• తాజా వార్తలు

ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలా? ఒక్క‌సారి ఈ గైడ్ చ‌దవండి

డీమానిటైజేష‌న్ త‌ర్వాత ఇండియాలో ఆన్‌లైన్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌డం, జియో పుణ్య‌మా అని డేటా కూడా నేల‌కు దిగ‌డంతో అంద‌రూ ఫోన్లోనే ఆన్‌లైన ట్రాన్సాక్ష‌న్లు చేసేస్తున్నారు. అయితే వీటి విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా మీ డ‌బ్బుల‌కు రెక్క‌లొచ్చినట్లే. అందుకే ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ చేసేట‌ప్పుడు ఈ 10 జాగ్ర‌త్త‌ల‌ను గుర్తు పెట్టుకోవాల‌ని సైబ‌ర్ సెక్చూరిటీ  ఎక్స్‌ప‌ర్ట్స్  స‌జెస్ట్ చేస్తున్నారు.  వీటిలో చాలావ‌ర‌కు 5, 10 నిముషాలు టైం తీసుకునేవే. కానీ అవి పాటిస్తేనే మీ జేబు భ‌ద్రం.

1. ఇంటర్నెట్‌లో ప్రొడక్ట్ రివ్యూస్‌, ప్రైస్ రివ్యూస్ చూసేట‌ప్పుడు మాల్‌వేర్ ఉండే పాయిజ‌న్డ్  సైట్స్‌లోకి మిమ్మ‌ల్ని లీడ్ చేసే లింక్స్ ఉంటాయి.  కేస్ప‌ర్ స్కై యూఆర్ ఎల్ అడ్వ‌యిజ‌ర్ లేదా వెబ్ ఆఫ్ ట్ర‌స్ట్ లాంటి థ‌ర్డ్‌పార్టీ బ్రౌజ‌ర్ యాడ్ ఆన్స్ మిమ్మ‌ల్ని ఇలాంటి వాటి నుంచి కాపాడ‌తాయి. 
2.రిటైల‌ర్ వెబ్‌సైట్‌లో  ఉన్న లింక్‌ను క్లిక్ చేయొద్దు. కావాలంటే ఆ యూఆర్ ఎల్‌ను అడ్ర‌స్ బార్‌లో టైప్ చేయండి. లింక్ httpsతో స్టార్ట్ అయితేనే అది సెక్యూర్డ్ సైట్‌.  పేమెంట్  సైట్‌లో ప్యాడ్‌లాక్ సింబ‌ల్ (తాళం క‌ప్ప‌లాంటిది) ఉండాలి. ఉందో లేదో చూసుకోండి. 
3.  కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒక్క‌సారి ప‌ర్చేజ్ చేయ‌డానికి మాత్ర‌మే ప‌నికొచ్చే టెంప‌ర‌రీ క్రెడిట్ కార్డ్స్‌ను ఇస్తాయి. వాటిని వాడండి. లేదంటే లో లిమిట్ క్రెడిట్ కార్డునే ప్రిఫ‌ర్ చేయండి.  
4. మీ ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు పీసీ మీద ఎక్కువ ఆధార‌ప‌డితే దానిలో HTTPS ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్న‌గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌నే వాడండి.  ట్ర‌స్టెడ్ యాంటీవైర‌స్ ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ పీసీలో స‌ర్ఫింగ్ లేదా సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ చేయ‌కుండా ఉండండి.  
5.ఆన్‌లైన్ షాపింగ్ అవ‌స‌రాల కోసం ప్ర‌త్యేకంగా ఓ మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకుని దాన్నే వాడండి.  ఎందుకంటే ఆన్‌లైన్ సెల్ల‌ర్స్ నుంచి వ‌చ్చే మెయిల్స్‌లో చాలా మాలిషియ‌స్ ఈ మెయిల్స్ స్పామ్ మెసేజ్‌లుంటాయి.  
6. ఒకే పాస్‌వ‌ర్డ్‌ను అన్ని ర‌కాల అకౌంట్ల‌కు వాడ‌డం సేఫ్ కాదు. కాబట్టి ర‌క‌ర‌కాల పాస్‌వ‌ర్డ్‌లు త‌ప్ప‌నిస‌రి. వీటిని గుర్తు పెట్టుకోలేమ‌నుకుంటే పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ వాడండి.  
7. ప‌బ్లిక్ ప్లేస్‌ల్లోని కంప్యూట‌ర్స్ లేదా ఫ్రీ వైఫై ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ద్వారా కూడా ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేయ‌కండి. దానికంటే మీ మొబైల్‌లో సొంత డేటా ఉప‌యోగించి చేసుకోండి. 
8.మీ బ్యాంక్ లేదా ప‌ర్స‌న‌ల్ డేటాను బ్రౌజ‌ర్‌లో లేదా పేమెంట్స్ సైట్స్‌లో సేవ్ చేయ‌కండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు మొత్తం డిటెయిల్స్ ఇవ్వండి. సైట్ వ‌దిలిన ప్ర‌తిసారి లాగ‌వుట్ అవ్వ‌డం మ‌ర్చిపోకండి. 
9. చాలా యాప్స్ కూడా మొబైల్స్‌లోకి మాల్‌వేర్ తెస్తాయి. కాబ‌ట్టి అఫీషియ‌ల్ యాప్ స్టోర్ నుంచి మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోండి. 
10. రెప్యూటెడ్ సంస్థ‌ల‌యితేనే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయండి. చిన్న చిన్న మ‌ర్చంట్స్ నుంచి ఆన్‌లైన్‌లో ఏదైనా కొంటే క్యాష్ ఆన్ డెలివ‌రీ చేయండి.   

జన రంజకమైన వార్తలు