• తాజా వార్తలు
  •  

విండోస్‌లో రిక‌గ‌నైజ్ కానీ ఎక్స్‌ట్ర‌న‌ల్ హార్డ్‌డిస్క్ ఎర్ర‌ర్‌ని ఫిక్స్ చేయ‌డానికి గైడ్‌

చాలా సంద‌ర్భాల్లో మ‌నం కంప్యూట‌ర్‌లో అటాచ్ అయిన ఎక్స్‌ట్ర‌న‌ల్ డివైజ్‌లు డివైజ్ మేనేజ‌ర్‌లో క‌నిపించ‌వు. దీని వ‌ల్ల మ‌న‌కు అవ‌స‌రం ఉన్నా కూడా సిస్ట‌మ్ ఆ డివైజ్‌ల‌ను రీడ్ చేసే వ‌ర‌కు వాటిని ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉండ‌దు. మీ పీసీలో ఫ‌లానా డివైజ్ క‌నిపించ‌క‌పోతే మ‌రి ఏం చేయాలి? ఆ డివైజ్‌ను ఎలా క‌నిపించేలా చేయాలి? ..తిరిగి ఎలా ఉప‌యోగించుకోవాలి. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. డ్రైవ‌ర్లు,  కేబుల్ ప్రాబ్ల‌మ్స్‌, సాకేట్ ప్రాబ్ల‌మ్స్ ఇలా ఏదైనా కావొచ్చు. మ‌రి ఈ ప్రాబ్ల‌మ్స్‌ను క‌నుగొని ఫిక్స్ చేయ‌డం ఎలా?

ఎలా ఫిక్స్ చేయాలంటే..
విండోస్‌లో మీకు ఎదుర‌య్యే ఎక్స్‌ట్ర‌న‌ల్ డివైజ్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి కొన్ని ప‌ద్ద‌తులు ఉన్నాయి. మొద‌ట ప‌ద్ధ‌తి ట్ర‌బుల్ షూట‌ర్‌. దీని ద్వారా. సాధార‌ణంగా మ‌నం ఏదైనా డివైజ్‌ను సిస్ట‌మ్‌కు అటాచ్ చేసిన‌ప్పుడు క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం డ్రైవ‌ర్స్ లేదా క‌న్ఫిగ‌రేష‌న్ సెట్టింగ్స్‌. దీని కోసం విండో ట్ర‌బుల్ షూట‌ర్ ప్రొగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.  దీని వ‌ల్ల విండోస్‌లో ఎదుర‌య్యే సాధార‌ణ త‌ప్పుల‌తో పాటు బ్రేక్ క‌నెక్ష‌న్ లాంటి వాటిని ట్ర‌బుల్ షూట‌ర్ స‌రి చేస్తుంది. ఇంకా ఏమైనా త‌ప్పులు ఉంటే ఇలా స‌రి చేసుకోవ‌చ్చు.

1. ముందుగా విండోస్‌లో ట్ర‌బుల్ షూటింగ్ ప్రొగ్రామ్‌ను లాంఛ్ చేసుకోవాలి. స్టార్ట్ బ‌ట‌న్ ద్వారా సెర్చ్ చేయ‌డం ద్వారా మీరు ట్ర‌బుల్ షూటింగ్ ప్రొగ్రామ్‌ను క‌నుక్కోవ‌చ్చు. విండోస్ 7, 8, లేటెస్ట్ 10 వెర్ష‌న్ల‌లోనూ ఈ ప్రొగ్రామ్ ఇన్‌స్టాల్ చేసి ఉంది. 

2. ఒక‌సారి లాంఛ్ చేసిన త‌ర్వాత మీకు ఇందులో ఎన్నో ర‌కాల ట్ర‌బుల్ షూటింగ్ ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఎక్స‌ట్ర‌న‌ల్ డ్రైవ్‌లో ప్రాబ్ల‌మ్ ఫిక్స్ చేయ‌డం కోసం మీరు క‌న్‌ఫిగ‌ర్ ఏ డివైజ్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. 

3.  ట్ర‌బుల్ షూట్ ప్రొగ్రామ్ ఒక కొత్త పాప్ అప్ విండోలో ఓపెన్ అవుతుంది. ఆ త‌ర్వాత మీరు అడ్వాన్స్డ్ సెల‌క్ట్ ఆటోమెటికల్ రిపేర్స్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత నెక్ట్ క్లిక్ చేస్తే.. ఇది కొంత స‌మ‌యం తీసుకుంటుంది స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి

4. ఏదైనా ప్లాబ్ర‌మ్ దొరికితే ఇది ఆటోమెటిక్‌గా రిపేర్ చేసి ఫిక్స్ చేస్తుంది. ఆ త‌ర్వాత మీరు ట్ర‌బుల్ షూట‌ర్ క్లోజ్ చేసేయ‌చ్చు.

డ్రైవ‌ర్ అప్‌డేట్ ద్వారా..
డ్రైవ‌ర్ అప్‌డేట్ ద్వారా కూడా ఎక్స‌ట్ర‌న‌ల్ డ్రైవ్ ప్రాబ్లమ్స్‌ను ఫిక్స్ చేయ‌చ్చు. కొన్ని డ్రైవ‌ర్ల‌ను మాన్యువ‌ల్‌గా కూడా అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం కంట్రోల్ ప్యాన‌ల్ ఓపెన్ చేసి స్టార్ట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. విండోస్ 10లో రైట్ క్లిక్ చేసి స్టార్ట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ప్యాన‌ల్ ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత డివైజ్ మేనేజ‌ర్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ర‌న్ క‌మాండ్‌లో విండోస్ ప్ల‌స్ ఆర్ కీ ప్రెస్ చేయ‌డం ద్వారా కూడా దీన్ని ఓపెన్ చేయ‌చ్చు. ఆ జాబితాలో ఎక్స‌ట్ర‌న‌ల్ హార్డ్ డ్రైవ్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనిలో ప‌సుపు లేదా ఎరుపు రంగు గుర్తు క‌న‌బ‌డితే కంపాట‌బిలీటి ప్రాబ్ల‌మ్ అని అర్ధం. అప్పుడు రైట్ క్లిక్ చేసి అప్‌డేట్ డ్రైవ‌ర్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయ‌డం ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు