• తాజా వార్తలు

గైడ్‌: ఇంట‌ర్నెట్ లేకున్నా దొంగిలించబడిన ఫోన్ నుంచి డేటా తీసేయ‌డం ఎలా?

మ‌నం పొద్దున లేస్తే స్మార్ట్‌ఫోన్ ముఖ‌మే చూస్తాం. ఏ ప‌ని చేయాల‌న్నా..ఏం కావాల‌న్నా స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. మ‌రి ఈ ఫోన్ పొర‌పాటున పోతే!! ఈ ఊహే భ‌యంగా ఉందా? అమ్మో ఇంకేమైనా ఉందా అందులో మ‌న‌కు సంబంధించిన విలువైన డేటా ఉంటుంది క‌దా అనుకుంటున్నారా? ... దొంగ‌లు ఇవ‌న్నీ ఆలోచిస్తారా ఏంటి? ఎత్తికెళిపోతారంతే!! మ‌రి ఒక‌సారి ఫోన్ పోతే మ‌న డేటా అంతా పోవాల్సిందేనా.. ఆ డేటా మిస్ యూజ్ కావాల్సిందేనా? అదే కాదు.. మ‌న ఫోన్ నుంచి డేటాను తీసేయ‌చ్చు. ఫోన్ ఎక్క‌డ ఉన్నా... ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేకున్నా కూడా అందులో ఉన్న డేటాను  ఎరేజ్ చేసే అవ‌కాశం ఉంది అంటోంది టెక్నాల‌జీ! మ‌రి అదెలాగో చూద్దామా..

మొబైల్ లొకేట్ చేయండి..
మ‌నం మొబైల్ పోయిన వెంట‌నే దాని గురించి బాధ‌ప‌డ‌కుండా ఒక ప‌ని చేయాలి. మొబైల్‌లో చాలా యాప్‌లు మ‌నం డౌన్‌లోడ్ చేసి ఉంటాం. ఈ యాప్‌లే మ‌న‌కు ఈ సంద‌ర్భంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఈయాప్‌ల సాయంతో మొబైల్‌ను లొకేట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే ఈ ప‌ద్ధ‌తి ఫెయిల్ అయితే మాత్రం నేరుగా అందులో ఉన్న డేటాను ఎరేజ్ చేయ‌చ్చు. అయితే ఇలా చేయాలంటే ముందుగా మొబైల్  ఆన్‌లో ఉండాలి. వ‌ర్కింగ్ కండీష‌న్‌లో ఉండాలి. అయితే ఆ మొబైల్‌ను ట‌ర్న్ ఆఫ్ చేస్తే మాత్రం ఈ ప్రాసెస్ కాస్త క‌ష్టం. 

ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేక‌పోయినా..
ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేక‌పోయినా కూడా మ‌నం పోగొట్టుకున్న మొబైల్ నుంచి డేటాను ఎరేజ్ చేయ‌చ్చు. దీనికి కొన్ని అప్లికేష‌న్లు ఉన్నాయి. కొన్ని పెయిడ్ స‌ర్వీసుల ద్వారా కూడా ఆ మొబైల్‌లోని డేటాను తీసేయ‌చ్చు. అలాంటి అప్లికేష‌నే ఎరాడొ... ఇంతకుముందెప్పుడు ఈ పేరు విన‌లేదా?  అయితే మీరు తెలుసుకోవాల్సిందే. ఎరాడో అప్లికేష‌న్ ఉంటే చాలు మీ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మెమ‌రీస్‌, చివ‌రికి పోగొట్టుకున్న‌ఫోన్లో ఉన్న యాప్స్‌ను కూడా డిలీట్ చేయ‌చ్చు. అదీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేకుండా.

ప‌ని చేస్తుందిలా..
 ఎరాడో అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ముందుగా ఈ యాప్‌ను ఓపెన్ చేసి యాక్టివేట్ చేసి పాస్‌వ‌ర్డ్ సెట్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి. ఆప్ష‌న్స్ క్లిక్ చేయాలి.  ఈ సెట్టింగ్స్ ద్వారా మీ పోయిన ఫోన్లో ఉన్న డేటాను ఎరేజ్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ అప్లికేష‌న్ చేసే ప‌ని ఏంటంటే పోయిన ఫోన్‌కు ఇదో కోడ్ పంపిస్తుంది. ఆ స‌మ‌యంలో ఫోన్ ఆన్‌లో ఉండాలి. అందులో మ‌న సిమ్ యాక్టివేట్‌గా ఉండాలి. ఆ కోడ్ ఒక‌సారి  ఎంట‌ర్ అయితే చాలు డేటా అంతా డిలీట్ అయిపోతుంది.  దీనికి ఎలాంటి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అవ‌స‌రం లేదు. 

జన రంజకమైన వార్తలు