• తాజా వార్తలు

గైడ్‌: పాత ఫోన్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా? అయితే వాటిని రీసైకిల్ చేయండి.. లేదా అమ్మేయండిలా!

చాలామంది ద‌గ్గ‌ర పాత ఫోన్లు ఉంటాయి. వాటిని కొంత కాలం వ‌ర‌కు ఉప‌యోగించి ఆ త‌ర్వాత మూల ప‌డేస్తారు. క‌నీసం అదొక‌టి ఉంద‌న్న సంగ‌తే మ‌రిచిపోతారు. కొత్త ఫోన్లు చేతికొచ్చిన తర్వాత ఓల్డ్ ఫోన్లు మ‌న‌కు బోర్ కొట్ట‌డం స‌హజం. అలాగ‌ని అంత ఖ‌రీదు పెట్టి కొన్న ఫోన్ల‌ను ప‌నికి రాకుండా ప‌క్క‌న‌పెట్టేస్తే ఎలా! వాటిని రీసైకిల్ చేసి అమ్మేస్తే ఎలా ఉంటుంది? ఎవ‌రికైనా దానంగా ఇస్తే ఎలా ఉంటుంది? మ‌రి రీ సైకిల్ చేసి అమ్మేయ‌డం ఎలా?.. డొనేట్ చేయ‌డం ఎలా?

ఛారిటీకి ఇచ్చేయండి..
కొన్ని ఛారిటీలు పాత ఫోన్ల‌ను డొనేష‌న్ కింద తీసుకుంటాయి. అయితే అవ‌స‌రం ఉన్న వాళ్ల‌కు ఆ ఛారిటీలు ఫోన్ల రూపంలో సాయం చేయ‌వు. ఆ ఫోన్ల‌ను రీసైకిల్ చేసి.. వాటిని అమ్మి.. ఆ వ‌చ్చిన డ‌బ్బుల‌తో సాయం చేస్తాయి. దీని కోసం కొన్ని ప్ర‌త్యేక సంస్థ‌లు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్స్ ఫ‌ర్ సోల్జ‌ర్స్ అలాంటి కంపెనీయే. మీ ఫోన్ల‌ను తీసుకుని వాటిని రీసైకిల్ చేసి తిరిగి వాటిని అమ్మ‌డమే వీటి ప‌ని. సైనికుల కోసం ఇది ప‌ని చేస్తోంది. పాత ఫోన్ల‌ను రీసైకిల్ చేసి అమ్మి ఆ వ‌చ్చిన డ‌బ్బుల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ కాలింగ్ కార్డ్స్ కొని వాటిని సైనికుల‌కు అందిస్తుంది. దాంతో వారు త‌మ స‌న్నిహితుల‌తో మాట్లాడుకునే అవ‌కాశం ఉంటుంది. నేష‌న‌ల్ కొయిలేష‌న్ అగ‌నెస్ట్ డొమిస్టిక్ వ‌యిలెన్స్ కూడా ఇదే ప‌ద్ధ‌తిలో ప‌ని చేస్తుంది.

అమ్మ‌కం.. అమ్మ‌కం..
కొత్త ఫోన్లు మార్కెట్లోకి వ‌స్తే చాలు పాత ఫోన్లు వ‌ర‌ద‌లా అమ్మ‌కానికి వ‌స్తాయి. ఇ బే లాంటి సైట్ల‌కు పాత ఫోన్ల‌ను అమ్మ‌డ‌మే ప‌ని. అయితే ఫోన్ బ్రాండ్‌ను బ‌ట్టి.. ఆ డివైజ్ కొన్న తేదీని బ‌ట్టి ఎంత మొత్తం మ‌నకు డ‌బ్బు వ‌స్తుంద‌న్న విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇలా ఫోన్ల‌ను ప్ర‌త్యేకంగా అమ్మ‌డం కోసం గాజెల్లె లాంటి సైట్లు ఉన్నాయి. మంచి కండిష‌న్లో ఉన్న ఫోన్లు బాగానే ధ‌ర ప‌లుకుతాయి.  ఫోన్ల‌ను అమ్మి పెట్ట‌డంలో ఇ బే కూడా ముందంజ‌లో ఉంది. వీడియో గేమ్ రిటైల‌ర్ గేమ్ స్టాప్ కూడా ఈ వ్యాపారంలో ఉంది. 

రీ యూజ్‌.. రీ ప‌ర్ప‌జ్‌
మీ ఫోన్ పాత‌దే అయి ఉండొచ్చు కానీ దాన్ని వేరే అవ‌స‌రాల‌కు కూడా వాడుకోవ‌చ్చు. అంటే ఫోన్‌కు సెల్యుల‌ర్ సిగ్న‌ల్ లేక‌పోయినా.. వైఫైని క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.  స్ట్రీమ్ మ్యూజిక్ కోస‌కం ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు చేసుకోవ‌చ్చు. ఏమైనా యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  మీరు రెగ్యుల‌ర్‌గా ఉప‌యోగించే ఫోన్‌కు ఏమైనా ఇబ్బంది ఎదురైతే.. ఈ ఫోన్‌ను బ్యాక్ అప్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు