భారత్‌లో ఎక్కువమంది వాడే బ్రాడ్ బ్యాండ్‌లో బీఎస్ఎన్ఎల్ ముందంజలో ఉంటుంది. ఎందుకుంటే ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్లినా సిగ్నల్స్ రావడమే దీనికి కారణం. దీని రీచ్ కారణంగానే మన దేశంలో ఎక్కువమంది ఈ నెట్వర్క్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా పేరు పొందిన నెట్‌వర్క్‌లు ఉన్నా ఎక్కువ కాలం నుంచి బీఎస్ఎన్ఎల్ మనుగడ సాగిస్తుందంటే కారణం దీని మీద జనాలకు ఉన్న నమ్మకం వల్లే. అయితే బీఎస్ఎన్ఎల్తో ఒక ఇబ్బంది ఉంది. మిగిలిన నెట్‌వర్క్‌లతో పోలిస్తే దీని వేగం తక్కువే. చాలామంది దీన్ని ఉపయోగించకపోవడానికి రీజన్లలో ఇదొకటి.
4 ఎంబీపీఎస్ తీసుకున్నా..
4 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ప్లాన్ తీసుకున్నా మనం ఎక్కువ స్పీడ్‌తో నెట్ పొందుతామనే రూల్ లేదు. ఎందుకంటే దీని కనెక్టివిటీ.. దీని విస్తరణ కారణాలతో బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ పరిమితంగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఎక్కువగా కొన్ని ఏరియాల్లో తక్కువగా ఉంటుంది. మనం ఒక ప్లాన్ తీసుకుని దాన్ని వాడుకుంటుంటే కొన్ని రోజులకే స్పీడ్ తగ్గిపోతుంది. ఎఫ్‌యూపీ లిమిట్ క్రాస్ చేశారనే సందేశాలు వచ్చేస్తాయి. ఇలాంటి స్థితి ఎవరికైనా ఇబ్బందికరం. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ను పెంచాలంటే ఏం చేయాలి?
స్పీడ్ ఎలా పెంచాలంటే...
బ్రౌజింగ్ క్యాచెను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. గూగుల్ క్రోమ్‌లో అయితే.. కంట్రోల్, డిలీట్, హెచ్ అనే బటన్స్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌ను మీ అడ్రస్ బార్లో పేస్ట్ చేయాలి. అప్పుడు క్లియర్ బ్రౌజింగ్ డేటా పేరుతో మీకో మెసేజ్ వస్తుంది. ఆ పొపప్ మెనూలో మిగిలిన ఆప్షన్లను అన్ చెక్ చేసి క్యాచ్డ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్, కూకీస్ అండ్ అదర్ సైట్ డేటా ఆప్షన్ల మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్లియర్ బ్రౌజింగ్ డేటా మీద క్లిక్ చేయాలి. ఫైర్ పాక్స్‌లో అయితే హిస్టరీలోకి వెళ్లి క్లియర్ రీసెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. లేకపోతే కంట్రోల్, షిప్ట్, డిలీట్ కలిపి ప్రెస్ చేస్తే చాలు.
గూగుల్ డీఎన్ఎస్ సెట్టింగ్స్ యూజ్ చేయాలి
కొన్ని సెట్టింగ్స్‌లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ కంప్యూటర్ స్లో అయిపోయే అవకాశం ఉంది. అందుకోసం కంట్రోల్ ప్యానల్‌కు వెళ్లి నెట్ వర్క్స్ అండ్ ఇంటర్నెట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్.. ఆపై ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి. ఇంటర్నెట్ ప్రొటొకాల్ వెర్షన్ మీద క్లిక్ చేసి డీఎన్ఎస్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. డీఎన్ఎస్ సర్వసర్ 8.8.8.8, ఆల్ట్రనెట్ డీఎన్ఎస్ సర్వర్ 8.8.4.4 క్లిక్ చేసి ఆ తర్వాత ఓకే చేయాలి.