• తాజా వార్తలు

 ఫైల్స్ షేరింగ్ యాప్‌ ఎంఐ డ్రాప్ కి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్

ఫైల్స్ షేరింగ్ కోసం షేరిట్ మ‌న‌కంద‌రికీ తెలుసు.  షేర్ ఇట్ ఎంత పాపుల‌ర్ అయిందంటే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లోనూ ఈ ఫైల్ షేరింగ్ యాప్‌ను యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అలాగే షియోమీ కూడా త‌న సొంత షేరింగ్ యాప్ ఎంఐ డ్రాప్‌ను లాంచ్ చేసింది.   న‌వంబ‌ర్‌లో MIUI 9 లాంచింగ్ స‌మయంలోనే దీన్ని కూడా లాంచ్ చేసింది. ఈ ఎంఐ డ్రాప్ స్పెషాలిటీస్ ఏమిటి? ఎలా ప‌ని చేస్తుంది?  దీని ద్వారా ఫైల్స్ ఎలా షేర్ చేసుకోవాలో చూడండి.
యాడ్స్ లేవు..యూజర్ ఫ్రెండ్లీ
షేరిట్ లాంటి ఫైల్ షేరింగ్ యాప్స్‌లో యాడ్స్‌తోనే హెడేక్‌.  ఎంఐ డ్రాప్‌లో ఎలాంటి యాడ్స్ ఉండ‌వు. యూజ‌ర్ ఫ్రెండ్లీగా, క్లీన్‌గా ఉండే ఇంట‌ర్‌ఫేస్ ఎంఐ డ్రాప్ సొంతం.  నవంబ‌ర్‌లోనే ఎంఐ డ్రాప్‌ను లాంచ్ చేసినా దీనిలో యూజ‌ర్ నేమ్ సెట్ చేసుకోవ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డం ప్ర‌ధాన అవ‌రోధంగా ఉండేది. అందుకే ఇది గూగుల్ అకౌంట్ ద్వారా ర‌న్ అయ్యేది. ఇది వైఫ్ హాట్‌స్పాట్ వివరాలను రీసెట్ చేయ‌డంతో ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేయాల్సి వ‌చ్చేది.అందుకే ఎంఐ డ్రాప్ వ‌చ్చి మూడు నెల‌ల‌యినా పెద్ద‌గా ఎవ‌రూ యూజ్ చేయడం లేదు. షియోమి తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌లో ఈ ప్రాబ్ల‌మ్స్‌ను ఫిక్స్ చేసింది.
 ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్రొటోకాల్ (FTP) 
ఇత‌ర ఫైల్ షేరింగ్ యాప్స్‌లో లేని  ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్రొటోకాల్ (FTP) అనే కొత్త ఫీచ‌ర్‌ను కూడా యాడ్ చేసింది. దీంతో  ఎంఐ డ్రాప్ ద్వారా  ఆండ్రాయిడ్ డివైస్‌లు, పీసీల మ‌ధ్య కూడా ఫైల్స్ షేర్ చేసుకోవ‌చ్చు.  ఇంత‌కు ముందు ఈ ఫీచ‌ర్ ఎంఐ ఎక్స్‌ప్లోరర్‌లో మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు ప్లే స్టోర్‌లో దొరికే ఎంఐ డ్రాప్ యాప్‌లో కూడా అందుబాటులోకి వ‌చ్చింది.
ఫైల్స్ షేరింగ్ ఇలా..
ఫోన్‌, పీసీ ఒకే వైర్‌లైస్ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఆ రెండింటి మ‌ధ్య ఫైల్స్ షేర్ అవుతాయి.
* ఎఫ్‌టీపీ పేజీని ఓపెన్ చేయ‌డానికి యాప్ మెనూలో ఉన్న  ‘Connect to computer’ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.
* ఎఫ్‌టీపీ సర్వ‌ర్ యాప్‌ను యూజ్ చేయ‌డానికి ముందు మీ  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లో ఫైల్స్ షేర్ చేయాలా లేదా ఎస్డీ కార్డ్‌లోవి షేర్ చేయాల‌నేది ఆప్ష‌న‌ల్లో సెలెక్ట్ చేసుకోండి.
* ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోగానే ఎఫ్‌టీపీ స‌ర్వ‌ర్ స్టార్ట‌వుతుంది.  యాప్‌లో ఒక క‌స్ట‌మ్ అడ్ర‌స్ క్రియేట్ అవుతుంది. దాన్నిమీరు పీసీ బ్రౌజ‌ర్‌లో కానీ ఫైల్ మేనేజ‌ర్‌లో కానీ ఓపెన్ చేయాలి.
* ఎఫ్‌టీపీ స‌ర్వ‌ర్‌, డేటాను సురక్షితంగా ఉంచ‌డానికి పాస్‌వ‌ర్డ్‌తో ఉండే సైన్ ఇన్‌ను కూడా వాడుకోవ‌చ్చు. ఇందుకోసం  Sign in anonymously      ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
* దీంతోపాటు యూజ‌ర్లు UTF-8, GKB , BIG 5ల నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ ఎన్‌కోడింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. ఎఫ్‌టీపీ స‌ర్వ‌ర్ ర‌న్ అవుతున్న‌ప్పుడు డిస్‌ప్లే కూడా చూసుకోవ‌చ్చు.
* పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్‌ను ఎనేబుల్ చేసుకుంటే మీరు ఫోన్ స్టోరేజ్‌ను పీసీలో యాక్సెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు మీ సైన్ ఇన్‌, పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది. ఇది మీకు ఎక్స్‌ట్రా సెక్యూరిటీగా ప‌ని చేస్తుంది.
* ఎంఐ డ్రాప్ యాప్‌లోని ఎఫ్‌టీపీ ద్వారా యావరేజ్‌గా 1.5 నుంచి 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఫోన్‌, పీసీల మ‌ధ్య ఫైల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ మ‌ధ్య‌లో అంత‌రాయం ఏర్ప‌డినా త‌ర్వాత అక్క‌డి నుంచే రెజ్యూమ్ చేసుకోవ‌చ్చు.
మొత్తంగా చూస్తే షేరిట్‌,క్సెండ‌ర్ లాంటి ఫైర్ షేరింగ్ యాప్స్‌లో యాడ్స్ తో  అన్‌కంఫ‌ర్టబుల్‌గా ఫీల్ అయ్యేవాళ్ల‌కు ఎంఐ డ్రాప్ మంచి ఆప్ష‌న్‌.
 

జన రంజకమైన వార్తలు