సాధారణంగా యాప్‌లను ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం?.. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన యాప్‌ను వెతికి దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. కానీ అన్ని యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండవు. మరి ఇలాంటి యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా? అసలు గూగుల్ ప్లే స్టోర్‌లో లేని యాప్‌లను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చా? మరి అదెలాగో చూద్దాం.
సైడ్‌లోడింగ్
సాధారణంగా యాప్‌లను డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ సేఫేస్ట్ ప్లేస్ అని అంతా భావిస్తారు. అంతేకాదు వేగంగా, సులభంగా యాప్‌లను డౌన్లోడ్ చేయడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్‌ను మించిన ఫ్లాట్‌ఫాం మరొకటి ఉండదు.అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో అయితే నాసిరకం లేదా డూప్లికేట్ యాప్‌లకు అంతగా చోటుండడదని అదే బయట సైట్లు అయితే కచ్చితంగా బుట్టలో పడతామనేది కస్టమర్ల ఆలోచన. అయితే గూగుల్ ప్లేస్టోర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక ఆప్షన్ ఉంది అదే సైడ్ లోడింగ్. భిన్నమైన సోర్సుల నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టే దీనికి సైడ్ లోడింగ్ అనే పేరొచ్చింది.
ఏం చేయాలంటే...
సైడ్ లోడింగ్ ద్వారా యాప్‌లను డౌన్లోడ్ చేయడం చాలా సులభం. అన్నిటికన్నా మించి గూగుల్ ప్లే స్టోర్‌లో లేని యాప్‌లను దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోగలగడం... ఇది సేఫ్ వే కావడంతో ఎక్కువమంది ఇప్పుడు సైడ్‌లోడింగ్ వైపు చూస్తున్నారు. మరి సైడ్ లోడింగ్ ద్వారా ఎలా యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
1. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అండ్ లాక్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేయాలి
2. లేకపోతే జస్ట్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసినా సరిపోతుంది.
3. ఆ తర్వాత అలవ్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి.
4. ఆ తర్వాత మీరు మీకు అవసరమైన ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇలా ఇన్స్టాల్ చేసుకునే సమయంలో ఒక పాపవ్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తే చాలు యాప్ ఇన్స్టాల్ అవుతుంది.