• తాజా వార్తలు
  •  

ఏమిటీ జీబీ వాట్స‌ప్‌ ?..

జీబీ వాట్స‌ప్‌.. వాట్స‌ప్ గురించి విన్నాం కానీ జీబీ వాట్స‌ప్ ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? ఇది చూడ‌టానిక యాప్ మాదిరిగానే క‌నిపిస్తుంది కానీ ప్లే స్టోర్‌లో మాత్రం ఎంత వెతికినా దొర‌క‌దు. ఎందుకంటే ఇది చాలా ప్ర‌త్యేకం. మ‌రి ఏమిటీ జీబీ వాట్స‌ప్‌?.. వాట్స‌ప్‌కు దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఉంటే ఈ రెంటికి ఉన్న లింక్ ఏమిటి? ..దీనిలో ఉన్న ఫీచ‌ర్లు ఏమిటి? .. దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

వాట్స‌ప్‌తో సంబంధం

జీబీ వాట్స‌ప్ అనే పేరు విన‌గానే మ‌న‌కు వెంట‌నే వాట్స‌ప్ గుర్తుకొస్తుంది. వాట్స‌ప్‌తో దీనికేమైనా రిలేష‌న్ ఉందేమో అనే అనుమానం వ‌స్తుంది. మీ అనుమానం స‌రైన‌దే.  ఎందుకంటే జీబీ వాట్స‌ప్ అనేది వాట్స‌ప్‌కు మోడెడ్ వెర్ష‌న్. ఈ వాట్స‌ప్ వెర్ష‌న్ అచ్చం వాట్స‌ప్ లాగే ప‌ని చేస్తుంది. అంతేకాదు వాట్స‌ప్‌కు మించిన ఫీచ‌ర్ల‌ను కూడా ఇది అందిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది వాట్స‌ప్‌కు ఎక్స్‌టెండెడ్ వెర్ష‌న్.  మ‌నం వాడే అన్ని యాప్‌ల గురించి తెలుసుకోవాల‌ని అనుకుంటాం. కానీ ప్రైవ‌సీ వ‌ల్ల మ‌నం అన్నీ తెలుసుకునే అవ‌కాశం ఉండ‌దు. అయితే ఈ నిబంధ‌న‌లు దాటి మ‌న‌కు విలువైన స‌మాచారం ఇవ్వ‌డానికి జీబీ వాట్స‌ప్ లాంటివి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జీబీ వాట్స‌ప్ ఫీచ‌ర్లు

1. 50 ఎంబీ సైజు వ‌ర‌కు మీరు వీడియోల‌ను పంపించుకోవ‌చ్చు. విశేషం ఏమిటంటే అఫీషియ‌ల్ వాట్స‌ప్‌తో మీరు 16 జీబీ వ‌ర‌కు మాత్ర‌మే వీడియోలు పంపే అవ‌కాశం ఉంది.

2. జీబీ వాట్స‌ప్‌ను ఉప‌యోగించి మీరు ఒకేసారి 100 ఇమేజ్‌ల‌ను పంపే అవ‌కాశం ఉంది.  అదే వాట్ప‌ప్‌లో ఇది 30 ఇమేజ్‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది.

3. జీబీ వాట్స‌ప్‌లో మీ స్టేట‌స్, టైపింగ్ స్టేట‌స్‌, లాస్ట్ సీన్‌, డ‌బుల్ టిక్స్‌, బ్లూటిక్స్ హైడ్ చేసుకోవ‌చ్చు. మామూలు దాంట్లో వీటిలో కొన్నే చేయ‌గ‌లం.

4. గ్రూపు పేరును 35 క్యార్ట‌ర్ల‌తో పెట్టుకోవ‌చ్చు. అఫీషియ‌ల్ వాట్సప్‌తో ఇది సాధ్యం కాదు

5. మీ వాట్స‌ప్ థీమ్‌ను మార్చుకోవ‌చ్చు. 100 వేర్వేరు భాషల్లో మాట్లాడుకోవ‌చ్చు

6. జీబీ వాట్ప‌ప్‌తో మీరు ఒకేసారి రెండు వాట్స‌ప్ అకౌంట్లు వాడ‌చ్చు

7.మీ కాంటాక్ట్స్‌కు ఆటో రిప్లేస్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

ఏపీకే ఫైల్ ద్వారా..

జీబీ వాట్స‌ప్ ప్ర‌స్తుతానికి ప్లే స్టోర్‌లో ల‌భ్యం కావ‌ట్లేదు. మీరు త‌ప్ప‌కుండా ఈ యాప్‌ను ఉప‌యోగించాల‌ని అనుకుంటే ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ద్వారా వాడుకోవ‌చ్చు. ఇది మోడెడ్ వెర్ష‌న్ కావ‌డంతో అఫీషియ‌ల్ గూగుల్ ప్లే స్టోర్‌కు ఫిట్ కావ‌ట్లేదు. లేటెస్టు జీబీ వాట్స‌ప్‌ను మీరు మీడియాఫైర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు