• తాజా వార్తలు
  •  

సగానికి సగం ధరకే ఫ్ల‌యిట్ టిక్కెట్లు కొనాల‌నుకుంటున్నారా?

విమాన ప్ర‌యాణం అంటేనే పెద్ద ఖ‌ర్చు.. ఇప్పుడు కాస్త ఆఫ‌ర్లు వ‌చ్చి రేట్లు త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు ఫ్ల‌యిట్‌లో వెళ్ల‌డం అంటే పెద్ద క‌లే. అయితే మ‌నం టెక్నాల‌జీని వాడుకుంటే డొమెస్టిక్ ఫ్ల‌యిట్స్ మాత్ర‌మే కాదు అంతర్జాతీయ విమానాల టిక్కెట్ల‌ను కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే పొందొచ్చు. మ‌రి విమానాల టిక్కెట్ల‌ను కొనేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. డిస్కౌంట్ల‌ను తెలుసుకోవ‌డం ఎలా? త‌క్కువ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను పొంద‌డం ఎలా?

ఈ జ ాగ్రత్తలు తీసుకుంటే...

డొమెస్టిక్ ఫ్ల‌యిట్స్ కంటే అంత‌ర్జాతీయ విమానాల టిక్కెట్ల ధ‌రలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే వాటి ధ‌ర‌ల‌ను త‌క్కువ‌గా ఎక్క‌డ దొరుకుతాయో చూడాలి. మీరు ఎక్క‌డికైనా వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటే పీక్ ట్రావెల్ సీజ‌న్లో వెళ్ల‌కూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఆగ‌స్టులో యూరోప్ ట్రిప్ వేశార‌నుకోండి మీకు ఖ‌ర్చు త‌డిసి మోపెడు అవుతుంది. మీకు రీజ‌న‌బుల్ రేట్ల‌లో ఫ్ల‌యిట్ దొర‌క‌డం చాలా క‌ష్టం. అంతేకాక మీకు త‌క్కువ ధ‌ర‌ల్లో ఫ్ల‌యిట్స్ కావాలంటే మీ జ‌ర్నీ తేదీల విష‌యాల్లో కాస్త  ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంతేకాక బిజీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల‌కు వెళ్ల‌కుండా వేరే మార్గాల‌ను అన్వేషించాలి.  అంతేకాక రెగ్యుల‌ర్‌గా ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ల‌కు ఎయిర్‌లైన్స్ ఏ కాలంలోనైనా కొన్ని ఆఫ‌ర్లు ఇస్తాయి వాటిని వాడుకోవాలి. ప్ర‌యారిటీ బోర్డింగ్‌, ఎక్కువ‌ బ్యాగేజ్ లిమిట్, టిక్కె ట్ అప్‌గ్రేడ్ లాంటి స‌దుపాయాలు ఉప‌యోగించుకోవాలి.

ఈ సైట్ల‌తో సుల‌భం..
గూగుల్ ఫ్ల‌యిట్స్‌
:  గూగుల్ అందిస్తున్న గూగుల్ ఫ్ల‌యిట్ ఆప్ష‌న్ విమాన టిక్కెట్ల కొనుగోలుకు సుల‌భంగా ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న విమాన ధ‌ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తుండ‌డం వ‌ల్ల త‌క్కువ ధ‌ర ఉన్న విమానాన్ని ఎంచుకోవ‌చ్చు. ఈ సైట్‌తో మీకు కావాల్సిన విమానాలను వెతుక్కోవ‌డం కూడా సుల‌భం. 

ఐటీఏ మ్యాట్రిక్స్‌: ఇది స‌ర్వీసు కూడా గూగుల్ అందిస్తోంది. మీకు ప్ర‌యాణంలో అద‌నంగా వ‌స‌తులు కావాలంటే ఇది సైట్ మీకు ప‌నికొస్తుంది.  ఎక్కువ సెర్చ్ ఆప్ష‌న్లు దీనిలో ఉంటాయి.  ఎయిర్‌పోర్ట్ మార్పులు త‌దిత‌ర వివ‌రాల‌న్ని క్షుణ్నంగా దీనిలో క‌న‌బ‌డ‌తాయి.దీన్ని బ‌ట్టి మీరు టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటే రేట్లు కూడా త‌గ్గుతాయి. 

స్కై స్కాన‌ర్‌: ఇది విమానాల టిక్కెట్ల‌ను కంపేర్ చేసే సైట్‌. ఏ విమానంలో ఫ‌లానా చోట‌కు ఎంత ధ‌ర ఉంది అనే విష‌యాన్ని స్ప‌ష్టంగా తెలియ‌జేస్తుంది ఈ సైట్‌. దీని వ‌ల్ల మ‌నం ఆ సైట్‌ను ఎంచుకుని టిక్కెట్ల‌ను కొనుక్కోవ‌చ్చు. అంతేకాదు ఎప్ప‌టిక‌ప్పుడు  ధ‌ర‌ల వివ‌రాల‌ను అందించ‌డం కూడా దీని ప్ర‌త్యేక‌త‌. 

మొమొండొ: త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే ఫ్ల‌యిట్ టిక్కెట్ల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి మొమెండొ కూడా మంచి ఆప్ష‌న్‌.  త‌క్కువ ధ‌ర‌ల్లో దొరికే ఫ్ల‌యిట్‌ను క‌నుగొని టిక్కెట్ల‌ను కొనడం వ‌ల్ల మ‌న‌కు డ‌బ్బులు ఆదా అవుతాయి. ప్రైస్‌లైన్‌, కివీ అనే సైట్లు కూడా ఇదే కోవ‌కు చెందిన‌వి. 

జన రంజకమైన వార్తలు