• తాజా వార్తలు
  •  

క్లౌడ్‌లో ఉన్న డేటాను రిక‌వ‌ర్‌, రీస్టోర్ చేయడానికి వన్ & ఓన్లీ గైడ్

ఎలక్ట్రానిక్ డేటాను స్టోర్ చేయ‌డంలో క్లౌడ్ స‌ర్వీసులు విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తెచ్చాయి. వ‌ర్చువ‌ల్ స్పేస్, ఎక్క‌డి నుంచైనా యాక్సెస్ చేసుకోగ‌లిగే వెసులుబాటు ఉండ‌డంతో ఈ స‌ర్వీసుల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మీ డివైస్ ఫోన్ లేదా కంప్యూట‌ర్‌ల‌కు వ‌న్‌డ్రైవ్, గూగుల్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స‌ర్వీసుల‌కు సింక్ అయి ఉండ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు డేటా వాటిలో సేవ్ అవుతోంది. డివైస్ పోయినా మీ డేటా సెక్యూర్డ్‌గా ఉండ‌డానికి ఈ స‌ర్వీసులు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.
క్లౌడ్ స‌ర్వీసుల్లో డేటా బ్యాక‌ప్, రీస్టోరేషన్ ప్రక్రియ రివకరీ పాయింట్ ఆబ్జెక్టివ్, రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ ద్వారా నిర్ణయించబడుతుంది. రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ అంటే మీరు డేటాను ఎంత టైమ్‌లో లాస్ అవుతారో చెప్పేది. అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్ట్ 24 గంటలు అని ఉంటే ఆ తర్వాత డేటా పోతుంది. కాబట్టి మీరు ప్రతి రోజూ బ్యాకప్ తీసుకోవాలి. ఇక రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ అంటే మీ సిస్టం పూర్తి స్థాయిలో తిరిగి పనిచేయడానికి పట్టే సమయం. అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చి మీ సర్వీస్ పాడైతే తిరిగి సర్వీస్ పూర్తి స్థాయిలో పని చేయడానికి పట్టే సమయం అన్నమాట.  రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ 24 గంటలు అయితే మీ సర్వీసులు డిజాస్టర్ అయిన ఒక రోజు తర్వాత తిరిగి పునరుద్ధరించబడతాయి.
మీ బ్యాకప్ క్లౌడ్లో ఉంటే
క్లౌడ్ సర్వీస్‌లు  బ్యాక్అప్ అందిస్తాయి. అందువ‌ల్ల డివైస్‌తో సింక్ అయి ఎప్ప‌టిక‌ప్పుడు మీ డేటాను క్లౌడ్‌లో అప్‌డేట్ చేస్తుంటాయి. కాబ‌ట్టి డివైస్ పోయినా డేటా క్లౌడ్‌లో భద్రంగా ఉంటుంది.అయితే ఒక్కోసారి వెబ్ స‌ర్వీసులు కూడా ఫెయిల‌వుతాయి. అలాంట‌ప్పుడు క్లౌడ్ నుంచి బ్యాక‌ప్ తీసుకోవ‌చ్చు. ఎంత సేప‌టిలో రిక‌వ‌ర్ చేయ‌గ‌ల‌ద‌నేది రిక‌వ‌రీ టైం ఆబ్జెక్టివ్‌ను బ‌ట్టి ఉంటుంది. డేటా సైజ్‌, ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను బ‌ట్టి కూడా రిక‌వ‌రీ టైం ఆధార‌ప‌డుతుంది.అయితే వ్య‌క్తుల‌కు ఫైల్స్, డేటా పెద్ద‌గా ఉండ‌వు కాబ్ట‌టి రిక‌వ‌రీ సింపుల్‌గా అయిపోతుంది. క్లౌడ్ స్టోరేజ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఏ వెర్ష‌న్ ఫైల్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని మీ సిస్టంలోకి డౌన్‌లోకి చేసుకోవ‌డ‌మే.  క్లౌడ్ బ్యాక‌ప్ లేదా సాఫ్ట్‌వేర్ సింక్ చేసుకుంటే  సింక్ అయిన ఫైల్స్‌ను ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ అయిపోతాయి.
బ్యాక‌ప్.. బ్యాక‌ప్ మీడియాలో ఉంటే..
ప్రైమ‌రీ సిస్టమ్‌కు డేటాను రీస్టోర్ చేయ‌డానికి  వేగవంతమైన పద్ధతి అంటే ఆన్‌సైట్ బ్యాకప్ మీడియాను ఉపయోగించడమే. ఇలాంట‌ప్పుడు డేటా రిక‌వ‌రీకి బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌తో పని లేదు.  రిక‌వ‌రీ టైమ్ ఆబ్జెక్టివ్‌ను బ‌ట్టి కొన్ని నిముషాల నుంచి గంట‌ల్లోగా మీ డేటా రిక‌వ‌ర్ అయిపోతుంది.
బ్యాక‌ప్ లేక‌పోతే
డేటాను మీరు బ్యాక‌ప్ తీసుకోక‌పోతే రిక‌వ‌రీ క‌ష్ట‌మ‌వుతుంది. మీ సిస్టంలో ఉన్న‌రికవ‌రీ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి డేటాను తిరిగి పొందాల్సి ఉంటుంది. లాజిక‌ల్ ఫెయిల్యూర్ వ‌ల్ల డేటా పోతే సాఫ్ట్‌వేర్ దాన్నిరిక‌వ‌ర్ చేయ‌గ‌లుగుతుంది. అదే ఫిజిక‌ల్ ఫెయిల్యూర్ వ‌ల్ల డేటా పోతే మీరు డేటా రిక‌వ‌రీకి ఎక్స్‌ప‌ర్ట్‌ల‌ను సంప్ర‌దించాలి.

 

జన రంజకమైన వార్తలు