు
  •  

వీఎల్‌సీ ప్లేయ‌ర్ ద్వారా లార్జ్ వీడియో ఫైల్స్‌ను చిన్న‌విగా మార్చేందుకు గైడ్‌

పెద్ద సైజులో ఉన్న ఫైల్స్‌ను చిన్న సైజుకు మార్చాలంటే మ‌న‌కు ఎప్పుడూ ఇబ్బందే. ఎందుకంటే ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ స‌రిగా లేక‌పోవ‌డం... డేటా స‌రిగా లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయ‌డం సాధ్యం కాదు. పెద్ద సైజులో ఉన్న వీడియోల‌ను సుల‌భంగా చిన్న సైజు ఫైల్‌గా మార్చాలంటే మీకు ఒక సుల‌భ‌మైన మార్గం ఉంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ ముందుగా ఆ లార్జ్ వీడియో ఫైల్‌ను కంప్రెస్ చేసి ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌డ‌మే.  దీని వ‌ల్ల డేటా, మెమెరీ కూడా బాగా ఆదా అవుతుంది. అయితే వీఎల్‌సీ మీడియో ప్లేయ‌ర్ సాయంతో పెద్ద ఫైల్స్‌ను చిన్న‌విగా మార్చొచ్చు. మ‌రి ఎలా మార్చాలో చూద్దాం.. 


ఏం చేయాలంటే..
1.ముందుగా వీఎల్‌సీ మీడియో ప్లేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్‌స్టాల్ చేసి మీ విండోస్ 10, 8, 9, ఎక్స్‌పీ ఏదైనా వెర్ష‌న్ల‌లో ఓపెన్ చేయాలి.

2. ఆ త‌ర్వాత మెనూలో మీడియా ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.  ఈ మీడియా ఆప్ష‌న్లో మీకు అనేక ఫీచ‌ర్లు క‌నిపిస్తాయి. 

3. ఆ త‌ర్వాత కన్వ‌ర్ట్ లేదా సేవ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. లేక‌పోతే నేరుగా కంట్రోల్ ఆర్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

4. ఆ త‌ర్వాత మీరు కంప్రెస్ చేయాల‌నుకునే వీడియో ఫైల్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ ఫైల్స్‌ను కూడా సెలక్ట్ చేసుకోవ‌చ్చు.

5. ఒక‌సారి వీడియో ఫైల్స్ యాడ్ చేసిన త‌ర్వాత క‌న్వ‌ర్ట్ ఆర్ సేవ్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

6. ఆ త‌ర్వాత వీడ‌యో క్వాలిటీ ఔట్‌పుట్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.

7.ఆ త‌ర్వాత మీరు ఫైల్స్ ఎక్క‌డ  సేవ్ చేయాల‌నుకుంటున్నారో ఆ డెస్టినేష‌న్‌ను ఎంచుకోవాలి. ఆ ఫైల్‌కు ఒక పేరు పెట్టాలి. 

8. ఆ త‌ర్వాత కంప్రెష‌న్ ప్రాసెస్ వెంట‌నే ప్రారంభం అయిపోతుంది.  కంప్రెష‌న్ బార్ పూర్త‌య్యే వ‌ర‌కు మీరు వేచి చూడాలి. ఇది మీ వీడియో ఫైల్ సైజును బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. 

9. మీ కంప్రెష‌న్ ప్రాసెస్ కంప్లీట్ అయిన త‌ర్వాత మీ కంప్రెస్డ్ వీడియో ఫైల్ మీరు ఎంచుకున్న డెస్టినేష‌న్ ఫోల్డ‌ర్‌లో క‌నిపిస్తుంది. ఇది సాధార‌ణ ఫైల్ కంటే చిన్న సైజులో ఉంటుంది. దీంతో ఈ ఫైల్‌ను షేర్ చేయ‌డం చాలా సుల‌భం. 

జన రంజకమైన వార్తలు