• తాజా వార్తలు
  •  

యూఎస్‌బీతో మీ మొబైల్‌ను ఫాస్ట్‌గా ఛార్జింగ్ చేయ‌డానికి కంప్లీట్ గైడ్

మ‌న‌లో చాలామంది కంప్యూట‌ర్‌కు ఉన్న యూఎస్‌బీ పోర్ట్‌కు యూఎస్‌బీ కేబుల్ పెట్టి దాని ద్వారా   సెల్‌ఫోన్ ఛార్జ్ చేస్తుంటాం. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌ల మీద వ‌ర్క్ చేసేవాళ్లు ఈ ఆప్ష‌న్‌ను త‌ర‌చుగా వాడుతుంటారు.అయితే ఛార్జ‌ర్‌తో అయినంత  స్పీడ్‌గా ఈ యూఎస్‌బీ క‌నెక్ష‌న్ ద్వారా ఛార్జింగ్ అవ‌దు. యూఎస్‌బీ ద్వారా కంప్యూట‌ర్‌తో ఛార్జి చేసినా మీ మొబైల్ స్పీడ్‌గా రీఛార్జ్ కావ‌డానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటోఈ ఆర్టిక‌ల్‌లో చ‌దవండి.
పోర్ట్‌ను బ‌ట్టి స్పీడ్‌
ప్ర‌స్తుతం మ‌న కంప్యూట‌ర్‌కు యూఎస్‌బీ 1.0,2.0, 3.0 ర‌కాల పోర్ట్‌లున్నాయి. లేటెస్ట్ పీసీలు, ల్యాపీల్లో అల్ట్రా ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫ‌ర్ కోసం యూఎస్‌బీ 3.2 పోర్ట్ ను ఇటీవ‌లే ఎనౌన్స్‌చేశారు.దీనిలో మీరు ఎలాంటి యూఎస్‌బీ కేబుల్ వాడినా కూడా స్పీడ్‌గా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. ఛార్జింగ్ కూడా స్పీడ్‌గా అవుతుంది. 
యూఎస్‌బీ 2.0, 3.0ల్లో ఏది స్పీడ్‌?
ఇప్ప‌టికే బాగా వాడుక‌లో ఉన్న యూఎస్‌బీ 2.0, 3.0ల్లో దేనితో బాగా స్పీడ్‌గా ఛార్జింగ్ అవుతుంద‌నేది ఆ ప‌రిస్థితిని బ‌ట్టి ఉంటుంది. ఎందుకంటే ప్ర‌తి యూఎస్‌బీ పోర్ట్‌కు ఒక మ్యాగ్జిమం రీఛార్జి స్పీడ్ ఉంటుంది. యూఎస్‌బీ 2.0 పోర్ట్ 500 ఎంఏ వ‌ర‌కు ప‌వ‌ర్ స‌ప్లై చేయ‌గ‌ల‌దు.అదే 3.0 పోర్ట్ అయితే 900 ఎంఏ వ‌ర‌కు ప‌వ‌ర్ అప్ చేస్తుంది. అంత‌మాత్రాన యూఎస్‌బీ 2.0కంటే యూఎస్‌బీ 3.0 పోర్ట్‌తో స్పీడ్‌గా ఛార్జింగ్ అవుతుంద‌ని చెప్ప‌లేం. యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ స్పీడ్‌ను ఈ కింది అంశాలు ప్ర‌భావితం చేస్తాయి 
1) బ్యాట‌రీ మ్యాగ్జిమం కెపాసిటీ
మీ ఫోన్ బ్యాట‌రీ కెపాసిటీ మీద కూడా ఛార్జింగ్ స్పీడ్ ఆధార‌ప‌డి ఉంటుంది.  ఉదాహ‌ర‌ణ‌కుమీ బ్యాట‌రీ 500 ఎంఏను మాత్ర‌మే యాక్సెప్ట్ చేస్తుంద‌నుకోండి. అప్పుడు మీరు యూఎస్‌బీ 2.0తో చేసినా, 3.0తో ఛార్జి చేసినా తేడా ఏమీ ఉండ‌దు. 
2) ఫోన్ సాఫ్ట్‌వేర్ 
కొన్ని మొబైల్స్ యూఎస్‌బీతో క‌నెక్ట్ చేసిన‌ప్పుడు 500 ఎంఏ వ‌ర‌కు మాత్రమే ప‌వ‌ర్ తీసుకునేలా లిమిట్ చేస్తాయి. అలాంట‌ప్పుడు మీరు ఏర‌క‌మైన యూఎస్‌బీ పోర్ట్ వాడినా ఒక‌టే. కానీ లేటెస్ట్ మొబైల్స్ సాఫ్ట్‌వేర్‌లో ఈ లిమిటేష‌న్ తొల‌గిస్తున్నారు. అంటే యూఎస్‌బీ 3.0 అంత‌కంటే ఎక్కువ పోర్ట్‌లున్నాగుర్తించి దానికి తగ్గ‌ట్లు ఫోన్ ఛార్జి అయ్యేలా చూసుకుంటాయి.
3) యూఎస్‌బీ కేబుల్‌
యూఎస్‌బీ కేబుల్ కూడా ఛార్జింగ్ స్పీడ్‌ను నిర్ధారిస్తుంది. అంటే మీ మొబైల్ 900 ఎంఏ వ‌ర‌కు ప‌వ‌ర్ తీసుకోగ‌ల‌దు. అంతే ప‌వ‌ర్ ఇవ్వ‌గ‌లిగే యూఎస్‌బీ 3.0 పోర్ట్ కూడా ఉంది. కానీ మీరు యూఎస్‌బీ 2.0 కేబుల్ వాడార‌నుకోండి. అప్పుడు మీ ఛార్జింగ్ 500 ఎంఏ ప‌వ‌ర్‌తోనే ఛార్జి అవుతుంది. కాబ‌ట్టి ఛార్జింగ్ స్లో అవుతుంది.
మొత్తంగా చెప్పాలంటే మీ పీసీ లేదా ల్యాపీ నుంచి మొబైల్‌ను స్పీడ్‌గా ఛార్జ్ చేయాలంటే యూఎస్‌బీ 3.0 పోర్ట్‌, యూఎస్‌బీ 3.0 కేబుల్ ఉండాలి. అలాగే మీ ఫోన్ బ్యాట‌రీ, ఆప‌రేటింగ్ సిస్టం కూడా ఆ పోర్ట్‌, కేబుల్‌కు త‌గ్గ స్పీడ్‌లో ఛార్జింగ్ అయ్యే కంపాట‌బులిటీతో ఉండాలి. ఇవ‌న్నీ ఉంటే మీ మొబైల్ ఫోన్‌ను పీసీ, ల్యాపీ నుంచి కూడా చాలా స్పీడ్‌గా ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు.