• తాజా వార్తలు
  •  

మొబైల్ టు మొబైల్ బాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌ (అన్ని నెట్ వర్క్స్ లో) చేయడానికి గైడ్

మీ మొబైల్‌లో ఉన్న ఒక సిమ్‌లో బాలెన్స్ ఉంది.. కానీ మీరు వేరే సిమ్ ద్వారా కాల్ చేయాల్సి వ‌చ్చింది. కానీ దానిలో బాలెన్స్ లేదు. అప్పుడేం చేస్తారు.. ఏముంది రీఛార్జ్ చేసుకోవ‌డ‌మే అంటారా! కానీ ఇలా రీఛార్జ్ చేసుకోకుండానే ఒక నెట్‌వ‌ర్క్‌లో ఉన్న బాలెన్స్‌ను వేరే నెట్‌వ‌ర్క్‌కు కూడా ట్రాన్స‌ఫ‌ర్ చేసుకుని వాడుకోవ‌చ్చు. మ‌రి ట్రాన్స‌ఫ‌ర్ చేయడం ఎలాగో చూద్దామా...

ఎయిర్‌టెల్ నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్స్‌కు...

ముందుగా మీ మెబైల్ నుంచి *141#  డ‌య‌ల్ చేయాలి

మీకో పోప‌వ్ స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. అప్పుడు 1 నంబ‌ర్ ప్రెస్ చేసి సెంఢ్ చేయాలి

అప్పుడు మీరు బాలెన్స్ పంపాల‌నుకుంటున్న మొబైల్ నంబ‌ర్‌ను టైప్ చేయాలి

ఎంత బాలెన్స్ పంపాల‌నుకుంటున్నారో కూడా ఎంట‌ర్ చేసి ట్రాన్స‌ఫ‌ర్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

అంతే..అప్ప‌టిక‌ప్పుడే మీ సిమ్‌లోని అమౌంట్ వేరే నంబ‌ర్‌కు ట్రాన్స‌ఫ‌ర్ అయిపోతుంది.

ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అయితే రూ.5 నుంచి రూ.30 వ‌ర‌కు మాత్ర‌మే ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోగ‌లం

ఎయిర్‌సెల్‌లో అయితే ఇలా..
మీ మొబైల్‌ నంబ‌ర్ నుంచి *122*666# అనే నంబ‌ర్‌ను డ‌య‌ల్ చేయాలి

వాయిస్ స్టెప్స్ ద్వారా అది మిమ్మ‌ల్నిన‌డిపిస్తుంది. స్టెప్స్ జాగ్ర‌త్త‌గా ఫాలో కావాలి

మీరు అమౌంట్ పంపాల‌నుకున్న నంబ‌ర్‌తో పాటు అమౌంట్‌ను ఎంట‌ర్ చేయాలి

రూ.5నుంచి మీరు ఎయిర్‌సెల్ ద్వారా  మొబైల్ బాలెన్స్‌ను ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. 

బీఎస్ఎన్ఎల్‌లో అయితే ఇలా..
మీ మొబైల్లో జీఐఎఫ్‌టీ (బిగ్ లెట‌ర్స్‌) అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు బాలెన్స్ పంపాల‌నుకుంటున్న మొబైల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి 53733 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి

మొద‌ట ఎస్ఎంఎస్ ఓపెన్ చేయాలి

గిఫ్ట్ 98595599589 అనే నంబ‌ర్ టైప్ చేశాం ఆ త‌ర్వాత రూ.50 టైప్ చేశాం

ఆ త‌ర్వాత 53733 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు.. మీ బాలెన్స్ ట్రాన్స‌ఫ‌ర్ అయిపోతుంది.

డొకొమోలో అయితే  బీటీ (బిగ్ లెట‌ర్స్‌) టైప్ చేసి మొబైల్ నంబ‌ర్‌ను టైప్ చేసి అమౌంట్‌ను ఎంట‌ర్ చేసి 54 321 నంబ‌ర్‌కు సెండ్ చేయాలి.

ఐడియాలో అయితే ఇలా..
ఐడియాలో అయితే మీ మొబైల్‌లో *191# అని డ‌య‌ల్ చేయాలి

నంబ‌ర్ 2 ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి

మీరు బాలెన్స్ పంపాల‌నుకుంటున్న మొబైల్ నంబ‌ర్‌... ఆ త‌ర్వాత అమౌంట్ ఎంట‌ర్ చేసి సెండ్ కొడితే చాలు.

రిల‌య‌న్స్‌లో అయితే..

మీ మొబైల్ నంబ‌ర్‌లో *312*3# డ‌య‌ల్ చేయాలి

మీ స్నేహితుల‌ని నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.

మీకు న‌చ్చిన అమౌంట్‌ను కూడా ఎంట‌ర్ చేయాలి

సెండ్ కొడితే స‌రిపోతుంది.. బాలెన్స్ ట్రాన్స‌ప‌ర్ అయిపోయిన‌ట్లే..