• తాజా వార్తలు

హార్డ్‌డిస్క్ స్పేస్ సేవింగ్‌కి వ‌న్‌స్టాప్ గైడ్

 సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ల్యాపీ ఇలా అన్నింటిలోనూ డేటా స్టోరేజ్ అన్న‌ది ఇప్పుడు అనివార్యం. చ‌దువుకునే పిల్ల‌ల నుంచి ల‌క్ష‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్ చేసే కంపెనీల వ‌ర‌కు ఎవ‌రి స్థాయిలో వారు డేటా మెయింటెయిన్ చేసుకోవాల్సిందే. అందుకే ఒక‌ప్పుడు ఎంబీల్లో ఉండే మెమ‌రీ కార్డులు జీబీల్లోకి, జీబీల్లో ఉండే హార్డ్ డ్రైవ్‌లు టీబీల్లోకి వ‌చ్చేశాయి. కానీ స్పేస్ ఉంది క‌దా అని అడ్డ‌మైవ‌న్నీ నింపేస్తే నిజంగా అవ‌స‌ర‌మైన‌వి స్టోర్ చేయ‌డానికి స్పేస్ మిగ‌ల‌దు.  మీ హార్డ్‌డిస్క్‌లో స్పేస్ సేవింగ్స్‌కు   టిప్స్ మీ కోసం.

1. విండోస్‌, మ్యాక్ ఓఎస్‌, లినక్స్ ఎలాంటి ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అయినా ర‌క‌రకాల ఫైల్స్‌, డ్రైవ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకుంటాయి. ఇలా చేసిన‌ప్పుడు ఇన్‌స్టాల‌ర్స్ మిగిలిపోతాయి. ఇవికాక డూప్లికేట్  ఫైల్స్ కూడా మీ స్పేస్‌ను మింగేస్తాయి. వాటిని క్లియ‌ర్ చేయండి. 

2.  పీసీ, ల్యాపీలో ఏదైనా ప‌ని అయిపోగానే అవ‌స‌రం లేదంటే డిలెట్ కొడ‌తాం. అది రీసైకిల్ బిన్‌లో ప‌డుతుంది. అక్క‌డున్నా మీ సిస్టం స్పేస్‌నే వాడుకుంటుంది. అందుకే రీసైకిల్ బిన్‌ను క్లియ‌ర్ చేయండి.  

3. డేటా చౌక‌యిపోయింది. ఐదారువంద‌లు  పెట్టి ఓ నెల‌కు నెట్ క‌నెక్ష‌న్ తీసుకుంటే 50 నుంచి 100 జీబీ డేటా ఇస్తున్నారు. కాబ‌ట్టి మ్యూజిక్‌, వీడియోలు వంటివి డౌన్‌లోడ్ చేసి సిస్టం స్టోరేజిని త‌గ్గించుకోకండి. కావాల‌నుకున్న‌ప్పుడు నెట్ నుంచి డైరెక్ట్‌గా స్ట్రీమ్ చేసి చూసుకోండి. డౌన్‌లోడ్ తో వ‌చ్చే వైర‌స్‌ల‌ను కూడా దీనివ‌ల్ల కంట్రోల్ చేసుకోవ‌చ్చు.

4. మీరు డేటా స్టోర్ చేసుకోవాల్సిన జాబ్ లో ఉన్నారనుకోండి.  అప్పుడు డేటా స్టోర్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి.  కాబ‌ట్టి మీకు కావ‌ల్సిన డేటాను ఎక్స‌టర్న‌ల్ డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోండి.  బ్యాక‌ప్‌కు నెల‌, 15 రోజులో ఒక టైం లిమిట్ పెట్టుకుని రెగ్యుల‌ర్‌గా ఈ ప‌ని చేస్తే మీకు  హార్డ్‌డిస్క్‌లో స్పేస్ మిగులుతుంది. 

 5. క్లౌడ్ సోర్సెస్ మ‌రో మంచి సేవింగ్ ఆప్ష‌న్‌. ఎక్స్‌ట‌ర్న‌ల్ డ్రైవ్ కొనే ప‌నిలేదు.  ఐ క్లౌడ్‌, గూగుల్ డ్రైవ్ ఫ్రీగా 15 జీబీ వ‌ర‌కు స్పేస్ ఇస్తుంది. వ‌న్‌డ్రైవ్‌లో ఇదింకా చాలా ఎక్కువ‌.  రెండు మూడు అకౌంట్లు ఓపెన్ చేసి కూడా సేవ్ చేసుకోవ‌చ్చు. ఎక్క‌డున్నా సరే నెట్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు ఫైల్స్ యాక్సెస్ చేసుకోగ‌ల‌గడం దీనిలో ఉన్న స్పెష‌ల్‌. 

6. డిస్క్ క్లీన్ అప్ అనే ఓ సౌక‌ర్యం కూడా ఉంది. అయితే ఇది విండోస్ ఓఎస్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్రౌజ‌ర్ క్యాచీ, సిస్టం లాగ్స్‌, గ‌తంలో విండోస ఇన్‌స్టాలేష‌న్ల ద్వారా వ‌చ్చిన స్పామ్‌ను క్లియ‌ర్ చేయ‌డానికి ఈ ఆప్ష‌న్  ఉప‌యోగ‌ప‌డుతుంది

7. విండోస్ 10లో  Storage Sense అనే కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. దీని ద్వారా విండోస్ యూజ‌ర్ల‌కు స్పేస్‌ను మేనేజ్ చేయొచ్చు. సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేసి స్టోరేజి సెక్ష‌న్‌లోకి వెళ్లి  Storage Sense  ఫీచ‌ర్‌ను అనేబుల్ చేయ‌లి. ఒక్క‌సారి ఇలా చేస్తే  విండోస్ ఆటోమేటిగ్గా 30 రోజుల కంటే ఎక్కువ ఉన్న టెంప‌ర‌రీ ఫైల్స్‌ను, రీసైకిల్ బిన్‌లో ఉన్న ఫైల్స్‌ను డీలెట్ చేస్తుంది.

8. మీ డివైస్‌లో మ్యాగ్జిమం స్పేస్‌ను సేవ్ చేసుకోవాలంటే థ‌ర్డ్ పార్టీ యాప్స్‌ను తీసుకోవ‌లి.  Clean My MacI,  Clean My PC / Clean My Mac అని ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేస్తే ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వీటిని ఉప‌యోగించి స్పేస్‌ను క్లియ‌ర్ చేసి ఆదా చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు