• తాజా వార్తలు
  •  

గైడ్ : మీ పి.సి లో టోటల్ యాక్టివిటీ హిస్టరీని క్లియ‌ర్ చేయ‌డానికి గైడ్

మ‌నం కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే ఎన్నోఅప్లికేష‌న్లు ఓపెన్ చేస్తాం. ర‌క‌ర‌కాల లింక్‌లు క్లిక్ చేస్తూ ముందుకెళ‌తాం. కానీ వాటిలో  మీకు అవ‌స‌ర‌మైన‌వి ఉంటాయి..  అవ‌స‌రం లేనివి కూడా ఉంటాయి. కానీ ఒక్కోసారి మీరు కొన్ని కీల‌క‌మైన సైట్లు ఓపెన్ చేస్తారు. వాటి వివ‌రాలు ఎవ‌రికి తెలియ‌కూడ‌ద‌ని భావిస్తారు. అయితే చాలామంది మ‌నం బ్రౌజింగ్ చేసిన సైట్ల వివ‌రాల‌ను ఎలా దాయాలో తెలియ‌దు. ముఖ్యంగా ఇంట‌ర్నెట్ కేఫ్‌ల‌కు వెళ్లినప్పుడు బ్రౌజింగ్ హిస్ట‌రీ విష‌యం కాస్త కంగారు పెడుతుంది. ఎందుకంటే మ‌నం ఏం చేశామో... ఏ ఏ సైట్లు ఓపెన్ చేశామో ఆ త‌ర్వాత ఆ కంప్యూట‌ర్ మీద కూర్చునే వారికి లేదా ఇంట‌ర్నెట్ సెంట‌ర్ వాళ్ల‌కు తెలిసిపోయే ప్ర‌మాదం ఉంది. అందుకే మ‌న బ్రౌజింగ్ హిస్ట‌రీని ఎప్ప‌టిక‌ప్పుడు క్లియ‌ర్ చేసుకోవాలి. మరి బ్రౌజింగ్ హిస్ట‌రీని ఎలా క్లియ‌ర్ చేయాలో తెలుసా?

సెట్టింగ్స్ యాప్ ద్వారా..
విండోస్ 10లో మీ బ్రౌజింగ్ హిస్ట‌రీని సెట్టింగ్స్ యాప్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా క్లియ‌ర్ చేయ‌చ్చు. అయితే ఈ యాప్ అన్ని విండోస్ వెర్ష‌న్ల‌లో ల‌భ్యం కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.  అప్‌డేటెడ్ వెర్ష‌న్ల‌లో మాత్ర‌మే ఇది దొరుకుతుంది. ప్రివ్యూ బిల్డ్ 17040తో ఇది ల‌భ్యం అవుతోంది. రాబోయే విండోస్ 10 స్టేబుల్ అప్‌డేట్‌లో సెట్టింగ్స్ యాప్ ఇన్‌బిల్ట్‌గా వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.  మీరు ప్రివ్యూ బిల్డ్ 17040 మోడ‌ల్ ఉప‌యోగిస్తుంటే మాత్రం ఇప్పుడే ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. మీరు విండోస్ 10 ఫాల్ క్రియేట‌ర్స్ అప్‌డేట్ ఉప‌యోగిస్తున్నా కూడా ఈ ఫీచర్ మీకు ఉంటుంది. మిగిలిన యూజ‌ర్లు విండోస్ 10 నెక్ట్ అప్‌డేట్ వ‌ర‌కు ఈ ఫీచ‌ర్ కోసం ఎదురు చూడాల్సి ఉంది.

క్లియ‌ర్ చేయండి ఇలా..
విండోస్ 10 సెట్టింగ్స్‌లోకి వెళ్లి  స్టార్ మెనూ ద‌గ్గ‌ర్లో ఉన్న విన్ లొగో ప్ల‌స్ ఐ అనే అనే హాట్ కీస్ ప్రెస్ చేయాలి. విండోస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన త‌ర్వాత మీకు చాలా మెనూస్ క‌నిపిస్తాయి. అందులో ప్రైవ‌సీ మెనూను క్లిక్ చేయాలి. 

ప్రైవ‌సీ మెనూ యాక్సెస్ చేసిన త‌ర్వాత యాక్టివిటీ హిస్ట‌రీ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.

యాక్టివిటీ హిస్ట‌రీపై క్లిక్ చేసిన త‌ర్వాత క్లియ‌ర్ యాక్టివిటీ హిస్ట‌రీ అనే మ‌రో ఆప్ష‌న్‌ను మీరు చూస్తారు. ఆ త‌ర్వాత క్లియ‌ర్ యాక్టివిటీ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.  మీ హిస్ట‌రీలో ఉన్న అంతా యాక్టివిటీని క్లియ‌ర్ చేయాలా అని ఒక పోపప్ మెసేజ్ మీకు క‌న‌బడుతుంది.  ఓకే బ‌ట‌న్ ప్రెస్ చేసి డ‌న్ అంటే చాలు.  

అంతే అప్ప‌టి వ‌ర‌కు మీరు చేసిన యాక్టివిటీ హిస్ట‌రీ అంతా మాయం అయిపోతుంది. వెంట‌నే విండోస్ 10 నుంచి లాగౌట్ కావొచ్చు.  అదే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో వేరే విండోస్ 10 డివైజ్‌లోకి మీరు లాగిన్ అయిన‌ట్ల‌యితే కొర్టానా మీకు ఎలాంటి నోటిఫికేష‌న్ల‌ను చూపించ‌దు. దీనికి కార‌ణం మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్లో బ్రౌజింగ్ హిస్ట‌రీ అంతా డిలీట్ కావ‌డ‌మే.

విజ్ఞానం బార్ విశేషాలు