• తాజా వార్తలు
  •  

గైడ్‌: వాట్స‌ప్ వెబ్ తెలియని వారికి ,ఉప‌యోగించ‌డానికి కంప్లీట్ గైడ్‌

స్మార్ట్‌ఫోన్లో వాట్స‌ప్‌ను ఉప‌యోగించ‌డం మామూలే. మ‌రి వాట్స‌ప్ కేవ‌లం ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మాత్ర‌మే ప‌రిమితమా! స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వాళ్లే ఈ వాట్స‌ప్‌ను వాడాలా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు మ‌న‌ల్ని వెంటాడుతూ  ఉంటాయి.  అయితే వాట్స‌ప్‌ను కేవ‌లం స్మార్ట్‌ఫోన్ల‌లో మాత్ర‌మే కాదు  ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల‌లో కూడా చ‌క్క‌గా వాడుకోవ‌చ్చు. దీన్నే వాట్స‌ప్ వెబ్ అంటారు. దీనికి మ‌న వాట్స‌ప్ నుంచే  ఆప‌రేష‌న్ ఉంది. మ‌రి మ‌న స్మార్ట్‌ఫోన్ ద్వారా కంప్యూట‌ర్‌లో వాట్స‌ప్ వెబ్‌ను ఎలా  ఉప‌యోగించాలో చూద్దామా..

ఏంటీ వాట్స‌ప్ వెబ్‌?
వాట్స‌ప్‌ను కంప్యూట‌ర్ల‌నూ పాపుల‌ర్ చేయ‌డానికి తీసుకొచ్చిన ప్ర‌త్యేక‌మైన సాఫ్ట్‌వేరే వాట్స‌ప్ వెబ్‌. అంటే దీని ప్ర‌త్యేకత ఏంటంటే స్మార్ట్‌ఫోన్ ద్వారా కాకుండా డెస్క్‌టాప్ ద్వారా మ‌న స్నేహితుల‌తో చాటింగ్ చేయ‌చ్చు. అయితే వాట్స‌ప్ మొబైల్ అప్లికేష‌న్‌కు ఇదేమి ప్ర‌త్యామ్నాయ‌మేమీ కాదు.  అయితే కంప్యూట‌ర్ ద్వారా మ‌నం వాట్స‌ప్ ఎక్స్‌పీరియ‌న్స్ పొంద‌డం కోసం చాట్ మిస్ కాకుండా ఉండ‌డం కోసమే వాట్స‌ప్ వెబ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని ప్ర‌త్యేకించి అప్‌డేట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు . లేటెస్ట్ యాప్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది.

ఎలా ఉప‌యోగించాలి?
వాట్స‌ప్ వెబ్ అనేది ఒక ఆన్‌లైన్ అప్లికేష‌న్‌. అడ్రెస్ బార్‌లో వెబ్‌.వాట్స‌ప్‌.కామ్ అనే అడ్రెస్ కొడితే చాలు ఈ  అప్లికేష‌న్ మీకు ఓపెన్ అవుతుంది. ఫోన్ లేకుండా ఈ అప్లికేష‌న్‌ను మీరు ఉప‌యోగించ‌లేరు. ఇది ఆన్‌లైన్ ఓన్లీ స‌ర్వీస్‌.  ఇంట‌ర్నెట్ యాక్సెస్ ఉన్న యాక్టివ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మాత్ర‌మే వాట్స‌ప్ వెబ్‌ను ఆప‌రేట్ చేసే  అవ‌కాశం ఉంటుంది.  దీంతో ఎండ్ టు ఎండ్  ఎన్‌క్రిప్ష‌న్ ఉంటుంది.

దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
మీరు నేరుగా పీసీలో వాట్స‌ప్ వెబ్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఇది ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ల‌భించే స‌ర్వీసు. ఒక లింక్ ద్వారా మాత్ర‌మే మీరు దీన్ని ఉప‌యోగించే అవ‌కాశం ఉంది. వాట్స‌ప్ వెబ్‌లోకి లాగిన్ కావ‌డం చాలా సుల‌భం. మీ వాట్స‌ప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. వాట్స‌ప్ వెబ్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత మీకో క్యూఆర్ కోడ్ క‌నిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంట‌నే మీ కంప్యూట‌ర్‌లో వాట్స‌ప్ చాటింగ్ కనిపిస్తుంది. దీంతో మ‌నం చాటింగ్ మాత్ర‌మే చేసుకోగ‌లం. కాల్‌, వీడియో కాల్ లాంటివి సాధ్యం కాదు.

విజ్ఞానం బార్ విశేషాలు