• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్‌లో డిలీట్ చేసిన ఫైల్స్‌ను  పీసీ ద్వారా రిక‌వ‌ర్ చేయ‌డానికి గైడ్‌

ఆండ్రాయిడ్ ఫోన్‌లో  డిలీట్ అయిన ఫైల్స్‌ను .రూట్ చేసిన డివైస్‌లో రిక‌వ‌రీ చేయ‌డానికి ట్రిక్స్ ఇంత‌కు ముందు ఆర్టిక‌ల్‌లో చెప్పుకున్నాం.  మీ ఫోన్‌ను రూట్ చేయ‌కపోయినా కూడా ఫైల్స్ రిక‌వ‌రీ చేసుకోవ‌చ్చు. దీనికి మీకు పీసీ కావాలి. 

1. Recuva  అనే ఫ్రీ వేర్‌ను  డౌన్‌లోడ్ చేయండి.

2. ఇన్‌స్టాల్ చేసి లాంచ్ చేయండి. త‌ర్వాత మీ ఫోన్‌ను డేటా కేబుల్ ద్వారా పీసీకి క‌నెక్ట్ చేయండి. స‌ర్మిష‌న్ అడుగుతుంది. ఒకే చేయండి.

3.recuva-start up  ఆప్ష‌న్ వ‌స్తుంది. త‌ర్వాత విజార్డ్‌ను చూపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి.

4.recuva-file-recover-wizard క‌నిపిస్తుంది. ఇందులో మీరు ఏదైనా ఫైల్  టూప్ గానీ లేదా ఆల్ ఫైల్స్ గానీ సెలెక్ట్ చేసుకోండి.

5. recuva-recover-file-type వస్తుంది. ఇందులో నుంచి 5వ ఆప్‌ున్ (In a Specific Location) క్లిక్ చేయండి.

6.  బ్రౌజ్ బ‌ట‌న్ క్లిక్ చేసి మీ ఫైల్స్ ఎక్క‌డి నుంచి రిక‌వ‌ర్  చేయాలో పాత్ సెలెక్ట్ చేయండి.  మీ ఫైల్స్ అక్క‌డికి రిక‌వ‌ర్ అవుతాయి. 

జన రంజకమైన వార్తలు