• తాజా వార్తలు

గైడ్‌: ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ బ్రేక్ అయిన‌ప్పుడు సౌండ్ రావాలంటే ఎలా?

ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఒక్కోసారి బ్రేక్ అయి స‌డెన్‌గా ఆగిపోతుంటుంది. కానీ ఏదైనా ముఖ్య‌మైన వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు ఇలా జ‌రిగితే చాలా ఇబ్బంది ఎదురువుతుంది. అయితే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ పోయేట‌ప్పుడు మ‌న‌కు ముందుగానే తెలిపోతే బాగుంటుంది క‌దా! అయితే టెక్నాల‌జీలో ఈ ఆప్ష‌న్ కూడా వ‌చ్చేసింది. ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ క‌ట్ అయ్యే మ‌న‌కు సౌండ్ రూపంలో విష‌యంలో తెలిసిపోతుంది. అప్పుడు మ‌నం జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. 

నెట్‌సెన్స‌ర్‌
మ‌న ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ స‌రిగా ఉందో లేదో ఎప్పుడు క‌ట్ అవుతుందో ఎల్ల‌వేళ‌లా మానిట‌రింగ్ చేయ‌డానికి నెట్ సెన్స‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఉచితంగా ల‌భించే సాఫ్ట్‌వేర్‌. ఇంట‌ర్నెట్ డిస్‌క‌నెక్ట్ అయిన‌ప్పుడు ఇది గుర్తించి వెంట‌నే మ‌నల్ని అలెర్ట్ చేస్తుంది. మ‌న‌కు సౌండ్ రూపంలో తెలియ‌జేస్తుంది. ఇది మ‌న కంప్యూట‌ర్ బ్యాక్‌గ్రౌండ్లో ప‌ని చేస్తూ ఉంటుంది. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంట‌నే మ‌న‌కు తెలియజేస్తుంది. ఇలా జ‌ర‌గాలంటే మ‌నం ముందుగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.  నెట్ క‌నెక్ష‌న్ పోయిన‌ప్పుడు మ‌న‌కు సౌండ్ రూపంలో తెలియ‌జేయ‌డం మాత్ర‌మే కాదు.. ఇంట‌ర్న‌ల్‌గా క‌నెక్ష‌న్‌ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉందో లేదో చెక్ చేయ‌డం కోసం మ‌నం ఫ‌లానా టైమ్‌లో అని మెన్ష‌న్ చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేష‌న్ల ద్వారా..
ఎప్పుడు మ‌న‌కు నెట్ క‌నెక్ష‌న్ మిస్ అయినా వెంట‌నే మ‌న‌కు తెలియ‌జేయ‌డ‌మే కాదు..  నెట్ క‌నెక్ష‌న్ ఎందుకు క‌ట్ అవుతుందో రీజ‌న్స్ కూడా మ‌న‌కు నోటిఫికేష‌న్ రూపంలో అంద‌జేస్తుంది నెట్‌సెన్సార్‌.  క‌నెక్టివీటీ ప్రాబ్ల‌మ్స్ లేకుండా చేయ‌డం కోసం క‌న్‌ఫిగ‌రేష‌న్ సెట్ చేయ‌డం లాంటి ప‌నుల‌ను కూడా ఈ సాఫ్ట్‌వేరే చ‌క్క‌బెడుతుంది. ఏమైనా ఇబ్బంది త‌లెత్తిన వెంట‌నే సౌండ్‌తో కూడిన నోటిఫికేష‌న్ మీకు వ‌స్తుంది. దీన్ని ఎలా ఉప‌యోగించుకోవాలంటే సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయాలి. అందులో స్టార్ట్‌, స్టాప్ ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్ చేసే సాఫ్ట్‌వేర్ కూడా క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత మీ కంప్యూట‌ర్‌కు సంబంధించిన డిటైల్స్ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత కొన్ని ఆప్ష‌న్ల‌ను క‌న్‌ఫిగ‌ర్ చేయాలి.  ఏ ఆడియో ప్లే అవ్వాలో కూడా మీరే డిసైడ్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత బ్యాచ్ ఫైల్‌ను ఎగ్జిక్యూట్ చేయాలి.  ఆ త‌ర్వాత ఎంత స‌మ‌యంలో ఆ సాఫ్ట్‌వేర్ ర‌న్ కావాలో టైమింగ్ కూడా సెట్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు