ఇంపార్టెంట్ పనిలో ఉండగా ఏదో స్పామ్ కాల్ వస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది? ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. సెల్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నదే. ఇలాంటి స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఫోన్లో చాలా ఆప్షన్లున్నాయి. మాన్యువల్‌గా, ఆటోమేటిగ్గా కూడా స్పామ్ కాల్స్‌ను, ఆ నెంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లను కూడా బ్లాక్ చేసుకోవచ్చు.
మాన్యువల్‌గా బ్లాక్ చేయాలంటే..
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో అంతకంటే అడ్వాన్స్డ్ ఓఎస్ మీ మొబైల్లో ఉంటే నేరుగా డయలర్ నుంచే కాల్స్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. మీ కాల్ లాగ్‌లో ఉన్న నెంబర్ మీద లాంగ్ ప్రెస్ చేసి వచ్చే ఆప్షన్లలో నుంచి Block number క్లిక్ చేస్తే చాలు. అయితే స్టాక్ ఆండ్రాయిడ్ ఉన్న ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ లాంటి నాన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కనుక వాడుతుంటే ఈ ప్రాసెస్ కొద్దిగా క్లిష్టం.
* నెక్సస్ లాంటి స్టాక్ ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో రైట్ సైడ్ టాప్‌లో ఉన్న త్రీ డాటెడ్ ఓవర్‌ఫ్లో బటన్‌ను ట్యాప్ చేస్తే డయలర్ మెనూ యాక్సెస్ అవుతుంది. అదే శాంసంగ్ ఫోన్లలో అయితే more అనే దగ్గర ట్యాప్ చేస్తే డయలర్ మెనూలోకి తీసుకెళుతుంది.
* ఇప్పుడు Settingsను సెలెక్ట్ చేసుకుని Call blocking ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
* తర్వాత పేజీలో Add number ను ట్యాప్ చేసి బ్లాక్ చేయాలనుకున్న నంబర్‌ను యాడ్ చేయాలి. లేదంటే Block list ఆప్షన్‌ను క్లిక్ చేసి మీరు బ్లాక్ చేయాలనుకున్న నెంబర్‌ను యాడ్ చేయాలి. కాంటాక్ట్ లిస్ట్‌లో నుంచి కూడా నెంబర్‌ను సెలెక్ట్ చేసి బ్లాక్ చేయొచ్చు.
ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఆ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చినా రింగవదు. కాల్ వస్తున్నట్లు నోటిఫికేషన్ రాదు. మెసేజ్ కూడా రాదు.
సస్పెక్టెడ్ స్పామ్ కాల్స్‌ను ఐడెంటిఫై చేయడం ఎలా?
పిక్సెల్, నెక్సస్ లాంటి ఆండ్రాయిడ్ స్టాక్ ఫోన్ వాడుతుంటే.. స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి డయలర్నే వాడుకోవచ్చు. ఇది చాలా హ్యాండ్సెట్లలో డిఫాల్ట్‌గానే ఉంటుంది. దీన్ని కన్ఫర్మ్ చేయాలంటే.. డయలర్‌ను ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్‌లో ఉన్న త్రీడాట్స్‌ను టాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి Caller ID &Spam ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దాన్ని ఆన్ చేస్తే చాలు.
ఆటోమేటిగ్గా బ్లాక్ చేయాలంటే..
మాన్యువల్‌గా కాకుండా ఆటోమేటిగ్గా కాల్స్ బ్లాక్ చేయాలంటే.. యాప్స్ కూడా ఉన్నాయి. Mr. Number యాప్‌తో ఆటోమేటిగ్గా బ్లాక్ చేయొచ్చు. scam/fraud, suspected spam, hidden numbers ఇలా మూడు రకాలుగా ఆటో బ్లాక్ చేస్తుంది. ఈ మూడు కేటగిరీల్లోనూ ఇండివిడ్యువల్‌గా నెంబర్స్ బ్లాక్ చేసుకోవచ్చు.
Mr. Number యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి రైట్‌సైడ్ టాప్‌లో ఉన్న త్రీ డాటెడ్ బటన్‌ను క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Call Blockingని క్లిక్ చేయాలి. Blocking Enabled క్లిక్ చేసి నెంబర్లు సెలెక్ట్ చేస్తే వాటిని బ్లాక్ చేస్తుంది. Numbers on my block list ఆప్షన్‌ను క్లిక్ చేసి నెంబర్లు యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న నెంబర్ నుండి మీకు కాల్ వస్తే అరసెకను పాటు రింగవుతుంది. కాలర్‌కు వాయిస్‌మెయిల్ పంపిస్తుంది. ఫలానా నెంబర్ నుండి కాల్ వచ్చిందని మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.
మీ నెట్వర్క్ కూడా బ్లాక్ చేస్తుంది
మీ సెల్నెట్వర్క్ కూడా మీరు కోరితే కాల్స్ బ్లాక్ చేస్తుంది. దీనికి కొంత ఛార్జి చేస్తుంది. లేదంటే ఈ ఆప్షన్ కోసం మంత్లీ సబ్‌స్ర్కిప్షన్ ఉంటుంది. అయితే అన్ని నెట్‌వర్క్‌లు ఈ సర్వీస్ ఇవ్వవు.