• తాజా వార్తలు

అమెజాన్‌లో ఫ్రీగా దొరికేవి ఉన్నాయి తెలుసా? వాటికే ఈ గైడ్ 

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈకామ‌ర్స్ సంస్థ అమెజాన్. అమెజాన్‌లో కొన్న వ‌స్తువు ఏదైనా ఒరిజినల్‌గా ఉంటుంది అని యూజ‌ర్ల‌లో న‌మ్మ‌కం ఉంది. అందుకే ఇండియాలో కూడా ఇంత స‌క్సెస్ అయింది. అమెజాన్‌లో కూడా ఫ్రీగా దొరికే వ‌స్తువులున్నా ఉన్నాయి. అవి షూసో, కంప్యూట‌ర్ గ్యాడ్జెట్సో కాక‌పోవ‌చ్చు. ఈ బుక్స్‌, ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌, డిజిట‌ల్ ఆల్బ‌మ్ ఇలాంటివి ఏవైనా కావ‌చ్చు.అలా అమెజాన్‌లో ఫ్రీగా దొరికే వాటి గురించి తెలుసుకోండి మ‌రి..
ఫ్రీ కిండిల్ బుక్స్ 
మీరు బుక్ ల‌వ‌ర్స్ అయితే ఇది మీకోస‌మే. అమెజాన్‌లో చాలా ర‌కాల కిండిల్ ఈ బుక్స్ ఫ్రీగా చ‌దువుకోవ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా కొత్త బుక్స్‌ను అమెజాన్ యాడ్ చేస్తుంటుంది. కాబట్టి అప్పుడ‌ప్పుడూ ఓ లుక్కేయండి. కొన్ని బుక్స్‌కి ఫ్రీ ఆఫ‌ర్ కొన్నాళ్ల‌పాటే ఉంటుంది.  ఫ్రీగా ఉన్న‌ప్పుడే చ‌దివేయండి.
ఫ్రీ డిజిట‌ల్ ఆల్బ‌మ్స్        
మీకు మ్యూజిక్ అంటే ఇష్ట‌మా? అయితే మీ కోసం మ్యూజిక్ (డిజిట‌ల్ ) ఆల్బ‌మ్స్ అమెజాన్‌లో ఫ్రీగా దొరుకుతాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ పాప్ ఆల్బ‌మ్స్‌లో బెస్ట్ కూడా ఈ ఫ్రీ డిజిట‌ల్ ఆల్బమ్స్‌లో అమెజాన్ పెడుతుంది. అమెజాన్ ఫ్రీ మ్యూజిక్ కింద ఏం ఇస్తుందో తెలుసుకోవాలంటే మ్యూజిక్ సెక్ష‌న్‌ ప్రైస్ లిస్ట్‌లో low to high సెలెక్ట్ చేస్తే క‌నిపిస్తాయి.
అమెజాన్ డ్రైవ్ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ 
ఇంపార్టెంట్ ఫైల్స్ బ్యాక‌ప్ తీసుకోవ‌డానికి వ‌న్‌డ్రైవ్‌, గూగుల్ డ్రైవ్ వాడుకున్న‌ట్లే అమెజాన్ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా వాడుకోవ‌చ్చు.  5జీబీ వ‌ర‌కు ఫ్రీ స్టోరేజి ఇస్తుంది. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయితే , ఇమేజ్‌లు  స్టోర్ చేసుకోవ‌డానికి దీనితోపాటు అన్‌లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ కూడా ఇస్తుంది.
ఫ్రీ డిజిట‌ల్ ఎంపీ 3 సింగిల్స్‌
అమెజాన్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఎంపీ 3 సాంగ్స్‌తో పెద్ద లైబ్ర‌రీయే ఉంది. ఇల్లీగ‌ల్ రూట్స్‌లో సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకునే బ‌దులు ద‌ర్జాగా దీని నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయోచ్చు.  
ఫ్రీ యాప్స్‌
అమెజాన్ ఫ్రీ యాప్స్ కూడా ఇస్తుంది. వంద‌ల కొద్దీ ఫ్రీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.అమెజాన్ సైట్‌లోకి వెళ్లి సెర్చ్‌లో “apps”  అని టైప్ చేసి ప్రైస్  లో టు హై అని పెడితే ఫ్రీ యాప్స్ లిస్ట్ క‌నిపిస్తుంది.
ఆడిబుల్ ఫ్రీ ట్ర‌య‌ల్‌
న‌చ్చిన పుస్త‌కాన్నిచ‌దవాల‌ని ఎవ‌రికి మాత్రంఉండ‌దు. కానీ  జాబ్ టెన్ష‌న్స్‌, ఇంట్లో ప‌నుల‌తో ఖాళీ ఉండాలిగా. ఇలాంటి వారికోసం ఆడియ‌బుల్ ఫ్రీ బుక్స్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.రెండు ఫ్రీ ఆడియ‌బుల్ బుక్స్‌తోపాటు అందులో ఉన్న బుక్స్ చ‌దువుకోవడానికి ఒక నెల ఫ్రీ ట్ర‌య‌ల్ ఇస్తుంది.
అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ ఫ్రీ ట్ర‌య‌ల్‌
మీరు స్టూడెంటా? అయితే మీ స్టూడెంట్ ఈమెయిల్ అడ్ర‌స్‌తో అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ ఫ్రీ ట్ర‌య‌ల్ ఆరునెల‌ల‌పాటు ఎంజాయ్ చేయొచ్చు.మామూలుగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఇచ్చిన‌ట్లే ఫ్రీ షిప్పింగ్‌, ఫ్రీ టీవీ షోస్‌, మూవీస్ వాచింగ్ వంటివ‌న్నీచేసుకోవ‌చ్చు.
అమెజాన్ ఇన్‌స్టంట్ వీడియో
మీరు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయినా లేదంటే 30రోజుల ఫ్రీ ట్ర‌య‌ల్‌లో ఉన్నా మీకు అమెజాన్ ఇన్‌స్టంట్ వీడియో ద్వారా మూవీస్‌,టీవీ షోలు ఫ్రీగా చూడొచ్చు. ఇందులో వేల కొద్దీసినిమాలు, టీవీషోల క‌లెక్ష‌న్ ఉంది.

జన రంజకమైన వార్తలు