• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో హోటల్ రూమ్‌లో బుక్‌చేసేవారికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

హాలీడే కోస‌మో, ఆఫీస్ ప‌నిమీదో త‌ర‌చూ టూర్ల‌కు వెళ్లేవారు వెళ్లిన చోట హోట‌ల్లో దిగ‌డం త‌ప్ప‌నిస‌రి.   మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు ఏడాదికోసారైనా టూర్‌కు వెళ్ల‌డం ఇప్పుడు సాధార‌ణంగా మారింది. మీరు టూర్ ఆప‌రేట‌ర్ ప్యాకేజీ మీద వెళితే రూమ్ బుకింగ్ కూడా వాళ్లే చూసుకుంటారు.  అదే మీరు సొంతంగా వెళితే అక్క‌డ  మంచి హోట‌ల్ ఏమిటో క‌నుక్కుని బుక్ చేసుకుంటారు. కానీ ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే ట్రెండ్ కూడా బాగా పెరిగింది. అలాంటి వారికి ఎలాంటి సైట్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి? ఏ సైట్ ఎవ‌రికి సూట‌బుల్‌గా ఉంటుంది అని వివ‌రించే కంప్లీట్ గైడ్ ఇదీ..
1. మేక్ మై ట్రిప్  (Make My Trip)
ఆన్‌లైన్ భ‌హోట‌ల్ బుకింగ్ స‌ర్వీస్‌ల‌కు బెస్ట్ వెబ్‌సైట్ల‌లో ఫ‌స్ట్ వినిపించే పేరు మేక్ మై ట్రిప్‌. రోజూ కొన్నివేల మంది ఈ సైట్‌లో లోక‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్  హోట‌ల్స్‌లో రూమ్ బుక్ చేసుకుంటున్నారు. మీ బ‌డ్జెట్‌కు త‌గ్గ‌ట్లు హోట‌ల్ రూమ్స్ వివ‌రాల‌న్నీ ఈ వెబ్‌సైట్లో ఉంటాయి. రూమ్ బుకింగ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి.  వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా అందుబాటులో ఉంది.  ఫ్లైట్‌, ట్రైన్‌, బ‌స్ టికెట్ బుకింగ్‌తోపాటు మ‌నం వెళ్లే ఏరియాలో రూమ్ కూడా ఒకేసారి బుక్ చేసుకుంటే ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తుంది.
2. ట్రివియాగో (Trivago)
ఆన్‌లైన్ హోట‌ల్ బుకింగ్ వెబ్‌సైట్ల‌లో మ‌రో బెస్ట్ ఆప్ష‌న్ ట్రివియాగో.  ఇందులో హోట‌ల్స్ రూమ్స్‌, ఫెసిలిటీస్, ప్రైసెస్ కంపేరిజ‌న్ ఉంటుంది. దీనికితోడు రివ్యూస్‌, రేటింగ్స్ కూడా ఉండ‌డంతో మ‌న అవస‌రాల‌ను, బ‌డ్జెట్‌నుబ‌ట్టి రూమ్ బుక్ చేసుకోవ‌చ్చు. ట్రివియాగో సైట్‌లోకి వెళ్లి మీకు రూమ్ కావాల్సిన ఊరి పేరు టైప్ చేస్తే చాలు ఆ ఊళ్లో హోట‌ల్స్ డిటెయిల్స‌న్నీ మీ క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.  వివిధ హోట‌ల్స్ ఇచ్చే డిస్కౌంట్స్‌ను కూడా ఈ సైట్ చూపిస్తుంది.
3. యాత్రా (Yatra)
యాత్రాలో హోట‌ల్ రూమ్స్‌తోపాటు ట్రైన్‌, బ‌స్‌, విమానం టికెట్స్ కూడా సులువుగా బుక్ చేసుకోవ‌చ్చు.  హోం పేజీలో హోట‌ల్స్‌కు సంబంధించి హాట్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీ ట్రిప్ హాలీడేనా లేదా ఆఫీస్‌, మీటింగ్ ప‌ర్ప‌స్ అనేది మీరు స్పెసిఫై చేస్తే దానికి స‌రిప‌డా రూమ్స్‌ను మీకు చూపిస్తుంది.
4. బుకింగ్‌.కామ్ (Booking.com)
బుకింగ్‌.కామ్ వెబ్‌సైట్‌.. ఆన్‌లైన్ హోట‌ల్ బుకింగ్ వెబ్‌సైట్ల‌లో ఒక జెయింట్ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ ద్వారా 299 దేశాల్లోని ల‌క్షా 25వేల ప్రాంతాల్లో ఎక్క‌డైనా మీరు హోట‌ల్ రూమ్ బుక్ చేసుకోవ‌చ్చు. దీనికి యాప్ కూడా ఉంది. 40 భాష‌ల్లో సేవ‌లందిస్తోంది.  మంచి డిస్కౌంట్లు పొంద‌వ‌చ్చు. ఆ హోట‌ల్‌లో దిగిన గెస్ట్‌లు షేర్ చేసిన జెన్యూన్ ఫొటోలు, రివ్యూస్ చూసి రూమ్ బుక్ చేసుకోవ‌చ్చు. 
5. గో ఐ బిబో (Goibibo)
ఫ్లైట్ టికెట్ లేదా హోట‌ల్ రూమ్ బుక్ చేసుకోవ‌డానికి గో ఐబిబో సూప‌ర్ ఛాయిస్ అని చెప్పొచ్చు. గో ఐబిబో సైట్‌లో ఫ‌స్ట్‌టైమ్ మీరు సైన్ అప్ చేసిన‌ప్పుడు వెల్‌క‌మ్ రివార్డ్ పాయింట్స్ (GoCash) ఇస్తుంది. వీటిని మీరు హోట‌ల్ బుకింగ్స్ కోసం వాడుకోవ‌చ్చు. భారీడిస్కౌంట్లు కూడా ఇస్తుంది.  చివ‌రి రెండు గంట‌ల వ‌ర‌కు ఎప్పుడు క్యాన్సిల్ చేసినా 100% మ‌నీ రిట‌ర్న్ ఇస్తుంది. 
6.ఓయో (OYO)
ఓయో.. ఇటీవ‌లే మార్కెట్లోకి వ‌చ్చిన వెబ్‌సైట్‌. అయితే త‌క్కువ ధ‌ర‌లో (1000 రూపాయ‌ల నుంచి) హోట‌ల్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి బాగా పాపుల‌ర్ అయింది.
Expedia,  Agoda.com, Hotwire.com, Priceline వంటి వెబ్‌సైట్ల‌లో కూడా మంచి ఆఫ‌ర్ల‌తో హోట‌ల్ రూమ్స్ బుక్ చేసుకోవ‌చ్చు.