• తాజా వార్తలు
  •  

వాట్సాప్ లో డిలీట్ అయిన ఫొటోల‌ను, వీడియోల‌ను రిక‌వ‌ర్ చేయడానికి పక్కా గైడ్

ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా వాట్స‌ప్ కామ‌న్‌. ఈ యాప్ లేకుండా ఏ స్మార్ట్‌ఫోన్ ఉండ‌ద‌న‌డంలో సందేహం లేదు. కేవ‌లం చాటింగ్ చేసుకోవ‌డానికి మాత్ర‌మే కాక‌.. వీడియోలు, ఫైల్స్ పంపుకోవ‌డానికి అనువుగా ఉండ‌డంతో వాట్స‌ప్ విశ్వ‌వ్యాప్త‌మైంది. అయితే వాట్స‌ప్‌తోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.  ఇందులో మ‌న ఫొటోలు, వీడియోలు ఒక్కోసారి పొర‌పాటున డిలీట్ కావొచ్చు. మ‌ళ్లీ అవి కావాలంటే తిరిగి రావు. అయితే చిన్న చిట్కాల ద్వారా మ‌న ఫొటోలు, వీడియోల‌ను తిరిగి సంపాదించొచ్చు. మ‌రి అదెలాగో చూద్దాం..

గ్రూప్ చాట్ నుంచి ఇలా..
గ్రూప్‌లో చాట్‌లో మీరు పంపిన ఇమేజ్ లేదా వీడియో పంపిస్తే ఒక‌వేళ ఆ వీడియో లేదా ఇమేజ్ డిలీట్ అయిపోతే ఏం చేయాలి. కానీ దీనికో ఆప్ష‌న్ ఉంది. ఆ గ్రూపులో ఉన్న మిగతా స‌భ్యులు ఆ వీడియో, ఫొటోల‌ను త‌మ డివైజ్‌లో సేవ్ చేసుకుని ఉండొచ్చు. మ‌ళ్లీ మీ ఇమేజ్ లేదా వీడియో మీకు రావాలంటే వారిని మ‌ళ్లీ ఆ గ్రూపులో పోస్ట్ చేయ‌మ‌నో లేక మ‌న‌కు ప‌ర్స‌న‌ల్‌గా పంప‌మ‌ని చెబితే స‌రిపోతుంది. 

చాట్ బ్యాక్ అప్ నుంచి...
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో వాట్స‌ప్ వాడుతున్న‌ప్పుడు చాట్ బ్యాక్ అప్ ఆప్ష‌న్ అనేబుల్ అయి ఉంటుంది. ఈ యాప్ మీ మెసేజ్‌లు అన్నిటిని బ్యాక్ అప్ చేస్తుంది. ఇది గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పంపిస్తుంది. ప్ర‌తిరోజూ రాత్రి 2 గంట‌లు దాటిన త‌ర్వాత ఈ మెసేజ్‌లు అన్నీ బ్యాక్ అప్ అయిపోతాయి. మీరు కొత్త ఫోన్ కొన్న‌ప్పుడో లేదా ఫోన్ రీసెట్ చేసిన‌ప్పుడు ఈ మెసేజ్‌లు మీకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇలా జ‌ర‌గాలంటే మీరు యాప్‌ను డిలీట్ చేసి మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

వాట్స‌ప్ మీడియా ఫోల్డ‌ర్ నుంచి..
వాట్స‌ప్ మీడియా ఫోల్డ‌ర్ నుంచి కూడా డేటాను రిక‌వ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఐఓఎస్‌లో మీకు ఫైల్ మేనేజ‌ర్ ఆప్ష‌న్ ఉన్నా..దీనిలో ఉన్న ఫైల్స్‌ను, యాప్స్‌ను వేరే వాళ్లు చూసే అవ‌కాశం ఉండ‌దు. అయితే ఆండ్రాయిడ్‌లో మాత్రం ఫైల్స్ లేదా యాప్‌లను అంద‌రూ చూసే అవ‌కాశం ఉంటుంది. ఇందుకోసం మేనేజ‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లో మీ ఇమేజ్‌లు, వీడియోలు క‌నిపిస్తాయి.

జన రంజకమైన వార్తలు