• తాజా వార్తలు

గూగుల్ డాక్స్‌తో ఇ-ప‌బ్‌ బుక్స్ త‌యారు చేయ‌డం ఎలా?

అడోబ్ పీడీఎఫ్.. మ‌న‌కు ఏ ఫైల్‌ను డాక్యుమెంట్‌లా చేయాల‌న్నా వెంట‌నే అడోబ్‌నే ఉయోగిస్తాం. ఫైల్ దాయ‌డం.. అనే మాట వ‌స్తే వెంట‌నే అడోబ్ పీడీఎఫ్ గుర్తుకొస్తుంది. అయితే ఇంట‌ర్నెట్‌లో మ‌న‌కు కేవలం అడోబ్ పీడీఎఫ్ మాత్ర‌మే కాదు చాలా సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఇ-బుక్ అందులో ఒక‌టి. ఒక ఫైల్‌ను పీడీఎఫ్‌గా చేసిన త‌ర్వాత మ‌నం ఎలాంటి మార్పులు చేయ‌లేం. కానీ ఈ బుక్స్ ద్వారా ఇది సాధ్యం.  అయితే ఇ-బుక్స్‌ను త‌యారు చేసుకోవ‌డం ఎలా? ఇ-బుక్స్‌ను సేవ్ చేసుకోవ‌డం ఎలాగో చూద్దాం..

ఇ-ప‌బ్ డాక్యుమెంట్స్ 
సాధార‌ణంగా అడోబ్ పీడీఎఫ్‌ల‌లో మ‌నం మార్పు చేర్పులు చేయ‌లేం. కానీ ఇ-ప‌బ్ డాక్యుమెంట్లు మాత్రం అడోబ్‌కు భిన్నం. వీటిలో మార్పులు చేసుకోవ‌చ్చు. సైజులు మార్చొచ్చు. క‌ల‌ర్స్ ఛేంజ్ చేసుకోవ‌చ్చు.  అంతేకాదు ఇ-ప‌బ్ బుక్‌ను మీరు డెస్క్‌టాప్ మీదో లేక గూగుల్ ప్లే బుక్ యాప్ ద్వారానో చ‌దువుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా దీన్ని మ‌నం ఉప‌యోగించుకోవ‌చ్చు. హెచ్‌టీఎంఎల్ 5 డాక్యుమెంట్ల ద్వారా త‌యారు చేయ‌డం వ‌ల్ల టెక్ట్ సైజు, ఫాంట్ సైజుల‌ను త‌మ స్క్రీన్‌ల‌కు త‌గ్గ‌ట్టు మార్పు చేర్పులు చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల రీడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ కూడా పెరుగుతుంది.

ఎలా త‌యారు చేయాలంటే..
ఇ-ప‌బ్ బుక్స్ త‌యారు చేయ‌డానికి అడోబ్ స్టాంజా, కాలిబ‌ర్ సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటితో పాటు గూగుల్ డాక్స్ ఉప‌యోగించి కూడా సుల‌భంగా ఇ-ప‌బ్ బుక్స్ రూపొందించొచ్చు. గూగుల్ డాక్యుమెంట్‌లో ఒక డాక్యుమెంట్ రాయాలి. లేక‌పోతే అంతకుముందున్న మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్ డాక్యుమెంట్ ఫైల్‌ను మీ గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫైల్ మెనూలోకి వెళ్లి డౌన్‌లోడ్ యాజ్ ఇ-ప‌బ్ ప‌బ్లికేష‌న్‌ను క్లిక్ చేయాలి. అంతే.. మీ ఇ-ప‌బ్ వెర్ష‌న్ ఆర్టిక‌ల్ జ‌న‌రేట్ అయిపోతుంది. ఇ-ప‌బ్ ఫైల్‌ను మీ మొబైల్ ఫోన్‌లోకి కాపీ చేసుకోవ‌చ్చు. లేక‌పోతే గూగుల్ బుక్స్‌లోకి అప్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు. ఇ-బుక్స్‌ను ఐపాడ్‌, నూక్‌, గూగుల్ ప్లే బుక్స్, అమెజాన్ కిండ‌ల్‌ల‌లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు