• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్‌లో డిలీట్ చేసిన ఫైల్స్‌ను రిక‌వ‌ర్ చేయ‌డానికి పక్కా గైడ్‌

ఆండ్రాయిడ్ ఫోన్‌లో మ‌న స్ట‌ఫ్ బోల్డంత ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు, కాంటాక్ట్స్ అన్నీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీలోగానీ, ఎక్స్‌ట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎస్డీ కార్డ్‌)లోగానీ సేవ్ అవుతాయి. పొర‌పాటున అవి డిలీట్ అయిపోతే చాలా ఇబ్బందిప‌డ‌తాం.  కానీ వాటిని రిక‌వ‌రీ చేసుకోవ‌చ్చు కూడా. అది ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకోండి.

రూట్ చేసిన  ఆండ్రాయిడ్ డివైస్‌లో ఫైల్స్‌ను రిక‌వ‌ర్ చేయ‌డం
ఆండ్రాయిడ్‌లో డిలీట్ అయిన ఫైల్స్ రిక‌వ‌రీ చేయాలంటే ఆండ్రాయిడ్ డివైస్‌ను రూట్ చేసి ఉండాలి.  మీ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3ఆపైన వ‌చ్చిన ఓఎస్‌తో కూడిన‌ది ఉండాలి. ఇప్పుడు ఇంచుమించుగా అంద‌రి ఫోన్లు  ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో (6.0), ఆండ్రాయిడ్ నోగ‌ట్ (7.0, 7.1.1) వంటి లేటెస్ట్ వెర్ష‌న్ల‌వే ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. దీంతోపాటు స‌రిగ్గా రూట్ చేసిన ఆండ్రాయిడ్ డివైస్‌ ఉండాలి. ఈ డివైస్‌లో  DiskDigger యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. దీనికి మందు Settings >> Security Option లోకి వెళ్లి Unknown Sourcesను యాక్సెస్ చేయాలి.

డిస్క్‌డిగ్గ‌ర్ ప్రో యాప్ ద్వారా ఫైల్స్ రిక‌వ‌రీ ఇలా
ఆండ్రాయిడ్‌లో ఫైల్స్ రిక‌వ‌ర్ చేయ‌డానికి Diskdigger చాలా మంచి సొల్యూష‌న్‌.  మీరు రీసెంట్‌గా మీ ఫోన్‌ను ఫార్మాట్ చేసినా కూడా ఫైల్స్‌ను రిక‌వ‌ర్ చేయ‌గ‌ల‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. డిస్క్ డిగ్గ‌ర్ యాప్ ద్వారా ఫైల్స్ రిక‌వ‌రీ ఎలా చేయాలంటే..
1. Diskdigger Pro Apkను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయండి.
2 మీ ఫైల్ ఎక్క‌డ సేవ్ చేశారో లొకేష‌న్ సెర్చ్‌చేయండి.
3.Apk ఫైల్‌మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
4. ఇన్‌స్టాల్ చేశాక లాంచ్ చేయండి
5. ఇప్పుడు ఫోన్ లేదా ఎస్డీ కార్డ్ మెమ‌రీ  సెలెక్ట్ చేయండి
6. diskdigger లొకేష‌న్ స్కాన్ చేస్తుంది
7. ఇప్పుడు మీ డిలెటెడ్ ఫైల్ టైప్ (ఉదాహ‌ర‌ణ‌కు వీడియో ఆ త‌ర్వాత  Mp4) సెలెక్ట్ చేసి OK బ‌ట‌న్ నొక్కండి.
8. మీ మొబైల్ పెర్‌ఫార్మెన్స్‌, మెమ‌రీ కార్డ్ స్పీడ్‌,  ఎన్ని ఫైల్స్ ఉన్నాయో వీట‌న్నింటిని బ‌ట్టి అది ఓపెన్ అవ‌డానికి కొంత టైం ప‌డుతుంది.
9. ఇప్ప‌డు మీ ఫోన్‌లో నుంచి డిలెట్ అయిన ఫైల్స్ లిస్ట్ క‌నిపిస్తుంది.
10. ఫైల్స్‌సెలెక్ట్ చేసి  Menu  క్లిక్ చేసి Recover Selected Files ను సెలెక్ట్ చేయండి. గూగుల్ డ్రైవ్‌, డివైస్‌, ఎఫ్‌టీపీల్లో ఎక్క‌డ సేవ్ చేయాలో ఆప్ష‌న్ ఇస్తే చాలు మీ ఫైల్స్ అక్క‌డికి రీస్టోర్ అయిపోతాయి.

డిస్క్‌డిగ్గ‌ర్ యాప్‌తో ఫొటోలు రిక‌వ‌ర్ చేయడం
మీ డివైస్ రూట్ చేయ‌క‌పోయిన‌ట్ల‌యిఒతే డిస్క్‌డిగ్గ‌ర్ ఫ్రీ యాప్‌తో కూడా ఫొటోలు రిక‌వ‌ర్ చేయొచ్చు.  అయితే ఈ ప‌ద్ధ‌తిలో ఫొటోలు మాత్ర‌మే రివ‌క‌ర్ చేయ‌గ‌లుగుతాం.
1. Diskdigger యాప్‌ను  డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.
2. ఎస్డీ కార్డు లేదా ఫోన్ మెమ‌రీని సెలెక్ట్ చేయండి.
3. ఫైల్ టైప్‌ను సెలెక్ట్ చేసి స్కాన్ చేయండి.
4. ఇప్పుడు మీకు డిలీట్ అయిన ఫోటోల లిస్ట్ వ‌స్తుంది.
5. సెలెక్ట్ చేసి  Recover నొక్కండి
6. ఎక్క‌డ సేవ్‌చేయాలో సెలెక్ట్ చేయండి.

జన రంజకమైన వార్తలు