• తాజా వార్తలు
  •  

మీ పాత డీవీడీల‌న్ని ప‌ని చేయ‌కుండా పోయేలోపు బ్యాక్ అప్ తీసుకోవ‌డానికి గైడ్‌

ఇప్పుడంటే డీవీడీలు ఎక్కువ‌గా వాడ‌ట్లేదు కానీ.. ఒక‌ప్పుడు డీవీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మార్కెట్లోకి కొత్త డీవీడీ ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు.  అయితే మారిన కాల‌మో.. ఇంట‌ర్నెట్ ప్ర‌భావమో.. టెక్నాల‌జీ వ‌ల్లో డీవీడీల  హవా త‌గ్గిపోయింది. అయితే చాలామంది ద‌గ్గ‌ర గుట్ట‌లుగా డీవీడీలు పేరుకుపోయాయి. వాటిలో చాలావ‌ర‌కు పాడైపోయే స్థితికి చేరుకున్నాయి. మ‌రి ఈ డీవీడీలు పాడ‌య్యేలోపు మ‌నం వాటిని బ్యాక్ అప్ తీసుకోవ‌డానికి గైడ్‌.

విన్ ఎక్స్ డీవీడీ కాపీ ప్రో
మ‌న పాత డీవీడీలోని డేటాను సిస్ట‌మ్‌లోకి కాపీ చేయ‌డానికి  విన్ ఎక్స్ డీవీడీ కాపీ ప్రో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో మీరు వెంట‌నే బ్యాక్ అప్ తీసుకునే అవ‌కాశం ఉంది. అది కొత్త డీవీడీ అయినా పాత డీవీడి అయినా డేటా వెంట‌నే కాపీ అవుతుంది.  దీనిలో 9 కాపీ మోడ్స్ ఉన్నాయి.  ఒక చోట కాపీ చేసుకుని ఆ త‌ర్వాత పేస్ట్ చేసుకోవ‌చ్చు.

డీవీడీ నుంచి డీవీడీకి
మీ పాత డీవీడీ ప‌గిలిపోయినా.. లేదా గీత‌లు ప‌డినా దాన్ని కొత్త డీవీడీలోకి మార్చుకోవ‌చ్చు. దీనికి మీకు విన్ ఎక్స్ డీవీడీ కాపీ ప్రొ  ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే మీరు ఈ కాపీ, పేస్ట్‌ల‌ను చేసుకోవ‌చ్చు. దీనికి త్రి స్టెప్ సొల్యుష‌న్ ఉంది విన్ ఎక్స్ డీవీడీ కాపీ ప్రొలో. అంటే మీ పాత డీవీడీలోని డేటా కొత్త డీవీడీలోకి మారిపోతుంది.

డీవీడీని క్లోన్ చేయండి
మీ డీవీడీని క్లోన్ కూడా చేసుకోవ‌చ్చు. దీనికి ఐఎస్‌వో, వీడియో టీఎస్ ఫోల్డ‌ర్ ఉప‌యోగప‌డుతుంది. వీటివ ల్ల మీరు స‌బ్ టైటిల్స్‌, లాంగ్వేజ్ ఇత‌ర ఏ కంటెంట్ కోల్పోకుండా కూడా మ‌నం డేటాను కాపీ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. దీనికి మీకు ప‌ట్టే స‌మ‌యం కూడా చాలా త‌క్కువే. కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలో మీకు ఇవి కాపీ అయిపోతాయి.
 
సెక్టార్ బై సెక్టార్ కాపీ
మీ డీవీడీ డ్యామేజ్ అయినా కూడా అందులో డేటాను కాపీ చేసుకునే అవ‌కాశం ఉంది. దీనికి సెక్టార్ బై సెక్టార్ ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది బ్యాడ్ సెక్ట‌ర్స్‌ను స్కిప్ చేసి మీకు నాణ్య‌మైన సెక్టార్ల‌ను కాపీ చేస్తుంది. అంటే మీకో వ‌ర్కింగ్ డీవీడీని అందిస్తుంది. దీనికి విన్ ఎక్స్ డీవీడీ కాపీ ప్రొ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.                                                                                                                        

జన రంజకమైన వార్తలు