• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉప‌యోగించి మీ కంప్యూట‌ర్ నుంచి కాల్స్‌, మెసెజ్‌లు పంప‌డం ఎలా?

ఆండ్రాయిడ్ మ‌న చేతిలో ఉంటే కంప్యూట‌ర్ చేతిలో జేబులో ఉన్న‌ట్లే.  ఆండ్రాయిడ్ ఫోన్ ఉప‌యోగించి ఎన్నో ప‌నులు చేసుకోవ‌చ్చు. కంప్యూట‌ర్ లేక‌పోయినా.. దాదాపు కంప్యూట‌ర్ చేసే ప‌నుల‌న్నీ ఈ ఒక్క ఫోన్‌తో చేసేయ‌చ్చు. మ‌రి ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉప‌యోగించి కంప్యూట‌ర్‌ను న‌డిపించొచ్చు అనే విష‌యం మీకు తెలుసా? అంటే ఏం  లేదండి..మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా  మీ కంప్యూర్ నుంచి మెసేజ్‌లు పంప‌డం, రిసీవ్ చేసుకోవ‌డ‌మే కాదు.. కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు.  మ‌రి అదెలాగో చూద్దామా!
 

ఎయిర్ డ్రాయిడ్ ద్వారా..
ఇటీవ‌లే వ‌చ్చిన ఐఓఎస్ 8 డివైజ్‌లో ఎన్నో ఫీచ‌ర్లు ఉన్నాయి. దీని ద్వారా మీరు ఫోన్ కాల్స్ చేసుకోవ‌డం, మెసేజ్‌లు పంపుకోవ‌డ‌మే కాదు. మీ  ఐపాడ్  లేదా మాక్ ఉప‌యోగించి కూడా ఆ ప‌నులు చేయచ్చు.  ఒకే వైఫై, యాపిల్ ఐడీ ద్వారా మీరు ఈ ప‌నులు చేసుకోవ‌చ్చు.  మీరు మాక్ మీద ప‌ని చేసేట‌ప్పుడు ఈ ఆప్ష‌న్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌దే  పదే ఫోన్‌ను  ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేకుండానే నేరుగా మాక్ నుంచే ఫోన్‌ను ఆప‌రేట్  చేసేయ‌చ్చు. అయితే ఇది యాపిల్ ఫోన్ వాడేవాళ్ల‌కు మాత్ర‌మే  ప‌రిమితం క‌దా అని చాలామంది బాధ‌ప‌డుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఐఫోన్ యూజ‌ర్లు కూడా అసూయ చెందేలా కొన్ని ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎయిర్‌డ్రాయిడ్ అనేది ఆ కోవ‌కు చెందిందే. ఈ కంటిన్యూటి ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్ యూజర్ల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

ఎలా ఉప‌యోగ‌పడుతుందంటే..
ఎయిర్ డ్రాయిడ్ ఒక యూనిక్ ఫీచ‌ర్‌. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.  

ఆ త‌ర్వాత ఆ  యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఓపెన్ చేసుకోవాలి.

ఈ యాప్ మీకో అకౌంట్ క్రియేట్ చేయ‌మ‌ని అడుగుతుంది.  ఒకవేళ అవ‌స‌రం లేద‌నుకుంటే  సైన్ ఇన్ లేట‌ర్ క్లిక్ చేయ‌చ్చు

ఇప్ప‌డు ఎయిర్‌డ్రాయిడ్ మిమ్మల్ని కొన్ని ప‌ర్మిష‌న్లు కోరుతుంది. నోటిఫికేష‌న్లు చూపించాలా అడుగుతుంది.  వాటిపై టాప్ చేసి అనేబుల్ చేయాలి.

క‌న్ఫ‌ర్మే ష‌న్  పోప‌ప్‌పై క్లిక్ చేసి ఓకే చేయాలి

ఆ  త‌ర్వాత  ఎయిర్‌డ్రాయిడ్ మీకో యూఆర్ఎల్ ఇస్తుంది.. వెబ్‌.ఎయిర్‌డ్రాయిడ్‌.కామ్ అని ఉంటుంది దాని అడ్రెస్‌. 

ఆ యూఆర్ఎల్‌ను  ఓపెన్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత క్యూఆర్ కోడ్ మీద  ట్యాప్ చేయాలి. అప్పుడు కెమెరా ఓపెన్ అవుతుంది.

క్యూఆర్ కోడ్‌ను కెమెరా వైపు పెట్టాలి. ఎయిర్ డ్రాయిడ్ యాప్ వైబ్రేట్ అవుతుంది. మీ కోడ్ స్కాన్ అవుతుంది. అంతే  మీ ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను మీ కంప్యూట‌ర్‌లో కూడా చూసుకోవ‌చ్చు. అంతేకాదు కంప్యూట‌ర్  నుంచే ఫోన్‌కు మెసేజ్‌లు పంపుకోవ‌చ్చు. రిసీవ్ చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైతే కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు