పీసీ, ల్యాప్‌టాప్‌ల్లో ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్ చాలా అవసరం. ఎందుకంటే ఆఫీస్ పర్పస్ యూజ్చేసేవారికి ఇవి ఉండాల్సిందే.దీనితోపాటు ప్రొఫెషనల్స్‌కి ఇమేజ్ అప్డేటింగ్ సాఫ్ట్వేర్లు కావాలి. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చే వెబ్సైట్లు ఇవిగో..
ప్రొడక్టివిటీ టూల్స్
1.డాక్స్.గూగుల్.కామ్ (docs.google.com)
మీకు గూగుల్ ఐడీ ఉంటే గూగుల్ డాక్స్మీకు యాక్సెస్ ఉన్నట్లే. వర్డ్ ప్రాసెసింగ్ కోసం డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ కోసం షీట్స్, ప్రజంటేషన్ కోసం స్లైడ్స్ దీనిలో అందుబాటులో ఉంటాయి. వెబ్ బేస్డ్ ఆఫీస్ సూట్లో మీరు క్రియేట్ చేసే ఫైల్స్,డాక్యుమెంట్స్ అన్నీ మీ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
2.డాక్స్.జోహో. కామ్ (docs.zoho.com)
దీనిలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని రైటర్, షీట్, షోఫర్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్‌షీట్స్, ప్రజంటేషన్స్ యాక్సెస్చేసుకోవచ్చు. 1జీబీ వరకు ఫ్రీ స్టోరేజి కూడా పొందవచ్చు.
3.ఐక్లౌడ్.కామ్ (icloud.com)
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లయితే మీకు కచ్చితంగా యాపిల్ ఐడీ ఉంటుంది. ఈ ఐడీతో మీరు ఐ వర్క్ ఆఫీస్ సూట్‌ను వాడుకోవచ్చు. దీనిలో డాక్యుమెంట్ ఎడిటింగ్, స్ప్రెడ్ షీట్స్, ప్రజంటేషన్స్ కోసం కీ నోట్ అందుబాటులో ఉంటాయి. 5జీబీ ఐ క్లౌడ్ స్టోరేజ్‌తో దీన్ని వాడుకోవచ్చు.
ఈ మూడు ఆఫీస్ సూట్స్‌లోనూ మీరు వేరే వారికి కూడా యాక్సెస్ ఇచ్చి రీడ్, ఎడిట్‌కు అవకాశం ఇవ్వచ్చు. దీంతో ఒకేసారి చాలా పీసీల్లో దీన్ని వాడుకోవచ్చు.
ఇమేజ్ ఎడిషన్
1.సుమోపెయింట్.కామ్
ఇదొక ఆన్లైన్ ఇమేజ్ ఎడిటర్. ఆడోబ్ ఫొటోషాప్ మాదిరిగానే మీ హార్డ్‌డ్రైవ్ లేదా క్లౌడ్ నుంచి ఇమేజ్ను నేరుగా బ్రౌజ్ చేసివాటిని ఎడిట్ చేసుకోవచ్చు. డిజిటల్ పెయింటింగ్స్ క్రియేట్చేయవచ్చు. ఫోటోషాప్‌లో ఉండే అన్ని ఆప్షన్లు ఇందులో ఉంటాయి.
2.పిక్సెలర్.కామ్ (pixlr.com)
ఇది కూడా సుమో పెయింట్ లాంటి వెబ్‌సైటే. ఫ్లాష్ బేస్డ్ ఆన్లైన్ ఎడిటింగ్ టూల్ దీనిలో స్పెషాలిటీ.
3 వెక్టర్.కామ్ (vectr.com)
లోగోస్, బ్యానర్స్, ఐకాన్స్,స్కెచ్‌లు క్రియేట్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో తెలుసుకోవడానికి ట్యూటోరియల్ వీడియోస్ కూడా ఉంటాయి.