• తాజా వార్తలు

హైబ్రీడ్ సిమ్ కార్డు స్లాట్ గైడ్

హైబ్రీడ్ సిమ్ స్లాటులు రాకముందు సిమ్ కార్డులకు వేరుగా, ఎస్డీ కార్డులకు వేరుగా స్లాట్లు ఉండేవి. కానీ.. హైబ్రీడ్ సిమ్ స్లాట్ల రాకతో పరిస్థితి మారిపోయింది. రెండింటికీ ఒకే ట్రే అన్నట్లుగా మారింది. అయితే... హైబ్రీడ్ సిమ్ స్లాట్ అంటే ఏంటి.. దానివల్ల ప్రయోజనాలేంటి... పరిమితులేంటన్నది చూద్దాం.

    హైబ్రీడ్ సిమ్ స్లాట్ ఉన్న ఫోన్లలో రెండు సిమ్ కార్డులతో డ్యూయల్ సిమ్  ఫోన్ గా వాడుకోవచ్చు. లేదంటే ఒక సిమ్, ఒక మైక్రో ఎస్డీ కార్డు వేసుకుని వాడుకోవచ్చు. అంతేకానీ, రెండు సిమి్ లు ఉండగా ఎస్డీ కార్డు వేసుకుని వాడడం కుదరదు. 

ఇవీ ప్రయోజనాలు
* ఒకప్పుడు సిమ్ తీసి మళ్లీ వేయాలంటే బ్యాక్ కవర్ తప్పకుండా తీయాల్సిందే. కొన్ని మోడల్స్ కు బ్యాటరీ కూడా తీయాల్సి వచ్చేది. కానీ... హైబ్రీడ్ సిమ్ స్లాటుంటే అలాంటి అవసరమే ఉండదు. ఫోన్ సైడ్ ప్యానల్ లో ఉండే ట్రేని తీసి అందులో ఏ సిమ్ కావాలంటే ఆ సిమ్ వేసుకుంటే చాలు. 
* వీటి వల్ల తయారీదారులు ఫోన్ ను స్లిమ్ గా తయారుచేసే వీలుంటుంది. అంతేకాదు.. బ్యాటరీ ప్లేసులో స్సేస్ ఆదా కావడంతో అక్కడ మరింత సామర్థ్యమున్న పెద్ద బ్యాటరీని వాడే వీలుంటుంది. లేదంటే.. డ్యూయల్ కెమేరాలు వంటివి సెట్ చేసుకునేలా స్పేస్ మిగులుతుంది.

ఇవీ ఇబ్బందులు..
* మార్కెట్లో ఉన్న చాలా ఫోన్లలో ప్రస్తుతం హైబ్రీడ్ సిమ్ స్లాట్లే ఉంటున్నాయి. వీటిలో రెండు సిమ్ లు , మెమొరీ కార్డు ఒకేసారి వేసుకోవడం కుదరదు. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమే. 

రెండు సిమ్ ట్రేలు వచ్చేస్తున్నాయ్..
అయితే.. హైబ్రీడ్ సిమ్ స్లాటుతో పడుతున్న ఇబ్బందులు గుర్తించిన కొన్ని సంస్థలు అందుకు విరుగుడు కనిపెట్టాయి. ఇలాంటి రెండు హైబ్రీడ్ సిమ్ ట్రేలను ఉపయోగిస్తున్నాయి. అప్పుడు ఒకదాంట్లో రెండు సిమ్ లు, రెండో దానిలో ఒక సిమ్ + ఒక మెమొరీ కార్డు కలిపి మొత్తంగా మూడు సిమ్ లు, ఒక మెమొరీ కార్డు వేసుకోవడం వీలవుతోంది.
 

జన రంజకమైన వార్తలు