• తాజా వార్తలు

ల్యాప్‌టాప్‌లలో వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని మీరే స్వయంగా సాల్వ్ చేసుకోడానికి గైడ్-2

ల్యాప్‌టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్లలో చోటుచేసుకునే రిపేర్లను ఇంటి వద్దనే కూర్చొని ఫిక్స్ చేసుకునేలా పలు టిప్స్ అండ్ ట్రిక్స్‌ను గైడ్-1 రూపంలో మీకందించాం. వాటికి కొనసాగింపుగా పీసీ మెయింటేనెన్స్‌కు అవసరమైన మరికొన్ని టిక్స్‌ను గైడ్-2 రూపంలో ఇస్తున్నాం. ఇవిగో ఆ    టిప్స్‌..
గ్రాఫిక్స్ క్వాలిటీ నాసిరకంగా ఉందా..?
మీ కంప్యూటర్‌లో గ్రాఫిక్స్ క్వాలిటీ నాసిరకంగా ఉంటే ఫ్రేమ్ రేట్స్ దారుణంగా పడిపోతాయి. ఈ కారణంగా గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ సమయంలో క్వాలిటీ  పూర్తిగా మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే అదనపు గ్రాఫిక్స్ కార్డ్‌ను పీసీలో యాడ్ చేసుకోవాలి. ఇది కాస్తంత ఖరీదైన విషయమే అయినప్పటికీ   పీసీ పెర్ఫార్మెన్స్‌ మెరుగుపడాలంటే  తప్పదు. గ్రాఫిక్స్ కార్డ్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పటికి క్వాలిటీ సమస్య వేధిస్తుంటే కంప్యూటర్ పవర్ సప్లై యూనిట్‌ను అప్‌గ్రేడ్ చేసి చూడండి.
భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడాలంటే..?
మీ డెస్క్‌టాప్ కంప్యూటర్ భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడాలంటే దానిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలి.  ఇందుకోసం హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ చాలా కీలకమవుతాయి.  సీపీయూలో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌కు సిద్ధమయ్యే ముందు లోపలి కంటెంట్స్‌ను కొత్త జనరేషన్ కేస్‌లోకి మైగ్రేట్ చేసుకోవటం ఉత్తమం. ఇలా చేయటం ద్వారా అదనపు స్టోరేజ్‌, అదనపు  కార్డ్స్‌తో పాటు మల్టిపుల్ ఫ్యాన్‌లను సీపీయూలో ఏర్పాటు చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. దీంతో మీ డివైస్ కెపాసిటీ మరింత రెట్టింపు అవుతుంది. ఇదే సమయంలో భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.
 కంప్యూటర్ నుంచి అనవసర శబ్దాలా?
మీ కంప్యూటర్ నుంచి అనవసర శబ్దాలు వ‌స్తున్నాయంటే అవి క‌చ్చితంగా దానిలోని ఫ్యాన్ నుంచి వ‌చ్చేవే.  ఫ్యాన్‌లకు ఆయిలింగ్ చేయటం, దుమ్మును పూర్తిగా క్లీన్ చేయటం, ఫ్యాన్‌కు కేస్‌కు మధ్య  ఫోమ్‌ యాడ్ చేయటం వంటి హ్యాండ్ ఫిక్సులను అప్లై చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
పీసీ వైఫైకి క‌నెక్ట‌వ‌డం లేదా?
మీ ల్యాపీ లేదా పీసీలోబిల్ట్‌ఇన్ వై-ఫై కనెక్టివిటీ ఉన్నా ఇంటర్నె‌ట్‌కు కనెక్ట్ కాలేకపోతోందా? అయితే, ఈ సూచనలను ఫాలో అవ్వండి. ముందుగా  మీ కంప్యూటర్‌కు,  రౌటర్‌కు మధ్య ఉన్న దూరాన్ని అంచనా వేయండి. ఆ త‌ర్వాత కంప్యూటర్ లేదా రౌటర్ పొజిషన్‌ను మార్చి చూడండి. వీటి దిశను మార్చిన తరువాత సిగ్నల్ బ‌లంగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిన‌ట్లే. అప్ప‌టికీ క్లియ‌ర్ కాక‌పోతే  పవర్‌లైన్ అడాప్టర్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది.  మార్కెట్లో దొరికే చాలా డెస్క్‌టాప్ కంప్యూట‌ర్లు ఇతర్‌నెట్ పోర్టుతో  అవుతున్నాయి. ఈ పోర్టుకు పవర్‌లైన్ అడాప్టర్‌ను కనెక్ట్ చేయటం ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్ ప్రాబ్ల‌మ్స్ పూర్తిగా క్లియ‌ర్ అవుతాయి. 
కేస్ క్లీనింగ్‌తో స్పీడ్ ప‌నితీరు
కంప్యూటర్ కేస్‌ను తరచూ క్లీన్ చేస్తుంటే పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవ‌చ్చు.    క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కొద్దీ గాలిప్రసరణ తగ్గిపోతుంటుంది. దీంతో కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. కంప్రెస్డ్  ఎయిర్‌క్యాన్ లేదా వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించటం ద్వారా డస్ట్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవ‌చ్చు.
మౌస్‌‍, కీబోర్డు క్లీనింగ్‌
మీరు వాడుతున్నది ఎలాంటి మౌస్ అయిన సరే,  రెగ్యులర్ క్లీనింగ్ అవ‌స‌రం. చేతికి ఉండే చెమట అలానే గ్రీస్ మౌస్‌ బటన్స్‌లోకి చేరి వాటిని నిస్సత్తువగా మార్చేస్తుంది. కాబట్టి మౌస్ క్లీనింగ్  తప్పనిసరి.  రోజువారీ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్‌‍తో పాటు కీబోర్డును కూడా క్లీన్ చేస్తుండాలి.
కంప్యూటర్ ఉంచే ప్రదేశం ఎంతో కీలకం
 ఇంట్లో సెట్ చేసే కంప్యూటర్లకు గాలి ప్రసరణ చాలా ముఖ్యం. ఇదే సమయంలో వీటిని పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉంచటం మంచిది. సీపీయూలోకి నిత్యం చల్లగాలి ఫ్లో అవ్వటం వల్ల  లోపల జనరేట్ అయ్యే వేడి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయి ఫ్రెష్ ఎయిర్ జనరేట్ అవుతుంటుంది. దీంతో పెర్ఫామెన్స్ కూడా మెరుగుపడే అవకాశముంది.

జన రంజకమైన వార్తలు