• తాజా వార్తలు
  •  

అమెజాన్‌లో కొన్న ఐట‌మ్స్ రిట‌ర్న్ చేయ‌డానికి ప‌ర్‌ఫెక్ట్ గైడ్ 

అమెజాన్‌.. ఇండియ‌న్ ఈ -కామ‌ర్స్ ఇండస్ట్రీలో త‌న‌దైన ముద్ర‌వేసిన బ‌డా సంస్థ ఇది.  పండ‌గ‌లు, న్యూఇయ‌ర్‌, క్రిస్మ‌స్‌, ఇలా ర‌క‌రకాల ఈవెంట్ల‌లో అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్స్ వంటివి పెడుతుంది. ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్యాష‌న్ యాక్సెస‌రీస్‌, బుక్స్‌, గ్రాస‌రీ ఇలా అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. అయితే ప్రొడ‌క్ట్ అన్‌సైజ్ ఉంద‌నో, మీరు ఆశించిన‌ట్లుగా లేక‌పోతే లేదా డ్యామేజ్డ్ పీస్ వ‌స్తేనే దాన్ని రిట‌ర్న్ చేయ‌డం ఎలాగో చెప్ప‌డానికే ఈ గైడ్‌.  
1. అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.   ఆర్డ‌ర్స్ పేజీలోకి ఎంట‌ర‌వ్వండి
2. ప్ర‌తి ఆర్డ‌ర్ ఒక బాక్స్‌లో ఉంటుంది. మీరు రిటర్న్ చేయాల‌నుకున్న ఆర్డ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు స్క్రోల్ చేయండి.  
3. ఆ బాక్స్‌లోకి వెళ్లాక  రైట్ సైడ్‌లో ఉన్న‌ Return items బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.  
4. మీరు రిటర్న్ చేయాల‌నుకున్న ఐట‌మ్స్ అన్నింటి ప‌క్క‌న ఉన్న బాక్స్‌ల్లో టిక్ చేయాలి.  
5.  రిటర్న్ చేయాల‌నుకున్న ప్రొడ‌క్ట్ ప‌క్క‌న రీజ‌న్‌ను సెలెక్ట్ చేయండి.  ఇప్పుడు   డ్రాప్ డౌన్ మెనూలో మీకు ఓ బాక్స్ క‌నిపిస్తుంది. దానిలో మీ ప్రాబ్ల‌మ్‌ను బ్రీఫ్‌గా రాయండి  
6.  Continue బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే త‌ర్వాత పేజీకి వెళ‌తారు.  
7. ఆ పేజీలో మీ ప్రాబ్ల‌మ్‌కి సొల్యూష‌న్ ( Refund ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. Continue బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి.  
8. త‌ర్వాత పేజీలో మీకు  schedule a pickup క‌నిపిస్తుంది. పిక‌ప్ డేట్ సెలెక్ట్ చేసుకోండి.  
9. మీ డెలివరీ అడ్ర‌స్ డిఫాల్ట్‌గా క‌నిపిస్తుంది.  అడ్రస్ మార్చాల‌నుకుంటే  Change addressని క్లిక్ చేయండి.
10. రిట‌ర్న్‌కు సిద్ధ‌మైతే  స‌బ్మిట్ నొక్కండి. అమెజాన్ మీద‌గ్గ‌రున్న ప్రొడ‌క్ట్‌ను రిట‌ర్న్ తీసుకుని రిట‌ర్న్ స్లిప్ ఇస్తుంది.  మీ రిఫండ్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే వ‌ర‌కు ఆ స్లిప్ జాగ్ర‌త్త‌గా ఉంచుకోండి.  

విజ్ఞానం బార్ విశేషాలు