• తాజా వార్తలు

‘జియో ఫోన్’ గురించి మీకు ఈ డౌట్లొచ్చాయా?

 

4జీ ఫీచర్ ఫోన్ ‘జియో ఫోన్’ గురించి జనంలో అనేక అనుమానాలు.. కరెక్టుగా మరో నెల రోజుల్లో ఈ ఫోన్ ప్రీబుకింగ్ ప్రారంభం కానున్నాయి.  అయితే.. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు సందేహాలు ఇప్పటికీ చాలా మంది వినియోగదారుల్లో క్లియర్ కాలేదు. 
* జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్ వస్తుందా..?
జియో ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పనిచేయదు. ఈ ఫోన్ కోసం రూపొందించిన వేరే ఓఎస్ పై పనిచేస్తుంది. కానీ.. వాట్సాప్ ఆ ఓఎస్ కు సూటవదు. సో.. ఇందులో వాట్సాప్ వచ్చే అవకాశం లేదు. అయితే... వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా  ఇందులోనే ఇన్ బిల్ట్ గా ఇచచ్చే జియో చాట్ యాప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. 
* ఒకసారి రీచార్జి చేస్తే చాలా..?
రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి అందులో వాడే సిమ్‌లను రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్‌కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు. 
* ప్రీ బుకింగ్ చేసేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలా ?
ఈ ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.  అలా చెల్లిస్తేనే ఆర్డర్ కన్ఫర్మవుతుంది.
* దీంతో పాటు జియో కేబుల్ టీవీ కూడా ఉచితం..
అస్సలు కాదు. జియో ఫోన్‌కు అనుసంధానించుకునే కేబుల్‌ను దానికి నిర్దేశించే ధర పెట్టి కొనాలి. దీని ధర రూ.500 ఉండొచ్చని తెలుస్తోంది.  దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్‌ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్‌ను వాడుకునే వీలుంటుందని తెలిసింది.
* ఈ ఫోన్ నుంచి డాటాను షేరింగ్ ఇవ్వొచ్చా?
 కుదరదు. ఇందులో మొబైల్ హాట్ స్పాట్ లేదు.
 

జన రంజకమైన వార్తలు