• తాజా వార్తలు

ఆండ్రాయిడ్‌ ఫోన్లో సేవ్ అయిన వైఫై పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నిపెట్ట‌దానికి గైడ్

ఇంట‌ర్నెట్ లేకుండా ఎవ‌రైనా ఉంటున్నారా ఇప్పుడు.  ఏ ప‌ని చేయాల‌న్నా ఇంట‌ర్నెట్ త‌ప్ప‌నిస‌రి. అందుకే ప్ర‌తి ఇంట్లో వైఫై త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. మొబైల్‌లో నెట్ ఉన్నా.. వైఫై రోటార్ అంద‌రి ఇళ్లలోనూ క‌నిపిస్తోంది. అయితే వైఫైని సుర‌క్షితంగా ఉంచుకోవ‌డం మ‌న చేతుల్లోనే ఉంటుంది. మ‌న వైఫైని అప‌రిచితులు దుర్వినియోగం చేసే అవ‌కాశం ఉంటుంది. అందుకే మ‌నం పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకుంటాం. కానీ ఒక్కోసారి ఆ పాస్‌వ‌ర్డ్‌లు మ‌రిచిపోతుంటాం. మ‌రి వైఫైకు సంబంధించి ఏమైనా ఆప‌రేష‌న్స్ చేయాలంటే క‌చ్చితంగా పాస్‌వ‌ర్డ్ కావాలి? ఇలాంటి స్థితిలో ఏం చేయాలి?

మ‌రిచిపోయిన వైపై పాస్‌వ‌ర్డ్‌ల‌ను మ‌న ఆండ్రాయిడ్ డివైజ్ ద్వారా తిరిగి సంపాదించొచ్చు. కానీ మీరు వైఫై మీ మొబైల్ ద్వారా వాడి ఉండాలి. అంత‌క‌ముందు వైపైతో ఈ డివైజ్ క‌నెక్ట్ అయి ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో దాగి ఉన్న పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నిపెట్ట‌డానికి మీకు కొన్ని మార్గాలు ఉన్నాయి.  తొలి రెండు మార్గాల‌కు మీకు రూట్ అవ‌స‌రం. మూడో దానికి అస‌వ‌రం లేదు.

1. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో థ‌ర్డ్ పార్టీ ఫైల్ మేనేజ‌ర్ ఉప‌యోగించి సేవ్ చేసిన పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నిపెట్టొచ్చు

2. వైఫై కీ రిక‌వ‌రీ అప్లికేష‌న్ ద్వారా కూడా పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నిపెట్టొచ్చు

ఫైల్ మేనేజ‌ర్ ద్వారా..
ముందుగా మ‌నం థ‌ర్డ్‌పార్టీ ఫైల్ మేనేజర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  దానికి ఎక్స్‌ప్లోర‌ర్ ఆప్ష‌న్ ఉండాలి. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ దీనికి సుట‌బుల్‌.  దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రూట్ ఎక్స్‌ప్లోర‌ర్ ఎక్సెస్ కోసం క‌స్ట‌మ్‌ రోమ్ నుంచి ప‌ర్మిష‌న్ తీసుకోవాలి.  ఆ త‌ర్వాత డివైజ్ ఆప్ష‌న్‌, ఆ త‌ర్వాత డేటా... ఆ త‌ర్వాత మైజ్ ఆప్ష‌న్లు క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత వైఫై ఫోల్డ‌ర్‌ను ఓపెన్ చేయాలి. దీనిలోనే మీకు డ‌బ్ల్యూ_స‌ప్లికెంట్‌.సీవోఎన్ఎఫ్ అనే ఎక్స్‌టెన్స‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈఎస్ నోట్ ఎడిట‌ర్ ఓపెన్ చేయాలి. దీనిలోనే మీకు వైఫై నెట్ వ‌ర్క్ పేరు, పాస్‌వ‌ర్డ్‌లు, కోడ్‌లు క‌నిపిస్తాయి. 

వైఫై రిక‌వ‌రీ కీ ద్వారా...
వైఫై పాస్‌వ‌ర్డ్‌లు క‌నిపెట్ట‌డానికి మ‌రో మార్గం వైఫై కీ రిక‌వ‌రీ.  దీని కోసం మీరు వై రిక‌వ‌రీ థ‌ర్డ్‌పార్టీ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌ను  డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీకు సుల‌భంగా ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. దీనికి కూడా ప‌ర్మిష‌న్లు అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అన్ని ప‌ర్మిష‌న్లు గ్రాంట్ చేయాలి. అప్పుడు మీ డివైజ్ మొత్తాన్నిఇది స్కాన్ చేసి వైఫై పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నిపెడుతుంది. 

జన రంజకమైన వార్తలు