• తాజా వార్తలు
  •  

లింక్డిన్  లైట్ యాప్‌ను ఎఫెక్టివ్ గా వాడుకోవడానికి గైడ్

లింక్డిన్ లైట్ (LinkedIn Lite) యాప్. ఇది మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెష‌న‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్ లింక్డిన్‌కు లైట్ వెర్ష‌న్‌.  ఇది ప్రస్తుతం  ఇండియ‌న్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ యాప్‌ను 60 దేశాల్లో రిలీజ్ చేయ‌డానికి మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తుంది.ఈ కొత్త యాప్‌లో ఇంకా ఏమేం విశేషాలున్నాయి?   లింక్డిన్ యాప్ ఉన్నా కూడా దీన్ని మ‌ళ్లీ ఎందుకు మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది. దీంతో యూజ్ ఏమిటో తెలియ‌జెప్పే కంప్లీట్ గైడ్ ఇది.
ఏమిటి ప్ర‌త్యేక‌త‌?
లింక్డిన్ ఆండ్రాయిడ్ యాప్ 20ఎంబీ ఉంటే ఈ లైట్ వెర్ష‌న్ 1 ఎంబీ కంటే త‌క్కువ సైజ్‌లో ఉంటుంది. కాబట్టి స్లో నెట్ వర్క్ కనెక్షన్లతో 2G, తక్కువ వేగం ఉన్న వై-ఫైతో కూడా ఫాస్ట్‌గా పనిచేస్తుంది.  ఒరిజినల్ లింక్డిన్ యాప్ కంటే వేగంగా ఉంటుంది. 5సెకన్ల కంటే త‌క్కువ టైంలోనే పేజీని డౌన్‌లోడ్ చేస్తుంది. వీటన్నింటితోపాటులింక్డిన్ యాప్‌తో కంపేర్ చేస్తే 80% డేటాను సేవ్ చేస్తుంది.
యూజ‌ర్ ఫ్రెండ్లీ
ఈ యాప్ హోం పేజీ చాలా ఈజీగా ఉంటుంది. న్యూస్ ఫీడ్స్, జాబ్ సెర్చ్, ప్రజలతో కనెక్ట్ అవడం, లింక్డిన్ కనెక్షన్లతో యాక్సెస్, చాట్, నోటిఫికేషన్లను పొందడం. ప్రొఫైల్ ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది.  
* యూజర్ ఇంటర్‌ఫేస్ సింపుల్, క్లీన్, ఫాస్ట్ గా ఉంటుంది. డేటాను తక్కువగా వాడేందుకు సహాయపడే ఎక్కువ గ్రాఫిక్స్ ఉండ‌వు.
*దీనిలోని నెట్‌వర్క్ ట్యాబ్ కేవలం మీ కనెక్షన్లను చూసేందుకు, చాట్ చేయ‌డానికి, కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు మాత్ర‌మే మిమ్మ‌ల్ని ప‌ర్మిట్ చేస్తుంది.
*టెక్స్ట్ మెసేజ్ డాక్యుమెంట్స్, ఇమేజ్‌లు పంపించడానికి కావాల్సిన ఆప్షన్ మెసేంజర్ ఉంది.
* ఎలాంటి అడిష‌న‌ల్ ఆప్షన్స్ లేకుండా సాధారణ నోటిఫికేషన్లను చూపిస్తుంది.సాధారణ టెక్స్ట్ పోస్ట్ తో షేర్ చేస్తుంది.
* జాబ్స్ కోసం సెర్చ్ చేయడానికి, జాబ్స్ వివరాలు చూసేందుకు కావాల్సిన ఆఫ్షన్స్ అందిస్తుంది.
* జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే అప్లై చేయడానికి ముందే ఎంత మంది జాబ్ కోసం అప్లై చేసుకున్నారు, సేవ్ చేసిన జాబ్స్, ప్రీమియం జాబ్స్ సెర్చ్ ఆప్ష‌న్స్ అన్నింటినీ చూపిస్తుది. 
ఎలా ఉపయోగించాలి?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో లింక్డిన్‌  లైట్ (LinkedIn Lite) యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. 
* యాప్ ఓపెన్‌చేసి మీ లింక్డిన్ అకౌంట్‌కు సైన్ ఇన్ అవండి. 
* ఇప్పుడు హోం, జాబ్స్, నెట్ వర్క్, ప్రొఫైల్ పేరుతో ఉన్న నాలుగు వేర్వేరు ట్యాబ్స్ కనిపిస్తాయి.
న్యూస్ ఫీడ్, షేర్ అప్ డేట్స్ చూడటం : హోం ట్యాబ్, మీ కనెక్షన్లకు సంబంధించి వచ్చే అన్ని ట్రేడింగ్ కమ్యూనిటీలను న్యూస్ ఫీడ్‌లో చూపిస్తుంది. టాప్‌లో ఉన్న  లింక్డిన్‌లో అప్‌డేట్‌ను షేర్ చేసుకోవడానికి ఆఫ్షన్ కూడా ఉంటుంది. అప్‌డేట్‌ను షేర్ చేయడానికి మీరు ఏది షేర్ చేయాలనుకుంటున్నారు  అనేది ఫీల్డ్‌లో  ప్రెస్ చేయవచ్చు. హోం ట్యాబ్ పైభాగంలో మెసేజ్, నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఉంటుంది. మెసేజ్ ఐకాన్లో ట్యాప్ చేస్తే అన్ని కన్వర్జేషన్ల‌తోపాటు లింక్డిన్ కనెక్షన్లతో చూడటానికి, కొత్తగా చాట్ ప్రారంభించేందుకు అనుమతిస్తుంది. అయితే నోటిఫికేషన్ ఐకాన్.. పెండింగ్ లో ఉన్నఇన్విటేషన్ల‌తోపాటు, మీ ఫ్రొఫైల్‌ను చూసినవారి గురించి అకౌంట్‌కు సంబంధించి అలర్ట్స్‌ను చూపిస్తుంది.
లింక్డిన్‌ లైట్ లో జాబ్స్: జాబ్స్ ట్యాబ్‌లో మీకు కావాల్సిన జాబ్స్ గురించి సెర్చ్ చేయవచ్చు.  లింక్డిన్ ప్రొఫైల్లో యాడ్ చేసిన జాబ్స్ గురించి సజెషన్స్ చూపిస్తుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ ఉద్యోగాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. మీరు ఇతర జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే అప్పుడు సెర్చ్ బార్‌ను ఉపయోగించుకోవ‌చ్చు. 
చాట్స్ కనెక్ట్ చేయ‌డం:  నెట్‌వ‌ర్క్ ట్యాబ్‌లో మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు లింక్డిన్ కనెక్షన్లను బ్రౌజ్ చేయడానికి మీకు అనుమతిస్తుంది. నెట్‌వర్క్ ట్యాబ్‌కు వెళ్లినప్పుడు, మీ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్న ఇన్విటేషన్స్, మీకు తెలిసిన వ్యక్తులతో కనెన్ట్ అయ్యేందుకు స‌జెష‌న్స్ క‌నిపిస్తాయి. కొత్త వ్యక్తులను సెర్చ్ చేయడానికి, వారితో కనెక్ట్ అవడానికి సెర్చ్ బార్ కూడా ఉంటుంది. లింక్డిన్‌లోఉన్న ఇతర వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు కనెక్ట్ బట‌న్‌ క్లిక్ చేయండి. టాప్‌లో ఉన్న కనెక్షన్స్ ఆప్షన్ ప్రెస్ చేస్తే.. లింక్డిన్‌లో ఉన్న అన్ని కనెక్షన్లను చూసేందుకు కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యూజర్స్ తో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రతి కనెక్షన్‌తో అసోసియేట్ చేయబడిన మెసేజ్ బటన్ కూడా కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే టెక్స్ట్ మెసేజ్ లు, అటాచ్‌మెంట్స్‌, డాక్యుమెంట్స్, ఇమేజ్‌లు కనబడుతాయి.
ప్రొఫైల్  ఎడిట్ చేయడం:  ప్రొఫైల్ ట్యాబ్‌లో మీ ప్రొఫైల్ చూడ‌డంతోపాటు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవ‌చ్చు.అంతేకాదు ఎంతమంది మీ ప్రొఫైల్ చూశారో చెక్ చేసుకోవ‌చ్చు. మొత్తం కనెక్షన్స్ , మీ కాంటాక్ట్ ఇన్ఫో మొత్తం కూడా ఈ ట్యాబ్‌లో చూడొచ్చు.

 


 


 

జన రంజకమైన వార్తలు